బిర్యానీ అంటే…? బిర్యానీయే… ఒక వంటకం పేరు అది… అందులోనూ రకరకాల బిర్యానీలు… మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్, బీఫ్… ఏ జంతుజాలాన్ని వండేటప్పుడు వేస్తారో దాన్ని బట్టి దానికి పేరు… వండే తీరును బట్టి కూడా రకరకాలు… ధమ్ బిర్యానీ ఎట్సెట్రా… బిర్యానీ తినే తీరును బట్టి కూడా రకరకాలు… ఒకే ప్లేటులో నలుగురైదుగురు కలిసి తింటే అది మండీ బిర్యానీ… నిజానికి బిర్యానీ వండటం అనేది గొప్ప కళ… హైదరాబాదులో కొందరు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వండినందుకే ప్లేటుకు వంద, రెండొందల చొప్పున తీసుకునేవారున్నారు… ఆ మసాలా కలపడంలో ఉన్నది కళ…
ఎప్పుడో ఓసారి తాజ్‌మహల్ వద్దకు వెళ్తే ఆ అందాన్ని ఆస్వాదిస్తాం… అక్కడే ఉండి, రోజూ చుడువా అమ్ముకునేవాడిలో ఆ రసాస్వాదన ఉండదు, అక్కర్లేదు… అలాగే హైదరాబాద్‌లో ఉన్నవాడికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇంటికోడిలా పప్పుతో సమానం… కానీ బయటి నుంచి వచ్చీపోయేవాడికి హైదరాబాద్ బిర్యానీ అంటే అదొక కోరిక… ఇష్టం… పాతబస్తీ బిర్యానీ తినేవాడికి ప్యారడైజ్ బిర్యానీ నిజంగానే ఉత్తపప్పు… సేమ్, బావర్చి అంటే బావర్చియే… బావర్చిలో నూనె కాస్త ఎక్కువ అనే కంప్లయింట్ తప్ప దాని టేస్ట్ ఏ హోటల్ వాడికీ చేతకాలేదు… గ్రీన్, రెడ్, యెల్లో అంటూ రకరకాల బావర్చిలు కనిపిస్తాయి… కానీ ఒరిజినల్ చార్మినల్ చౌరస్తా బావర్చికి ఇంకెక్కడా బ్రాంచీలు లేవు…
సందర్భం ఏదైనా సరే… బయటి నుంచి తెప్పించుకునే ఫుడ్ అంటే బిర్యానీయే… అందులోనూ చికెన్ బిర్యానీని కొట్టింది లేదు… బిర్యానీ లేక స్విగ్గీలు లేవు, జొమాటోలు లేవు… బిర్యానీ అనగానే ఇలా నోరూరుతూనే ఉంటుంది… రాత కూడా ఇక ఓచోట ఆగదు… నిన్నటి నాదెళ్ల సత్య వార్త ఒకటి చదివాక అనిపించింది… అసలు బిర్యానీని మన హైదరాబాదీలే సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని..! ఆ వార్త ఏమిటంటే..?
Ads
కృత్రిమ మేధ, అనగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారంగా నడిచే ఓ యాప్ చాప్ జీపీటీ… దాంతో సత్య నాదెళ్ల చాట్ నిర్వహించాడు… సౌత్ ఇండియాలో పాపులర్ టిఫిన్స్ ఏంటి అనడిగాడు సరదాగా… అదేమో ఇడ్లి, వడ, దోసెతోపాటు బిర్యానీని కూడా చూపించింది… దాంతో ఆయన చిన్న బుచ్చుకున్నాడు… బిర్యానీని టిఫిన్‌గా వర్గీకరించడం ఏమిటి..? హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తనను ఇది అవమానిస్తోందని మొహం మాడ్చేశాడు… దాంతో చాట్ జీపీటీ అప్పటికప్పుడు దాని వర్గీకరణను వెనక్కి తీసుకుని, సత్య నాదెళ్లకు సారీ చెప్పింది… ఇదంతా జస్ట్, ఓ సరదా…
నిజానికి ఆయనకు సదరు యాప్ సారీ చెప్పాల్సిన పనిలేదు… సత్యకే అసలు టిఫిన్ అంటే ఏమిటో తెలియదు… బిర్యానీ మీద తన ఇష్టం వేరు, కానీ దాన్ని టిఫిన్‌గా వర్గీకరిస్తే అది కించపరిచినట్టూ కాదు… హైదరాబాద్‌లో బిర్యానీని బ్రేక్ ఫాస్ట్‌గా కూడా తీసుకునేవాళ్లు లక్షల్లో… ఏముంది..? స్వల్ప పరిమాణంలో తీసుకుంటే అది టిఫిన్ అంటే… ఆ లెక్కన వడ, ఇడ్లీ, దోసె, పూరి, బోండా, ఉప్మాలను టిఫినీలుగా వర్గీకరించడమే కరెక్టు కాదు… వాటిల్లోని కేలరీలు, తీసుకునే పరిమాణాన్ని బట్టి దాన్ని అల్పాహారమో, ఆహారమో పరిగణించాలి… అంతే… హైదరాబాద్‌లో చాలా పాపులర్ స్ట్రీట్ ఫుడ్ బోండా… కేలరీ లెక్కల్లో అది ఆహారమే… అల్పమేమీ కాదు… ఓ చిన్న కటోరీలో కర్డ్ రైస్ లేదా సాంబార్ రైస్, లెమన్ రైస్ తీసుకుంటే దాన్ని మీల్స్ అనలేం… సో, బిర్యానీని టిఫిన్ అని, అనగా అల్పాహారమని వర్గీకరించడంలో తప్పు లేదు… లేదు…!!
Share this Article