Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొరత… అర్జెంటుగా తెలుగు సినిమాకు కొత్త హీరోయిన్లు కావాలిప్పుడు…

January 10, 2023 by M S R

ఇప్పుడు డిస్కషన్ ఏమిటంటే… శ్రీదేవి బిడ్డ జాన్వీ ఉంది కదా… ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఆలోచన… అందులో జూనియర్ ఎన్టీయార్ హీరోయిన్… ఇప్పుడప్పుడే కాదులెండి… ప్రశాంత్ చేతిలో ఒకటీరెండు పెద్ద ప్రాజెక్టులున్నయ్… అందులో ఒకటి ప్రభాస్‌తో తీస్తున్న సాలార్… అవి అయిపోయాక కదా జూనియర్‌తో సినిమా…

జాన్వీని అడిగితే కళ్లు తిరిగే రేటు చెప్పిందట… ఆమె అనుభవం మూడునాలుగు సినిమాలు… అందులో ఒకటీ క్లిక్ కాలేదు… పెద్దగా నటన తెలుసా అంటే అదీ లేదు… జస్ట్, శ్రీదేవి అనే బ్రాండ్ నేమ్‌తో చలామణీ అవుతోంది… సౌత్ సినిమాల్లోకి ఇప్పటివరకూ రాలేదు… రావమ్మా, నెత్తిన పెట్టుకుంటాం అనడిగితే ఇదుగో ఇలా కళ్లు తిరిగే రేట్లు చెబుతోంది…

సరే, ఆమె అడిగింది, నిర్మాతలు ఇస్తే వస్తుంది, లేకపోతే లేదు… కానీ డిస్కషన్ ఏమిటంటే ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరు..? సీతారామం సినిమాలో చేసిన మృణాల్ ఠాగూర్ కేవలం ఆ ఒక్క సినిమాతోనే తెలుగువాళ్లకు పరిచయం… సినిమా సక్సెస్ కాబట్టి ఆమెకు డిమాండ్ పెరిగింది, రేటు పెరిగింది… అక్షరాలా కోటి అడుగుతోంది…

Ads

jhanvi

సాయిపల్లవి ఔట్ ఆఫ్ రీచ్… అనుష్క వంటి సీనియర్లు ఫీల్డ్‌కు దూరదూరంగానే ఉంటున్నారు… రష్మిక హాట్ చాయిస్… ఒక నిర్మాత అడిగితే ఏకంగా 6 కోట్లు చెప్పిందట… పుష్ప సక్సెస్‌తో ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది… తమిళం, హిందీ మార్కెట్ కూడా ఉంది ఆమెకు… వెటరన్ కాజల్ పెళ్లయిపోయింది… జనం మరిచిపోయిన శృతిహాసన్‌ను తీసుకొస్తున్నారు… చిరంజీవి, బాలయ్య వెటరన్స్ కాబట్టి చల్తా… కుర్ర హీరోలు అంగీకరించరు…

పూజా హెగ్డే ఇప్పుడు తెలుగు స్టార్ కాదు… తమన్నాకు మార్కెట్ లేదు ఇప్పుడు… దీపిక పడుకోన్ వంటి పఠాన్ కుర్రది కావాలంటే రేటు కూడా ఆకాశంలోనే ఉంటుంది మరి… సో, ఫస్ట్ కేటగిరీలో కాస్త రీజనబుల్ రేటుకు దొరికే క్రెడిబుల్ హీరోయిన్ ఎవరూ లేరిప్పుడు… శ్రీలీలకు మస్త్ డిమాండ్ ఏర్పడిందంటే అర్థముంది… మంచి డాన్సర్, చూడబుల్ ఫేస్, మంచి ఈజ్… కార్తికేయ, 18 పేజెస్ హిట్స్ తర్వాత అనుపమకు కూడా డిమాండ్ పెరిగింది… ఇలాంటి ముగ్గురు నలుగురు హీరోయిన్లు కావాలి ఇప్పుడు తెలుగు సినిమాకు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఫాఫం హైపర్ ఆది..! ఈటీవీ షోలో రోజురోజుకూ ఈ దిగజారుడేమిటో..!?
  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions