మొత్తానికి థమన్ భలే చెప్పాడు… కాదు, అంగీకరించాడు… పాత సినిమాల్లోని ట్యూన్లను కాపీ కొట్టేస్తామని చెప్పేశాడు… జైబాలయ్య అనే పాటకు తను వాయించిన ట్యూన్ గతంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఒసేయ్ రాములమ్మ టైటిల్ సాంగ్‌తో పోలి ఉందని సోషల్ మీడియా ఆల్‌రెడీ థమన్ బట్టలిప్పింది… థమన్ ఏ పాట చేసినా సరే, క్షణాల్లో అది గతంలో ఏ సినిమాలో వచ్చిందో, ఎక్కడి నుంచి కాపీ కొట్టారో సోషల్ మీడియా బయట పెట్టేస్తోంది…
గతంలోనైతే ‘నో, నో, మేం కాపీ కొట్టం, ఒకవేళ పాత ట్యూన్లతో పోలి ఉంటే వెంటనే పట్టుకుని అలర్ట్ చేయడానికి మాకు ఓ స్పెషల్ యాప్ ఉంది, జాగ్రత్తపడతాం’ అని ఏదేదో కారణాలు చెప్పుకొచ్చేవాడు… కానీ ఇవన్నీ డొంకతిరుగుడు సాకులు దేనికి, ఎవడూ నమ్మడం లేదు అనుకున్నాడేమో… ఈసారి స్ట్రెయిట్‌గా అంగీకరించాడు… కాకపోతే సిధ్ శ్రీరాం పాటలకు అనంత శ్రీరాముడి పిచ్చి సమర్థనలాగా ఉంది అది…
నో డౌట్… ఈరోజు తెలుగులో నంబర్ వన్, నంబర్ టూ సంగీత దర్శకులు అంటే డీఎస్పీ, థమన్… జబర్దస్త్ పోటీ ఉంది ఇద్దరికీ… ఇప్పుడు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల పేరిట చిరంజీవి, బాలయ్య కాదు పోటీపడుతున్నది… ఈ సంక్రాంతి పోటీ థమన్, డీఎస్పీల నడుమే… విచిత్రంగా ఇద్దరూ బ్లండర్సే చేస్తున్నారు… కాకపోతే థమన్ అంగీకరించేస్తున్నాడు… పీకలు (బూరలు) పట్టుకుని, వినాయక నిమజ్జనంలో ఊదినట్టు, వీరయ్య సినిమా పాటలో తనూ పిచ్చిగా ఊదుతూ ఇదే సంగీతం అంటున్న డీఎస్పీ మాత్రం ఇంకా ఏదీ అంగీకరించడం లేదు…
Ads
అఖండ తరువాత థమన్ పేరు మారుమోగిపోయింది… పాటలు చెత్త… ఐతేనేం, బీజీఎంను ఓ రేంజులో తీసుకుపోయాడు… ఇప్పట్లో ఆ రేంజు బీజీఎం వేరేవాళ్లకు కష్టం… కాస్త హనుమాన్ సినిమాలో బీజీఎం బాగుండబోతున్నట్టు అనిపిస్తోంది… ఇక ఒసేయ్ రాములమ్మ పాట కాపీ విషయానికొస్తే ‘‘నిజమే, ఒసేయ్ రాములమ్మా ట్యూన్ కాపీ చేశాం. ఈ సాంగ్ చేస్తున్నప్పుడే నాకు… నాకే కాదు… దర్శకుడు గోపికి, రైటర్ రామజోగయ్య శాస్త్రికి కూడా తెలుసని చెప్పుకొచ్చారు’’ థమన్…
”వందేమాతరం శ్రీనివాస్ ఒసేయ్ రాములమ్మ పాటకి నేనే వాయించా. అలాగే వచ్చాడయ్యో సామి పాటని కూడా అందులో నుండే లేపారు. ఇవన్నీ ఒక కల్ట్ ఇమేజ్ వున్న పాటలు. ఈపాట చేస్తున్నపుడే ఒసేయ్ రాములమ్మతో పోలిక వస్తుందని తెలుసు. తెలిసే చేశాం. ఇలాంటి క్రౌడ్ థీమ్ వున్న పాటలు దాదాపు ఒకే పిచ్ లో వుంటాయి. అందుకే ఎక్కడో విన్న ఫీలింగే కలుగుతుంది” అని చెప్పుకొచ్చాడు…
వచ్చాడయ్యో స్వామీ పాట భరత్ అనే నేను సినిమాలోనిది… దానికి డీఎస్పీ మ్యూజిక కంపోజర్… అది కూడా ఒసేయ్ రాములమ్మ పాట నుంచి లేపిన ట్యూనే అని థమన్ చెబుతూ… ఈ రచ్చలోనికి డీఎస్పీని కూడా లాగాడు… ‘అది కల్ట్ ఇమేజ్ ఉన్న పాట, ఏ పాట చేసినా సరే, ఆ పాటలాగే వినిపిస్తుంది’ అనేది ఓ విఫల సమర్థన… సేమ్ పిచ్‌లో ఉంటాయనేది కరెక్టు కావచ్చు, దాని సంగతి వదిలేద్దాం… మరి కాపీ ఆరోపణలు వచ్చిన మిగతా పాటల మాటేమిటి..? *నేను దొంగనే… వాడు కాదా, అసలు ఎవరు కాదు* అన్నట్టుగా ఉంది కదా…
Share this Article