అసలు పెద్ద పెద్ద పత్రికల రిపోర్టర్లకే పొట్టచీరితే కాస్త మంచి భాషలో రాయడం తెలియదు… సబ్ ఎడిటర్లకే భాష తెలియదు… మస్తు జీతాలు తీసుకుంటున్న తోపు జర్నలిస్టులకే ఏ అక్షరం పొట్టలో చుక్క పెట్టాలో, దేనికి జట పెట్టాలో, దేనికి దీర్ఘం అవసరమో, ఎక్కడ స్పేస్ అవసరమో తెలియదు… అనవసర ప్రత్యయం అనే పదానికి అర్థం తెలిసినవాళ్లు మొత్తం జర్నలిస్టుల్లోనే అయదారుశాతం ఉండరు… ప్లీజ్, నవ్వొద్దు, నేను ఎవరినీ అవమానించడం లేదు… మేం తోపు ఎడిటర్లం అని చెప్పుకునే వాళ్లకే రాతలో ఏది కరెక్టో తెలియదు… చివరకు జర్నలిజం స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు కూడా… బేసిక్ సంధులు, సమాసాలు, ఉచ్ఛరణలు, సరైన పదాలు తెలిసి పాడుగావు…
ఇక విషయానికి వద్దాం… చిన్న చిన్న పత్రికల్లో పనిచేసేవాళ్లకు, ఏదో కడుపు తిప్పల కోసం యూట్యూబ్ చానెళ్లు మెయింటెయిన్ చేసేవాళ్ల దగ్గర జర్నలిజం ప్రమాణాలు, భాష మెళకువలు ఏం ఆశించగలం..? ఏదో అనివార్యత..? ఓపిక ఉంటే మాదచ్చోద్ తెలుగు టీవీ సీరియళ్లను భరించినట్టు భరించాల్సిందే… అసలు నటన అంటే తెలియని దేభ్యం మొహాలను స్టార్ హీరోలుగా అంగీకరించడం లేదా ఏం..? ఇదీ అంతే… ఇప్పుడు విషయం ఏమిటీ అంటే..? ఇదుగో ఇదీ…
ఆ పత్రిక ఏమిటో మనకు తెలియదు… ఆయన ఎక్కడి ఎమ్మెల్యేనో తెలియదు… అసలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రుల పేర్లే ఎవరికీ తెలియదు, వాళ్ల పోర్ట్ ఫోలియోలు ఏమిటో వాళ్లకూ తెలుసోలేదో తెలియదు… చాలామందికి పీఆర్వోలు ఉంటారు, అనేక సోషల్ అకౌంట్లు మెయింటెయిన్ అవుతూ ఉంటయ్… కొన్ని పత్రికలూ ఉంటయ్… ఇవన్నీ పొట్టతిప్పలు…
Ads
చూశారా, చూశారా, ఇదా తెలుగు భాష, ఇదా జర్నలిజం..? భజన అంటూ ఏవేవో పోస్టులు కనిపిస్తున్నాయి…. అరె, నంబర్ వన్, టూ, త్రీ, ఫోర్ పత్రికలే పాలకుల పాదాల మీద పాకుతూ… ఎడిటర్లు పాదపూజల్లో తరిస్తూ ఉంటే… ఫాఫం, ఈ చిన్న పత్రికను తిట్టిపోయాల్సిన పనేమీ లేదు… అయితే ఈ క్లిప్పింగులో కనిపించిన విశేషం ఒకటుంది…
మొత్తం వార్తలో పొరపాటున ఫుల్ స్టాప్ పెట్టాడు ఒకచోట… అది మాత్రం క్షమించరాని పాపం, శాపం, నేరం, నీచం… ఫుల్ స్టాప్, కామా, స్పేస్, కోట్స్ గట్రా ఏమీ లేకుండా ఒక వార్తను రాయడం అంత వీజీ కాదు… ఐనాసరే, అంత ప్రతిభ ప్రదర్శిస్తూనే, సంయమనం కోల్పోయి ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టడం మాత్రం నచ్చలేదురా అబ్బాయ్… ఈసారి డబుల్ కాలం, తరువాత ట్రిపుల్ కాలం వార్త సేమ్, ఇలాగే గుక్కతిప్పుకోకుండా… అంటే కామాలు, ఫుల్ స్టాపులు లేకుండా కొట్టేయాలి సరేనా..? అదీ మంచి శ్రేష్టమైన భజన అయి ఉండాలి…
ఇప్పుడు ఈ వార్తను దిద్ది మార్కులేస్తే… ఒక అన్నమయ్యను అవమానించినట్టే ఉంటుంది కాబట్టి, అదిప్పుడు అక్కర్లేదు… ఎవరైనా భాష మీద ప్రేమ ఉన్నవాళ్లు తిట్టుకుంటే తిట్టుకోనీ గాక… దమ్ముంటే వాళ్లను పెద్ద పెద్ద జర్నలిస్టులను తిట్టమను… అర్థ, అర్ధకు తేడా తెలియని అర్థ జ్ఞానులే తప్ప, అర్ధ జ్ఞానులే తప్ప భాషాజ్ఞానులెవడున్నాడు ఫీల్డులో… వాళ్లే సిగ్గులేకుండా… సారీ, సిగ్గుపడకుండా పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చుని భాషను వీలైనంత నరుకుతున్నారు… కాబట్టి ఈ వార్తను క్షమించేయడమే కరెక్టు…!!
Share this Article