బ్రిటిష్ కాలంలో బ్రిటిష్‌వాడి అభిప్రాయం ప్రకారం తెలంగాణ వ్యక్తికి తుపాకీ ఇస్తే పిట్టలు కొట్టి కాల్చుకుని తిని సంతృప్తి పడతాడు. రాయలసీమ వ్యక్తి తన ప్రత్యర్థులను కాల్చి చంపి జైలుకు వెళతాడు. కోస్తాంధ్ర వ్యక్తి ఆ తుపాకీని అద్దెకిచ్చి డబ్బు సంపాదిస్తాడు. ఇప్పుడు ఈ విశ్లేషణకు కాలం చెల్లింది. తెలంగాణవాళ్లు ప్రగతికాముకులుగా ముందుకు సాగుతున్నారు. రాయలసీమ, కోస్తాంధ్ర వాళ్లు తమ సహజ స్వభావానికి విరుద్ధంగా కుల, ప్రాంతీయతత్వంతో కొట్టుకుంటున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అడుగడుగునా కుల విద్వేషం కనిపిస్తోంది………….. ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు అనే తన ఎడిట్ వ్యాసంలో రాధాకృష్ణ ఇలాగే రాసుకొచ్చారు…
ఆంధ్రజ్యోతికి సంబంధించి ఓ జ్ఞాపకం… అప్పట్లో సీనియర్ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు ఆంధ్రప్రభకు ఎడిటర్‌గా ఉండేవారు… ఏ కారణం చేతనో గానీ ఆయనను తొలగించారు. ఆ కాలంలో సంపాదకులు అందరూ బ్రాహ్మణులే… నార్ల ఒక్కరే కమ్మ… మా సామాజిక వర్గం ఏకైక ఎడిటర్‌ను తొలగిస్తారా అని ఆ వర్గం పెద్దలకు చాలా కోపం వచ్చింది…
మన ఎడిటర్ కోసం మనమే పత్రిక పెడదామనే ఆలోచన వచ్చింది. అలా ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు పెద్దల పెట్టుబడితో ఆంధ్రజ్యోతి దినపత్రిక పుట్టింది… సహజంగానే నార్ల వారు ఎడిటర్… ఒక ఎడిటర్ కోసం ఆవిర్భవించిన పత్రిక అని నార్ల గర్వంగా చెప్పుకొనేవారు… ఆంధ్రజ్యోతి ఆవిర్భావం గురించి జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అమర్ నాథ్ చెప్పిన ఈ విషయం ఆసక్తి కలిగించింది … నెట్‌లో వెతికితే వికీపీడియాలో నార్ల గురించి….. సంపాదకుడి కోసం పుట్టిన పత్రిక అని సంక్షిప్తంగానైనా ఈ విషయం ఉంది… వికీలో ఇలా కనిపించింది…
ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం ఆంధ్రజ్యోతి ఆవిర్భావం. ఆంధ్రప్రభ నుంచి వైదొలిగి ఖాళీగా ఉన్న నార్ల కోసం కె.యల్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో కొందరు ముఖ్యులు పూనుకొని ఆంధ్రజ్యోతి పేరుతో ఒక దినపత్రికను స్థాపించారు. ఈ పత్రికను 1960 జూలై 1న విజయవాడలో ప్రారంభించారు….
ప్రతి పార్టీకి మీడియా ఉంది… ప్రతి కులం మీడియాలోకి రావాలి అనుకొంటోంది. తప్పేమీ లేదు… కానీ రాష్ట్ర విభజన తరువాతే కులాలు పుట్టినట్టు, జగన్ వచ్చాక మనుషులకు హఠాత్తుగా కులాలు గుర్తుకు వచ్చినట్టు ఆర్కే రాతలు చూసి ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి… కులం కోసమే పుట్టిన పత్రికలో కులం గురించి భలే రాశారు…
Ads
Share this Article