చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చూడబడ్డాను… పాజిటివ్ హీరోయిజం ఎలివేట్ కావాలంటే స్టెప్పులు, తుపాకుల మోతలు, ఐటమ్ సాంగ్స్ అవసరం లేదనే నిజాన్ని ఇన్నేళ్ల టాలీవుడ్ గాడ్‌ఫాదర్ చిరంజీవి విస్మరించిన తీరు విస్మయపరిచింది… మితిమీరిన హీరోయిజం ఒక సెక్షన్‌కు మాత్రమే ఆకర్షణ… అదీ వయస్సు మళ్లుతున్న చిరంజీవికి ఇప్పుడు అవి అస్సలు నప్పవు… పైగా సల్మాన్ ఖాన్ పాత్ర, ఓవరాక్షన్ చిరంజీవి వంటి మెగాస్టార్ సినిమాకు అవసరమా..?
ప్లెయిన్‌గా, స్ట్రెయిట్‌గా… ఏ ఇమేజీ బిల్డప్పులు లేకుండా మలయాళీ ఒరిజినల్ సూపర్ హిట్టయింది… ఆ సాహసం చిరంజీవి ఎందుకు చేయలేకపోయాడు…? చిరంజీవి మార్కు అతి బిల్డప్పులకు ఎందుకు వెళ్లాడు..? ఈ ఆలోచనల్లో మెదిలిన సినిమా పేరు విజేత… అప్పుడెప్పుడో 1985లో ఇదే చిరంజీవి హీరోగా చేశాడు… అందులో డాన్సులున్నయ్, ఫైట్లున్నయ్, అన్నీ ఉన్నయ్… కానీ అవి కాదు, చిరంజీవి హీరోయిజాన్ని ఆకాశమంత ఎత్తులో ప్రొజెక్ట్ చేసింది కథ… ఓ బలమైన ఎమోషన్… చిరంజీవికి ఆ సినిమా గుర్తుందో లేదో మరి…
అప్పట్లో చిరంజీవి యంగ్… తెరపై తను కదిలితే, కనిపిస్తే చాలు అప్పటి ప్రేక్షకులకు నిజంగానే పూనకాలు… అదీ రీమేక్ సినిమాయే… సాహెబ్ అనే బెంగాలీ సినిమాకు రీమేక్… అదే సినిమాను హిందీలో అనిల్ కపూర్ అదే పేరుతో రీమేక్ చేయగా, తమిళంలో ధర్మప్రభు పేరిట డబ్ చేశారు… ప్రతిదీ హిట్… అప్పుడప్పుడే చిత్ర నిర్మాణంలోకి వస్తున్న అల్లు అరవింద్ నిర్మాత… కోదండరామిరెడ్డి దర్శకుడు, జంధ్యాల మాటలు… అప్పట్లో భానుప్రియ ఓ మెరుపుతీగ, చిరంజీవి మూమెంట్స్‌కు తగిన జోడీ… ఖైదీ తరహా నృత్యరీతులతో కంపోజ్ చేసిన ‘నీ మీద’ అనే పాటలో అసలు మేల్ వాయిస్ ఉండదు… ఓన్లీ జానకి వాయిస్…
Ads
సినిమా పేరును కూడా భలే సెలక్ట్ చేశారు… చిత్రజ్యోతి సినిమా పత్రికలో సూచనలు ఆహ్వానించి, విజేత పేరు ప్రతిపాదించినవారి పేర్లను కూడా సినిమాలో చూపించారు… పారితోషికం సరేసరి… ఓ ఫుట్‌బాల్ ప్లేయర్, సోదరి పెళ్లికోసం తండ్రి ఇల్లు అమ్మకుండా ఉండేందుకు, కుటుంబాన్ని ఆదుకోవడం కోసం తన కిడ్నీని అమ్ముకుని, తన కెరీర్‌ను హీరో వదిలేసిన తీరు ప్రేక్షకుడిని బలంగా కనెక్టయిన ఎమోషనల్ ప్లాట్… అల్లు అర్జున్ (బన్నీ) సహా అల్లు అరవింద్ కొడుకులందరూ కనిపిస్తారు సినిమాలో… తండ్రి అల్లు రామలింగయ్య సరేసరి… తక్కువ ఖర్చులో లాగించేశాడు అల్లు అరవింద్… సూపర్ హిట్…
చక్రవర్తి మ్యూజిక్ కంపోజింగ్ తన సహజ పద్ధతిలో గాకుండా హిందీ సాహెబ్ పోకడలు కనిపిస్తాయి… ఇన్నేళ్ల తరువాత కూడా ఇప్పటికీ ఆ పాటలు బాగుంటాయి, ప్రత్యేకించి వాటి చిత్రీకరణ సూపర్… చిరంజీవి నటనకు ఫిలిమ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది… ఇదంతా చెప్పుకోవడం దేనికంటే..? రీమేకుల కథల్ని మార్చి, ఐటమ్స్ పెట్టి, సల్మాన్లను తోడు తెచ్చుకుని నానాపాట్లూ అవసరం లేదు… స్ట్రెయిట్‌గా రీమేక్ చేసుకుంటే చాలు… అప్పటి చిరంజీవి ఫ్యాన్ అనుకునేదేమిటంటే… ‘‘చిరంజీవి ఒక్కసారి ఆ విజేత సినిమాను చూస్తే బాగుండు..!!
Share this Article