ఇదే వందే భారత్ రైలు… ఒకవేళ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే… అది కేంద్రంతో సఖ్యంగా ఉండి ఉంటే… ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతిల్లో పాజిటివ్ వార్తలు మోతమోగిపోయేవి… ప్చ్, ఆ సీన్ లేదు కదా… వందే భారత్ రేట్లు ఆకాశంలో ఉంటాయి… విమానం రేట్లతో సమానంగా ఉంటాయి… అదీ ఒక్కరోజు ముచ్చటే అయిపోతుంది… ఈ వార్తలాగే… దరిద్రంగా…
ఈ వ్యాఖ్య హార్ష్‌గా అనిపించవచ్చుగాక… కానీ నిజమే కదా… వందే భారత్ ఇక నడవదా..? ఒకేరోజు నడిపి ఎత్తేశాారా..? ఏమిటీ దిక్కుమాలిన హెడింగు..? మొదటిరోజు జనం ఆసక్తి చూపించవచ్చుగానీ, తరువాత పెద్దగా ఆదరణ కనిపించడం లేదు అట… 10 రోజుల ముందే విమానం బుక్ చేసుకుంటే 3900 రూపాయలకే టికెట్ దొరుకుతుందట… వందే భారత్‌లో మాత్రం 3170 రూపాయలు అట… ఎంతో బాధపడిపోయింది ఆంధ్రజ్యోతి…
ఇదొక్కటే రైలు కాదు కదా… ఎప్పటిలాగే నడిచే రైళ్లు ఉన్నాయి… కంఫర్ట్, స్పీడ్ కోరుకునే ప్రయాణికులే దీన్ని ఆప్ట్ చేసుకుంటారు… చెల్లింపు సామర్థ్యం ఉన్నవాళ్లే… మరి ఆంధ్రజ్యోతి ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు..? రెండు రోజుల్లో కూడా సగమే అడ్వాన్స్ బుకింగులు కనిపిస్తున్నాయట… సో, దీని పని అయిపోయిందని తేల్చేసింది… (నిజానికి ఈమధ్య యాంటీ మోడీ వైరస్ ఒకటి వేగంగా వ్యాపిస్తోంది… ఇదీ ఆ వైరస్ జ్వరలక్షణాలే…)
Ads
నిజానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ చెక్ చేస్తుంటే సీసీ, ఈసీ రెండు రోజుల వెయిటింగ్ చూపిస్తోంది… ప్చ్, కనీసం ఆంధ్రజ్యోతి కోసమైనా ‘మస్తు సీట్లు అవైలబుల్’ అని చూపించవచ్చుకదా… ఈ రైల్వే వాళ్లకు కూడా బుద్ధి లేదు… నిజానికి ఈ రైళ్లను రైల్వే గాకుండా ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే బాగుండేది… రైల్వే లైన్లు, స్టేషన్లు (విద్యుత్తు శాఖలో ట్రాన్స్‌కో విభాగంలాగా…) వాడుకున్నందుకు కొంత చార్జీలు చెల్లించేసి, వాళ్లే ఆ రైళ్లను నిర్వహిస్తే సరిపోయేది… గంగావిలాస్ క్రూయిజ్ తరహాలో… (విద్యుత్తులో ట్రాన్స్‌కో నెట్‌వర్క్ వాడుకుని చెల్లించే ట్రాన్స్‌మిషన్ ఛార్జీల్లాగా… రైల్వే ట్రాన్స్‌మిషన్ చార్జీలు ఎలా వసూలు చేయవచ్చు అనేది పెద్ద సబ్జెక్టు… ఇక్కడ చర్చించలేం…)
Share this Article