ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి, అంతర్జాతీయ మార్కెట్‌లో బిచ్చమెత్తుకుంటున్నా సరే… పాత విద్వేషాలు, విషాలు, యుద్దాలు మానేద్దాం బ్రదర్ అని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే ఇండియాను దేబిరిస్తున్నా సరే… ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న కొందరు మారరు… వాళ్ల తత్వాలు మారవు.,. తాజా బీబీసీ వివాదం అంతే… ఒక ఎజెండా ప్రకారం ఇండియాపై, హిందుత్వపై సాగే ఓ బ్యాడ్ ప్రాపగాండా…
బీబీసీ… కొత్తగా చెప్పుకునేదేమీ లేదు… ఇండియా మీద, ప్రత్యేకించి హిందుత్వ మీద రేయింబవళ్లూ వ్యతిరేకతే… దాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేయదు… అసలే యాంటీ ఇండియా… అందులోనూ అధికారంలో హిందుత్వ బేస్డ్ పార్టీ… ఇంకేం, సలసల కాగిపోతోంది దానికి… ఓ సందర్భం కూడా లేదు, 20 ఏళ్ల క్రితం నాటి గుజరాత్ అల్లర్లను మళ్లీ గోకుతోంది… గెలుకుతోంది… కారణం… ఏమీ లేదు… ఏదో ఒక రీతిలో విషాన్ని చిమ్మడమే…
పర్‌ఫెక్ట్ ప్లానింగ్ అన్నమాట… అది రెండు భాగాలుగా గుజరాత్ అల్లర్లు, అంతా మోడీ పాపమే అన్నట్టుగా చిత్రీకరణ… (గోద్రా రైలు దురాగతం, గుజరాత్ అల్లర్లు, నిజానిజాల చర్చలోకి వెళ్లడం లేదు ఇక్కడ, జస్ట్, బీబీసీ ప్రాపగాండా మీద మాత్రమే…) గుజరాత్ అల్లర్లకు సంబంధించి కోర్టులో విచారణలు జరిగాయి, సుప్రీంకోర్టు దాకా క్లీన్ చిట్స్ ఇచ్చాయి… 20 ఏళ్లుగా అక్కడ మళ్లీ ఏ అల్లర్లూ లేవు… అలా ఉంటే బీబీసీకి బాగుండదు కదా… అకారణంగా ఆ పాత గాయాల్ని గెలుకుతోంది…
Ads
బీబీసీ వాడు ఆ కథనం ప్రసారం చేయగానే… పాకిస్థానీ రూట్స్ ఉన్న ఓ ఎంపీ బ్రిటన్ పార్లమెంటులో ప్రశ్న లేవనెత్తుతాడు… ప్రధాని సమాధానం చెబుతాడు… కుప్పకూలబోతున్న తన ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దుకోవాలో, తన గోచీబట్ట ఎలా కాపాడుకోవాలో బ్రిటన్‌కు అర్థం కావడం లేదు… ఆ దేశ పార్లమెంటు చర్చించేది మాత్రం ఇలా తనకుమాలిన విషయాల్ని…! ఇతర మీడియా అనివార్యంగా ఈ వార్తలు రాయాల్సి వస్తుంది… ఇదీ స్క్రిప్టు…
అసలే హిందూ ప్రధాని రిషి సునాక్… తను కుర్చీ ఎక్కినప్పటి నుంచే అసహనంతో రగిలిపోతున్నాయి బ్రిటన్‌లోని యాంటీ హిందూ సెక్షన్స్… వాళ్లకు వత్తాసుగా బీబీసీ… నిజానికి బీబీసీ ఈ కథనాలను పబ్లిష్ చేయాల్సిన సందర్భం ఏముంది ఇప్పుడు..? ఏదో నివేదిక అంటుంది… అదీ రెండు దశాబ్దాల క్రితం ఎవరో రూపొందించింది… దానికి వర్తమాన వ్యవహారాలకు అసలు లింకే లేదు… ఈ కథనం రాస్తూ బ్రిటన్ మాజీ విదేశాంగ మంత్రిని ఏదో అభిప్రాయం అడిగితే, అవున్నిజమే, అప్పట్లో మా దర్యాప్తులోనూ మోడీ ఫెయిల్యూర్స్ బయటపడ్డాయి అని చెప్పాడు… ఇంకేం…? ఫుల్లు మసాలా…
బీబీసీ ఎడ్డి వేషం కాకపోతే… ఎంచక్కా న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టులాగా… ఇండియాలోనే స్పాన్సరర్లను వెతుక్కుని, మొన్నటి గుజరాత్ ఎన్నికల ముందు ఈ కథనాలను పబ్లిష్ చేస్తే తనకూ ఫాయిదా ఉండేదేమో అంటారా..? గుజరాత్‌లో బీజేపీ గెలుపు కూడా తన అసహన కారణాల్లో ఒకటి కదా…! చైనాతో పోరాటానికి మాత్రం అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ల కూటమిలో ఇండియా ఉండాలి, ఇండియా సాయం కావాలి… రష్యాకు దూరంగా ఉండాలి… బీబీసీ వంటి మీడియా సంస్థలు మాత్రం ఇదే ఇండియాలో మళ్లీ అంతర్గతంగా మతద్వేషాల్ని పెంచుతుంటాయి… దిక్కుమాలిన పాత్రికేయం…!!
ఎక్కడో లండన్‌లో కూర్చుని పిచ్చి కథనాలు దేనికి..? నిజంగా మోడీని వాయించదలిస్తే… ఇండియాకు రావొచ్చు కదా, ఐనా ఇక్కడే పలు భాషల్లో డిజిటల్ ఎడిషన్లు, రిపోర్టర్లు, సంపాదకులు ఉన్నారు కదా… ఫీల్డ్ విజిట్స్ చేయించొచ్చు కదా… బోలెడు అంశాల్లో మోడీ ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి… వాయించండి… మీ కక్షా తీరుతుంది, ఎంతోకొంత ఈ దేశానికీ మంచి జరుగుతుంది… అంతేకానీ పాత పెంట తవ్విపోయడం దేనికి..?!
Share this Article