నెత్తుటిలో ఆ నందమూరి ఆనవాళ్లున్నా సరే… అసలు కల్యాణరాం కెరీర్ ఒక అడుగు ముందుకు, పదడుగులు వెనక్కి అన్నట్టు ఉంటుంది… లక్కీగా మొన్న బింబిసార క్లిక్కయి మళ్లీ తెర మీద నాలుగు రోజుల ఆయుష్షు దొరికింది… దాన్ని అలాగే కొనసాగించాలంటే, ఆ టెంపో సాగాలంటే మరింత మంచి కథ అవసరం… మైత్రీ మూవీస్ వాళ్లు దొరికారు, డబ్బుకు ఢోకా లేదు… కాకపోతే టేస్టే మళ్లీ గాడితప్పినట్టుంది…
ఓ సాంగ్ రిలీజ్ చేశారు… ఎక ఎక అంటూ మొదలవుతుంది… పకపకమని నవ్వుకునేలా… ఆ ట్యూన్ ఏమిటో, ఆ కంటెంట్ ఏమిటో… పరమ చికాకు… ఈమధ్య సరస్వతీపుత్ర అని బిరుదు రాసుకుంటున్నాడు రామజోగయ్యశాస్త్రి… తన పాటకన్నా ఆ బిరుదు రాసుకోవడమే నవ్వు పుట్టించింది… అయ్యా శాస్త్రీ, అది చాలా చాలా పెద్దపదం, ఆఫ్టరాల్ మీ సినిమా పాటలకు పిచ్చి పదాలతో కంటెంటు రాసుకునేవాళ్లు దాన్ని భూషణంగా ధరిస్తే కాస్త చదవడం, వినడం ఇబ్బందికరంగా ఉంది… నిజమైన సాహిత్య విద్వత్తు ఉన్నవాళ్లను ఏమని పిలవాలి మరి..?
కోయంబత్తూరులో పుట్టిన జిబ్రాన్‌కు తెలుగు రాదు, జోగయ్య శాస్త్రి రాసిందానికి ఓ ట్యూన్ కట్టి వదలడమే… తరువాత మన ఖర్మ… అసలు ఫ్రెండ్ షిప్ తాలూకు పాటలో ఎంత జోష్ ఉండాలి… అబ్బే, ఇది మరీ నీరసరాగం…!! నిజానికి మరాఠీ కుటుంబంలో పుట్టిన మన కామారెడ్డి గాయకుడు అనురాగ్ కులకర్ణికి శాస్త్రీయం తెలుసు, కాస్త గాత్రశుద్ధి ఉన్నవాడే… కిరణ ఘరాణా టైపు పాటలూ నేర్చాడు… కానీ ప్రజెంట్ కల్యాణ్ రామ్ సినిమా అమిగోస్‌లో ఈ ఎకఎక పాట పాడాడు… బుక్కయిపోయాడు… అంత నాసిరకంగా పాడగలనని బహుశా తను కూడా ఊహించి ఉండడు…
Ads
అసలు అమిగోస్ టైటిల్ ఏమిటీ అని కంగారుపడకండి… స్పానిష్‌లో ఫ్రెండ్స్ అని అర్థం… మరి ఎంచక్కా ఏదేని తెలుగు పేరు పెట్టుకోవచ్చు కదా అంటారా..? అబ్బే, మరి వాళ్ల ఘనత ఏమున్నట్టు..? ఏదో ఒక పైత్యం… పాటలో స్నేహం ఎక్కడుందో వెదికాం అన్నట్టుగా ఏవో పదాలున్నాయి… అనురాగ్ గొంతులో వెదికా అని తప్ప ఎన్నిసార్లు విన్నా వెదికాం అని పలికినట్టు వినిపించలేదు…
ఇక ఆ పాట చిత్రీకరణ పరమ బేకార్… పఠాన్ సినిమాలో శరం గట్రా అన్నీ విడిచిపెట్టిన బేశరం సాంగ్ బెటర్… కళ్యాణరామ్‌కు అవసరమా ఈ బట్టపీలికల బీచ్ బికినీ సుందరాంగుల ఆరబోతల సపోర్ట్… కొరియోగ్రఫీ శోభు అట… అసలు ఇందులో ఏముందని, డాన్సులు కంపోజ్ చేయడానికి… కొరియోగ్రాఫర్ అవసరమే లేదు కదా… అన్నట్టు, Doppelgangersలో ఒక కల్యాణరామ్ పర్లేదు గానీ, మరో కల్యాణరామ్ బవిరిగడ్డంతో మరీ దారుణంగా కనిపిస్తున్నాడు..!! ప్చ్, బింబిసార విజయానికి దిష్టి తీసే ఏర్పాట్లలో ఉన్నట్టున్నారు… డిస్ట్రబ్ చేయకండి… ఫాఫం…
Share this Article