పార్ధసారధి పోట్లూరి ……… గిల్గిట్ బాల్టిస్టాన్ లో ఆందోళనలు అలానే జరుగుతుండగా ఇప్పుడు POK వంతు వచ్చింది ! యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ [United Kashmir People’s National Party (UKPNP)]. ఈ పేరుతో PoK లో ఒక పార్టీ ఉందని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు !
యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ పార్టీ – UKPNP అనే రాజకీయ పార్టీ ని 1985 లో స్థాపించారు. పాకిస్థాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ తో పాటు భారత్ అధీనంలో ఉన్న కాశ్మీర్ ని ప్రజాస్వామ్య పద్ధతిలో [హింస లేకుండా] ఒక దేశంగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉంది. ప్రస్తుతం UKPNP కి ఛైర్మన్ గా సర్దార్ షౌకత్ అలీ కాశ్మీరీ[Sardar Shaukat Ali Kashmiri] ఉన్నాడు.
పూర్వపు కాశ్మీర్ రాజు అయిన హరి సింగ్ రాజ్యంలో భాగంగా ఉన్న బురుషాల్,దర్డీస్టాన్,బోలోరీస్టాన్,లడక్,పూరిగ్,కిష్ట్ వర్,దుగ్గర్ట్, పూంఛ్, కాశ్మీర్ లోయ [Burushal, Dardistan, Boloristan, Ladakh, Purig, Kishtwar, Duggart, Poonch and Kashmir Valley] లని కలిపి ఒకే దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేస్తున్నది UKPNP. గిల్గిట్ బాల్టిస్టాన్ లు కూడా తమ దేశంలో భాగంగా ఉండాలి అనే ఆశ కూడా ఉంది.
Ads
*************************************
ఇప్పుడు ఈ UKPNP వార్తలలోకి ఎందుకు వచ్చింది ?
UKPNP కి అధికార ప్రతినిధి అయిన సర్దార్ నాజిర్ అజీజ్ ఖాన్ [Sardar Najir Aziz Khan ] కెనడా పార్లమెంట్ సభ్యుడు అయిన జార్జ్ చహాల్ [George Chahal ] ని కలిసి PoK లో మానవ హక్కుల ఉల్లంఘన,అణిచివేత, పెరుగుతున్న తీవ్రవాదం దానికి పాకిస్థాన్ ఇస్తున్న ప్రోత్సాహం ల మీద సమగ్ర రిపోర్ట్ ని ఇచ్చాడు. మామూలుగా అయితే ఇలాంటి రిపోర్ట్ ని ఏ విదేశీ పార్లమెంట్ సభ్యుడికో భారత్ లోని కాశ్మీర్ మీద ఇచ్చే ఆనవాయితీ ఉండేది ఇదివరలో కానీ ఈ సారి ఈ ఆనవాయితీ పాకిస్థాన్ వైపు తిరిగింది!
సర్దార్ నాజిర్ అజీజ్ ఖాన్ పాకిస్థాన్ మీద మరో ఆరోపణ కూడా చేశారు : మాకు స్వయం ప్రతిపత్తి ఇస్తామని వాగ్దానం చేసిన పాకిస్థాన్ ఇప్పుడు గిల్గిట్ బాల్టిస్టాన్ ని తమ దేశపు నూతన రాష్ట్రంగా కలిపేసుకోవాలనే ప్రయత్నం ఉన్నదని దాని తరువాత PoK ని కూడా ఇంకో రాష్ట్రం కింద ప్రకటించే అవకాశం ఉన్నదని కాబట్టి కెనడా సహయం కావాలని అభ్యర్ధించాడు. ప్రస్తుతం బ్రస్సెల్స్ లో ఉంటున్న UKPNP ఛైర్మన్ సర్దార్ షౌకత్ అలీ కాశ్మీరీ తరుపున శుభాకాంక్షల సమాచారాన్ని కూడా జార్జ్ చహల్ కి ఇచ్చాడు!
***********************************************
సర్దార్ నాజిర్ అజీజ్ ఖాన్ కెనడా పార్లమెంట్ సభ్యుడికి ఇచ్చిన ఫిర్యాదులో పాకిస్థాన్ PoK పౌరులని రెండవ తరగతి వారీగా వివక్ష చూపిస్తున్నదని,Pok లో పత్రికా స్వేచ్చ మీద తీవ్ర ఆంక్షలు అమలుచేస్తున్నారని అలాగే UKPNP నేషనలిస్ట్ ల మీద అణిచివేత కొనసాగుతున్నదని, తమ ప్రాంతం గత 75 ఏళ్లుగా అభివృద్ధికి నొచుకోలేదని, PoK ని కేవలం భారత్ వ్యతిరేక కార్యకలాపాలకి పాక్ సైన్యం వాడుకుంటున్నదని పేర్కొన్నాడు!
కెనడా పార్లమెంట్ UKPNP కి మద్దతుగా సంఘీభావం తెలపడానికి కృషి చేయాల్సిందిగా సర్దార్ నాజిర్ అజీజ్ ఖాన్ కెనడా పార్లమెంట్ సభ్యుడు జార్జ్ చహాల్ ని కోరాడు.
మరోవైపు బ్రస్సెల్స్ లో ప్రవాస జీవితం గడుపుతున్న UKPNP ఛైర్మన్ సర్దార్ షౌకత్ అలీ కాశ్మీరీ వ్రాసిన లేఖని కెనడా పార్లమెంట్ సభ్యుడికి అందచేశారు సర్దార్ నాజిర్ అజీజ్ ఖాన్.
కెనడా పార్లమెంట్ సభ్యుడు జార్జ్ చహల్ ని ఉద్దేశిస్తూ షౌకత్ అలీ కాశ్మీరీ వ్రాసిన లేఖలో పాకిస్థాన్ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. PoK లో జనాభా లెక్కల గణింపు కోసం డిజిటల్ పద్ధతిలో కార్యక్రమం చేపట్టింది అని కానీ గత 75 ఏళ్లలో కాశ్మీర్ మరియు గిల్గిట్ బాల్టిస్టాన్ లలో స్థానికులని అక్కడనుండి తరలించి పాకిస్థాన్లోని వివిధ ప్రదేశాలలో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి పాకిస్తానీలని ముఖ్యంగా పంజాబీలని PoK లో నివాసాలు కల్పించింది అని దీనివల్ల అసలు కాశ్మీరీల సంఖ్య కంటే పాకిస్తానీ ల సంఖ్య ఎక్కువ అయిందని ఇప్పుడు జనాభా లెక్కలు పేరిట వివరాలు సేకరించి PoK లో అసలు కాశ్మీరీల సంఖ్య తక్కువగా చూపడానికి పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నది అని దీనిని ఆపాలని అభ్యర్ధించాడు.
************************************************
ఇది ఒక మంచి పాయింట్ లేవనెత్తాడు UKPNP ఛైర్మన్ అయిన సర్దార్ షౌకత్ అలీ కాశ్మీరీ !
1948 లో నెహ్రూ కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్య సమితికి నివేదించడం వలన UN ఒక రిజల్యూషన్ ని ఆమోదించింది : దాని ప్రకారం PoK లో రిఫరెండం నిర్వహించాలని ఓటింగ్ ఆధారంగా PoK ప్రజలు ఎటువైపు ఉండాలో నిర్ణయించుకుంటారని దాని ప్రకారమే PoK భవిష్యత్తు నిర్ణయం జరుగుతుందని ఆ తీర్మానం సారాంశం ! PoK లో ప్రజాభిప్రాయ సేకరణ అయిపోయిన తరువాత భారత్ అధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో రిఫరెండం నిర్వహించాలని పేర్కొంది UN. కానీ అప్పట్లో పాకిస్థాన్ రిఫరెండం నిర్వహించడానికి నిరాకరించింది !
అటు పాకిస్థాన్ లోని వేర్పాటు వాదులలో మరియు సాధారణ ప్రజలలో ఉన్న అపోహ ఏమిటంటే భారత్ మాత్రమే కాశ్మీర్ లో రిఫరెండం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది అని. ఈ అపోహ మన దేశంలోని చాలా మంది ముస్లిమ్స్ లో కూడా ఉంది కానీ ఇది వాస్తవం కాదు. ముందు పాకిస్థాన్ తన అధీనంలో ఉన్న కాశ్మీర్ మరియు గిల్గిట్ బాల్టిస్టాన్ లలో రిఫరెండం నిర్వహించాలి అదీ ఐక్యరాజ్య సమితి పరిశీలక బృందం పర్యవేక్షణలో జరగాలి !
************************************************
ఇప్పుడు UKPNP ఛైర్మన్ లేవనెత్తిన అభ్యంతరం ని చూస్తుంటే అక్కడి జనాభా నిష్పత్తి లో స్థానికుల కంటే స్థానికేతురుల సంఖ్యని పెంచి రిఫరెండం నిర్వహించాలనే ప్లాన్ దాగి ఉన్నట్లు తెలుస్తున్నది !
రష్యా ప్రేరణ !
2014 లో రష్యా కూడా ఇలాగే ‘క్రిమియా ద్వీపకల్పం ‘ లో రిఫరెండం నిర్వహించింది. 70% కి పైగా క్రిమియా ప్రజలు రష్యాలో భాగంగా ఉండడానికి అనుకూలంగా వోటు వేశారు దాంతో ఎలాంటి సైనిక చర్య లేకుండానే రష్యా క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యాలో కలిపేసుకున్నది ! అయితే క్రిమియాలో ముందు నుండి రష్యన్ భాష మాట్లాడే వాళ్ళ శాతం ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు రష్యాలో కలవడానికి వోటు వేశారు.
క్రిమియా ఉదంతాన్ని పాకిస్థాన్ కూడా ఫాలో అవ్వడానికి ముందు నుండి అంటే గత 25 ఏళ్ల నుండి PoK మరియు గిల్గిట్ బాల్టిస్టాన్ లలో స్థానికులని ఒక పద్ధతి ప్రకారం సింధ్,బలూచిస్తాన్ ప్రాంతాలకి తరలించి తనకి నమ్మకస్తులు అయిన పంజాబీలని PoK లో స్థిర నివాసలని ఏర్పాటు చేస్తూ వచ్చింది. దీనివల్ల డెమోగ్రఫీ లో తీవ్ర మార్పులు వచ్చేశాయి. ఈ సంవత్సరం జనాభా లెక్కలు అదీ డిజిటల్ ఫార్మాట్ లో సేకరించాలి అనే ప్రయత్నం వెనుక అంకెల తారుమారు పధకం ఉండి ఉండవచ్చు ! రిఫరెండం నిర్వహించి మెజారిటీ ప్రజలు పాకిస్థాన్ లోనె ఉంటాము అని ఓటింగ్ వేశారు అంటూ అధికారికంగా PoK ని మరియు గిల్గిట్ బాల్టిస్టాన్ లని తనలో కలిపేసుకోవచ్చు !
**************************************
ప్రస్తుతం నిత్యావసరాలు దొరకక,విద్యుత్ కొరతతో,అధిక ధరలతో సతమతం అవుతున్న స్థితిలో PoK మరియు గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రజలు పాకిస్థాన్ కి వ్యతిరేకంగా వోటు వేసే అవకాశం ఉంది కాబట్టి డిజిటల్ ఫార్మాట్ లో జనాభా లెక్కలు తీయడానికి సిద్ధం అవుతున్నది. దీనర్ధం ప్రజలు తిరగబడక ముందే రిఫరెండం నిర్వహించి అదీ 2023 జనాభా లెక్కల ప్రకారం నిర్వహించి మమ అనిపించేయాలనే ప్లాన్ పాకిస్థాన్ ది. దీనిని ముందే పసిగట్టిన UKPNP ఛైర్మన్ సర్దార్ షౌకత్ అలీ కాశ్మీరీ అసలు విషయం బయటపెట్టాడు !
*************************************
PoK మరియు గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రజలలో వచ్చిన మార్పుని ముందే పసిగట్టిన లిబరల్స్, పశ్చిమ దేశాల మీడియా బిబిసి తో సహా భారత్ లోని ముస్లిం యువత ని రెచ్చగొట్టడానికి గోద్రా అంశం మీద డాక్యుమెంటరీ ని తీసి దానిని ప్రబలంగా ముస్లిం యువతని ప్రభావం చేయడానికే !
రెండు రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ కాంపస్ లోని హాస్టల్ విద్యార్ధులకి పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి బిబిసి డాక్యుమెంటరీ ని ప్రదర్శించడం జరిగింది ! రాహుల్ కూడా శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో భారత్ జెండా ఎగురవేయనని ప్రకటించడం దేనికి సంకేతం ?
Share this Article