బాగేశ్వర ధామ్ సర్కార్‌ను హతమారుస్తామని బెదిరింపులు…. ఇదీ వార్త… ఒకసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిని కలిసి కర్తవ్యం ఆలోచించాలని బాగేశ్వర ధామ్ సర్కార్ ఆలోచన… ఇదీ ఫాలో అప్ వార్త… అకస్మాత్తుగా తన వీడియోలు వైరల్ అయిపోయాయి… తను మాయలు, లీలల నిజానిజాల జోలికి ఇక్కడ మనం వెళ్లడం లేదు కానీ తనను పరిచయం చేయాల్సిన అవసరమైతే ఉంది… ఎందుకో కూడా చెప్పుకుందాం…
జస్ట్, 26 ఏళ్ల వయస్సు…. మధ్యప్రదేశ్‌లోని ఛతార్పూర్ వాళ్ల ఊరు… తమ పూర్వీకుల నుంచి పరంపరగా హనుమాన్ విశిష్ట పూజా విధానం అందింది… తను తరచూ దివ్య దర్బార్ అని మీటింగులు పెడతాడు… కొందరి సమస్యలు ఆల్రెడీ రాసి ఉంటాయి, వారిని పిలిచి అక్కడే పరిష్కారాలు చెబుతాడు… సమస్యలు కూడా తనే చెబుతాడు… తన వీడియోలకు మిలియన్ల వ్యూస్ ఉంటాయి… తన సభలకు లక్షల్లో జనం వస్తారు…
మొన్న రాయపూర్‌లో మీటింగ్ పెడితే 5 లక్షల మంది హాజరయ్యారు… అత్యంత క్రమశిక్షణ చిన్న అపశృతి దొర్లదు… మీడియా స్వయంప్రకటిత దేవుడిగా చెప్పుకుంటున్నట్టుగా తనను చిత్రీకరిస్తోంది… మూఢనమ్మకాలను ప్రోది చేస్తున్నట్టు ఆరోపిస్తోంది… నార్తరన్ మీడియాలో ఇప్పుడు ఈ సర్కార్ ఓ చర్చనీయాంశమైన వ్యక్తి… కానీ కాదు, తన వీడియోలు చూస్తే ఒకటి క్లియర్…
Ads
తను దేవుడిని అని చెప్పుకోడు… హనుమాన్ భక్తుడినని, తనకు బాబాజీ ఆదేశాలు వస్తే అదే చెబుతాననీ, మాయలు-లీలలు ఏమీ లేవని, తనకు మహత్తులు కూడా లేవని తనే చెబుతాడు… ఒకసారి మోడీ వెళ్లాడు తన దగ్గరకు, అమితాబ్ బచ్చన్ వెళ్లాడు… అర్థమైంది కదా ఈయన పాపులారిటీ… తన పట్ల జనంలో నమ్మకం… చెప్పనే లేదు కదూ… ఆయన అసలు పేరు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి… బాగేశ్వర ధామ్ గుడి తన అడ్డా…
డాక్టర్లను, వైద్యాన్ని నమ్ముకుని, చికిత్స మందులు తీసుకుంటూనే తను చెప్పిన మంత్రాన్ని పఠించమని చెబుతాడు… వైద్యానికి దైవసాయం తోడు అంటాడు… దువా, దివా… తన మీటింగులను పరిశీలిస్తే గానుగాపూర్, కొండగట్టుల్లో కనిపిస్తున్నట్టు మానసిక దివ్యాంగులు బోలెడు మంది ఊగిపోతూ కనిపిస్తారు… తను సనాతన ధర్మానికి స్ట్రాంగ్ ప్రచారకుడు… కొన్ని మీటింగుల్లో ‘ఎవరైతే జైసీతారాం అని నినదించరో వాళ్లకు ఈ దేశంలో ఉండే అర్హత లేదు’ అని బహిరంగంగా ప్రకటించాడు…
ప్రస్తుతం దేశంలో ట్రెండ్ ఏమిటి..? మంచోడా, చెడ్డవాడా అక్కర్లేదు… స్వామి, ఆశ్రమం అంటే చాలు… అత్యాచార కేసులు పెట్టించడం, భూకబ్జా ఆరోపణలతో జైళ్లలో వేయించడం… సో, హిందుత్వ వ్యతిరేకులు ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు… చంపేస్తామని బెదిరింపులు ప్రారంభం అయ్యాయి… మహారాష్ట్ర నాస్తిక సంఘాలు ఏమోయ్ నీ మహిమల్ని మాముందు ప్రదర్శించు అని సవాళ్లు… మధ్యప్రదేశ్ ప్రతిపక్ష సభానాయకుడు కూడా సేమ్ డిమాండ్… ఈ లక్షల మంది ఆదరణ ఎక్కడ బీజేపికి ఉపయోగపడుతుందో అని కలవరం… అంతే, పనిలోపనిగా యాంటీ హిందూ సెక్షన్స్ అన్నీ తనను టార్గెట్ చేశాయి…
ఈమధ్య రాయపూర్ మీటింగులో మీడియాకు, తనను విమర్శించేవారికి జవాబులు చెబుతూ… జర్నలిస్టులనే పిలిచి, ఎవరికీ తెలియని వారిని ఆ సభలో ఎంపిక చేసి తన వద్దకు తీసుకురావాలని కోరాడు… అలా తీసుకురాగానే వాళ్లు ఎవరో, వాళ్లు ఎందుకు వచ్చారో చెప్పాడు… స్వామికి మైండ్ రీడింగ్ తెలుసనేది ఆల్రెడీ ప్రచారంలో ఉన్నదే కదా… ‘ఇప్పుడు మీరే రాయండి, చూపండి, నేను మూఢనమ్మకాల్ని ప్రచారం చేస్తున్నానా..? దేవుడిని అని చెప్పుకుంటున్నానా..? నాకు బాబాజీ ఏది చెబితే అదే చేస్తాను… ఇదేమైనా నేరమా..?’ అనడిగాడు…
మా సవాళ్లకు జవాబు చెప్పుకోలేక పారిపోయాడు అని మహారాష్ట్ర నాస్తికసంఘాలు పత్రికలకు స్టేట్మెంట్లు ఇచ్చాయి… తెల్లారే రాయపూర్‌లో 5 లక్షల మంది మీటింగులో ప్రత్యక్షమయ్యాడు… ఇదుగో ఇక్కడ ఉన్నాను అని ఆ వేదిక మీద నుంచి జవాబు ఇచ్చాడు తను… ఎస్, తనను ఇంకా టార్గెట్ చేస్తారు… పకడ్బందీగా దేనిలోనైనా ఇరికిస్తారు… యాంటీ హిందూ శక్తులన్నీ ఒక్కటయ్యాయి… బాగేశ్వర్ ధామ్ సర్కార్‌కు బాబాజీ ఇవన్నీ ఆదేశిస్తున్నాడో లేదో, అనగా అలర్ట్ చేస్తున్నాడో లేదో మరి… అవునూ, తను యోగి సాయం ఎందుకు కోరుతున్నట్టు..?!
Share this Article