బిగ్‌బాస్ షోపై మొన్న హైకోర్టులో జరిగిన విచారణను మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు గానీ… కాస్త ఇంట్రస్టింగ్… ఎవరో ఒకాయన వేసిన పిల్ మీద జరుగుతోంది ఈ విచారణ… అవసరమైతే మేమే ఆ షో చూస్తామని కూడా అప్పట్లో జడ్జిలు చెప్పారు… స్టే ఇవ్వలేదు… లేటైంది… ఈలోపు షో ముగిసింది…
పిటిషనర్ వాదన ఏంటంటే… బిగ్‌బాస్ షో హింసాత్మకం, అశ్లీలం, అనైతికం కాబట్టి ఆ ప్రసారాలను నిలిపివేయించాలి… అశ్లీలంగా ఉంటే ఆ షో చూడకుండా ఉంటే సరి అని హైకోర్టు అభిప్రాయపడింది… స్థూలంగా చూస్తే కరెక్టే అనిపించినా, పబ్లిక్ డొమైన్‌లో అలాంటి కంటెంటును ఇగ్నోర్ చేయలేం కదా… ప్రేక్షకుల మీద వాటి ప్రభావం అనివార్యంగా ఉంటుంది కదా… కాకపోతే అశ్లీలం, అభ్యంతరకర కంటెంటు ఉంటే ఫిర్యాదు చేయడానికి మార్గాలున్నాయనే స్టార్‌మాటీవీ వాదనను కోర్టు యాక్సెప్ట్ చేసింది…
ఏమేం మార్గాలున్నాయో వేరే కౌంటర్ వేయాల్సిందిగా సూచించి, విచారణను వాయిదా వేసింది… నిజమే, ఫిర్యాదులు చేయడానికి బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు… రెండేళ్ల క్రితం దానికి జమ్ముకాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్‌ను నియమించారు… ఇప్పుడు పరిస్థితి ఏమిటో తెలియదు… ఇది స్వతంత్ర, స్వీయ నియంత్రణ సంస్థ… తరచూ కార్యక్రమాలు వస్తుంటే దిగువన ‘అభ్యంతరాలపై ఫిర్యాదులను ఎవరికి పంపించాలో స్క్రోలింగ్ వేస్తుంటారు కూడా…
Ads
చాలా ప్లాట్‌ఫారాల్లో బిగ్‌బాస్‌కన్నా అభ్యంతరకర సన్నివేశాలు ప్రదర్శిస్తున్నారనే అబ్జర్వేషన్ కరెక్టు… అందుకే ఈ విచారణ పరిధిని ఇంకాస్త ఎన్‌లార్జ్ చేస్తే బెటరేమో… సినిమాల్లో, వెబ్ సీరీస్‌ల్లో, ఆన్‌లైన్‌లో, వివిధ యూట్యూబ్ చానెళ్లలో బోలెడంత అభ్యంతరకర కంటెంట్ వస్తూనే ఉంది… ప్రత్యేకించి యూట్యూబ్ చానెళ్లు, వెబ్ సీరిస్‌లకు అడ్డుకట్టల్లేవు… ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు… పట్టించుకుంటారనే నమ్మకమూ లేదు… అందుకే బ్రాడ్ కాస్టింగ్ కంటెంట్ కంప్లయింట్స్ కౌన్సిల్‌ను విస్తృతం చేయడం, చర్యలు తీసుకునే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఫిర్యాదులకు పక్కా వ్యవస్థ అవసరమనిపిస్తుంది…
సరే, ఇది పెద్ద సబ్జెక్టు… ఈ విచారణల సందర్భంగా ఒకటి విస్తుపోయే అంశం వినిపించింది… ఈ షోలో పాల్గొనే ఫిమేల్ కంటెస్టెంట్లకు ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తున్నారని..! నిజానికి ఇది కొత్త విషయమేమీ కాదని గూగుల్ చెబుతోంది… గతంలోనే ఓ మాజీ కంటెస్టెంటు హేమ బయటకు వెల్లడించిందట… నిజానికి ఈ టెస్టులను తప్పుపట్టాల్సిన పని కూడా లేదనిపిస్తోంది… ఎందుకంటే, బిగ్‌బాస్ హౌజులో ఉన్నప్పుడు గనుక అబార్షన్లు జరిగితే షో నిర్వాహకులు అడ్డగోలుగా ఇరుక్కుపోతారు… అందుకే ఈ జాగ్రత్తలు… కరోనా భయం పూర్తిగా తొలగిపోయాక కూడా గత సీజన్ కంటెస్టెంట్లకు ముందస్తు పరీక్షలు నిర్వహించి, వేక్సినేషన్ వివరాలు పరీక్షించి, కొన్నాళ్ల ఐసోలేషన్ కూడా విధించారు… కంటెస్టెంట్లకు ఇబ్బందులు, నిర్వాహకులకు చిక్కులు ఎదురవకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎలా వ్యతిరేకించగలం..?!
Share this Article