ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్ ఓనర్ ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్‌ను కలిశాడు… ఇదీ వార్త… కలిశాడు అనేదే పత్రికలకు తెలుసు, ఎందుకో తెలియదు… కాబట్టి ఏదో తోచింది వండుకోవాలి… అందుకని స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఎన్నిక గురించి చర్చించారని గబగబా రాసేసుకున్నాయి పత్రికలు… అలాగే జగన్ సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం చర్చించారని కూడా రాసుకున్నాయి… హహహ… అసలు కథ చాలా పెద్దగా ఉంటుంది… వివరాల్లోకి వెళ్దాం…
ఇది పాత ఫోటో, ఫైల్ ఫోటోయే లెండి… పీకే వంటి హైఫై వ్యూహకర్త జగన్‌ను కలిస్తే ఆఫ్టరాల్ స్థానిక ఎన్నికలు, తిరుపతి ఉపఉన్నిక గురించి చర్చ వస్తుందా..? నెవ్వర్..! అలాగే జగన్ సంక్షేమ పథకాల ప్రచారాన్ని సోషల్ మీడియా టీమ్స్ ఆల్రెడీ చేస్తున్నాయి… గతంలో పీకే టీమ్‌లో పనిచేసిన వాళ్లే సొంతంగా టీమ్స్ ఏర్పాటు చేసుకుని వర్క్ చేసుకుంటున్నారు… అలాంటప్పుడు మళ్లీ పీకే వచ్చి పథకాల ప్రచారం ఎందుకు చేస్తాడు..?
Ads
అసలు విషయం ఏమిటంటే..? 2022 ముందస్తు ఎన్నికలు..! అన్ని రాజకీయ పార్టీలకు క్లారిటీ వచ్చేసింది… కేంద్రమే ఆ సంకేతాలను ఇస్తోంది… ఇప్పట్నుంచే మళ్లీ పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకోవాల్సిందే… అదుగో, ఆ దిశలో మళ్లీ కొత్త కంట్రాక్టు కోసం పీకే జగన్ వద్దకు వచ్చాడు… జగన్ చుట్టూ ఉన్న టీం వ్యతిరేకిస్తున్నా సరే, జగన్ వాటన్నింటినీ పక్కకు తోసిపారేసి పీకేకు కొత్త ప్రాజెక్టు ఇచ్చేశాడు… త్వరలో పీకే టీం వర్క్ స్టార్ట్ చేయబోతోంది… ఇంతకుముందు తన టీంలో పనిచేస్తున్నవాళ్లను మళ్లీ రమ్మని పీకే ఫోన్లు కూడా చేస్తున్నాడు…
పొద్దున జగన్‌ను కలిసి వోకే చెప్పించుకున్న పీకే సాయంత్రం కేటీయార్‌తో భేటీ అయ్యాడు… సేమ్, ఏపీలో జగన్‌కు వర్క్ చేస్తున్నట్టుగానే తెలంగాణలో టీఆర్ఎస్కు పనిచేయాలని ఆలోచన… కేటీయార్, సంతోష్, కవిత తదితరులు కూడా పీకే టీంకు వర్క్ ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నా సరే… కేసీయార్ వెంటనే వోకే చెప్పలేదు… హోల్డ్‌లో పెట్టాడు… ఆయన ఆలోచనల లోతు వేరు కదా…
ఆల్రెడీ బీజేపీ తన సోషల్ మీడియా టీమ్స్‌ను మళ్లీ యాక్టివేట్ చేసుకుంటోంది… మొదట్లో పొలిటికల్ స్ట్రాటజిస్టులను హెహెహె అని వెక్కిరించిన చంద్రబాబు తనే తప్పనిసరై… ఇదే పీకేతో కలిసి పనిచేసిన రాబిన్ శర్మను తన పొలిటికల్ స్ట్రాటజిస్టుగా పెట్టుకున్నాడు… ఆ వర్క్ సాగుతూనే ఉంది… మరి కాంగ్రెస్..? అంతులేని అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది ఇప్పటికీ…! రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పీకే టీం ఐప్యాక్ బెంగాల్, తమిళనాడుల్లో తమ పాత ప్రాజెక్టులను, కంట్రాక్టులను పొడిగించవచ్చు బహుశా… ప్లస్ శివసేనతో కూడా…!!
Share this Article