సినిమా ఫైనాన్షియర్స్ అంటే ప్యూర్ అప్పులిచ్చిన కాబూలీవాలాల టైపు… అసలు సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక లావాదేవీలే అరాచకం… అది బయట మార్కెట్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది… అనేక సినిమాలు ఈ డబ్బుల వ్యవహారాల్లో ఆగిపోతుంటయ్… కొత్తగా ఫీల్డులోకి వచ్చిన నిర్మాత దివాలా తీసి, ఎర్రతువ్వాల నెత్తిమీద వేసుకుని నిష్క్రమించిడం కామన్ ఇక్కడ… ఇప్పుడు వ్యవహారం ఏమిటంటే..? రవితేజ నటించిన క్రాక్ సినిమా రిలీజ్ కావల్సి ఉంది… కానీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత నడుమ ఫైనాన్షియల్ వ్యవహారాలు సెటిల్ కాకపోవడంతో రిలీజ్‌కు అడ్డంకులు ఏర్పడ్డాయి… అయితే..?
ఈ నిర్మాత ఠాగూర్ మధు… తను గతంలో… అంటే మూడేళ్ల క్రితం మహేశ్‌బాబుతో స్పైడర్ అనే సినిమా తీశాడు… తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేశారు… కానీ పెద్దగా హిట్ కాలేదు… అప్పటి డబ్బుల యవ్వారాలు పెండింగ్… దాదాపు 12 కోట్ల వరకూ బకాయిల్ని ఠాగూర్ మధు క్లియర్ చేయలేదని సమాచారం… కాబూలీవాలా ఏం చేస్తాడు..? సరైన టైం చూసి, ఇంటిమందు తిష్ఠ వేస్తాడు… సేమ్, ఇప్పుడూ క్రాక్ విడుదల తేదీ దాకా ఆగి, ఈ ఆర్థిక వ్యవహారాలను తెరమీదకు తీసుకొచ్చారు… నిర్మాత ఓ పాపులర్ హీరోతో సినిమా తీసి, సంక్రాంతి బరిలోకి విడుదల చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించుకోవాలి…!? అది లోపించింది…
Ads
సరే, ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఇలా జరుగుతూనే ఉంటయ్ కానీ… కత్తి మహేష్ తన ఫేస్ బుక్ వాల్‌పై షేర్ చేసిన ఓ పోస్టు ఇంట్రస్టింగుగా ఉంది… మొత్తం ప్రేక్షకుల్లో చర్చకు దారితీస్తోంది… వాట్సప్ గ్రూపుల్లో బాగా షేర్ అవుతోంది… కాస్త నవ్వు కూడా తెప్పించే విషయమే… ఒకసారి ఆ పోస్టు చదవండి…
అసలు సినిమా విడుదల కాలేదు… మరోవైపు బోలెడు యూట్యూబ్ చానెళ్లలో ఆ సినిమా రివ్యూలు వచ్చేశాయి… అదెలా..? బెనిఫిట్ షోలు లేవు, ఎర్లీ మార్నింగ్ షోలు లేవు… మరి ఈ రివ్యూలు ఎక్కడివి..? అంటే ముందే పకడ్బందీగా ఆహా ఓహో అని కీర్తిస్తూ రివ్యూలు రాసిపెట్టి, పొద్దున్నే తొందరపడి పబ్లిష్ చేసేశారన్నమాట… వావ్… మరీ ఘోరం ఏమిటంటే…? ఒకటీరెండు మెయిన్ స్ట్రీమ్ పత్రికల తెలుగు వెర్షన్లు కూడా రేటింగ్స్ ఇచ్చేసి, రవితేజీ నువ్వు తోపు, ఫిరంగి, ఏకీ-47 అన్నట్టుగా రాసిపడేశాయి…
సో, యూట్యూబ్ చానెళ్ల రేటింగులు, రివ్యూలు ఎంత ఫేకో, ఎంత ఫాబ్రికేటెడో ఇప్పడికైనా అర్థం చేసుకోవాలి… ఇది ఓ పెద్ద దందా అయిపోయింది… సరే, చిన్న చిన్న యూట్యూబ్ చానెళ్లు ఏదో కడుపు తిప్పల కోసం చేశారు అనుకుందాం… వేల కోట్ల టర్నోవర్ ఉన్న ప్రధాన పత్రికల అనువాద సైట్లకు కూడా అదే రోగమా..? సినిమా అంటేనే వ్యాపారం… ప్రతిదానికీ కరెన్సీ నోటుతో లంకె ఉంటుంది… పత్రికల్లో కవరేజీకి, ఇంటర్వ్యూలకు కూడా స్పెషల్ పేమెంట్లుంటయ్… అలాగే రివ్యూలు వండించుకోవాలా..? ఫాఫం, నిర్మాత కష్టాలు నిజంగా సినిమా కష్టాలే సుమీ…!!
Share this Article