పార్ధసారధి పోట్లూరి………. చైనా ఎయిర్ షిప్ [బెలూన్ ] అమెరికా ఎయిర్ స్పేస్ లో ఎగురుతున్నది ! చైనా ఎయిర్ షిప్ [బెలూన్] అమెరికా ఎయిర్ స్పేస్ మీద ఎగురుతున్నట్లు కనుక్కున్న పెంటగాన్ ! 03-02-23 శుక్రవారం మధ్యాహ్నం చైనా ఎయిర్ షిప్ [బెలూన్] అమెరికా ఎయిర్ స్పేస్ లో ప్రవేశించింది. అయితే అది బెలూనా లేక ఎయిర్ షిప్పా అనేది నిర్ధారణ కాలేదు. కానీ అమెరికా మీద గూఢచర్యం చేయడానికి వచ్చినట్లు పెంటగాన్ వర్గాలు చెపుతున్నాయి !
ఎయిర్ షిప్పా లేదా బెలూనా అనేది ప్రశ్నగా మిగిలిపోయింది ! ఎయిర్ షిప్ అయితే అది కంట్రోల్డ్ గా తనంత తానుగా ముందే నిర్ణయించిన మార్గంలో వెళుతుంది మరియు ఎక్కడన్నా ఆగి ఫోటోలు లేదా వీడియోలు తీసుకొని మళ్ళీ ప్రయాణం కొనసాగించగలదు. కానీ చూస్తే అది గోళాకారంలో ఉంది అంటే అది బెలూన్ అనే అనుకోవాల్సి ఉంటుంది. పరిమాణంలో చాలా పెద్దగా ఉంది. దానిలో పేలోడ్ ఉన్నట్లుగా గుర్తించింది US ఎయిర్ఫోర్స్ ! ఆ పేలోడ్ దేనికి సంబంధించిందో ఇంతవరకు తెలియరాలేదు. కానీ అది అమెరికన్ ఎయిర్ స్పేస్ లో వచ్చింది అంటే ఖచ్చితంగా గూఢచర్యం చేయడానికి ఉద్దేశించినదే అని పెంటగాన్ వర్గాలు చెప్తున్నాయి.
(*******************************************
Ads
సాధారణంగా ఉపరితల వాతావరణం గురించి పరిశోధన చేయడానికి బెలూన్ కి కిందభాగంలో సెన్సార్స్ ని తగిలించి ప్రయోగిస్తారు. ఈ పని మన దేశంలో కూడా దాదాపుగా 40 ఏళ్ల నుండి TIFR [Tata Institute of Fundamental Research] అనే సంస్థ హైదరాబాద్ లోని ECIL వద్ద చేస్తున్నది. బెలూన్ కి పేలోడ్ తగిలించి వదిలి అది ఉపరితల వాతావరణంలోకి వెళ్ళి అక్కడి సమాచారాన్ని సేకరించి తిరిగి భూమి మీద పడిపోతుంది, దానిలో ట్రాకింగ్ డివైజ్ ని అమర్చుతారు. అది ఎటు వైపు ప్రయాణించి ఎక్కడ పడిపోతుందో తెలుసుకోవడానికి. భూమి మీద పడగానే TIFR కి చెందిన శాస్త్రవేత్తలు వెళ్ళి, దానిని సేకరించి, తిరిగి లాబొరేటరీ లో రికార్డ్ చేసిన డాటాని విశ్లేషిస్తారు. కానీ అది కంట్రోల్డ్ ఫ్లైట్ కాదు. అందుకే తెల్లవారుఝామున 4 గంటలకి ప్రయోగిస్తారు. బలూన్ ప్రయోగించే ముందు దాని సమాచారాన్ని మిలటరీ మరియు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లకి ఒక రోజు ముందే బెలూన్ ప్రయోగం గురించి సమాచారం ఇస్తారు.
*********************************
ప్రస్తుతం అమెరికన్ ఎయిర్ స్పేస్ మీద చైనా ఎయిర్ షిప్ ఎగరడాన్ని బట్టి అది కంట్రోల్డ్ ఫ్లైట్ గా భావిస్తున్నారు కాబట్టి దీనిని ఎయిర్ షిప్ అనే అనాలి. కానీ ఆకారం మాత్రం బెలూన్ లాగా గుండ్రంగా ఉంది. ఒక దేశపు ఎయిర్ స్పేస్ మీద ఏదయినా విమానం కానీ, మిస్సైల్ కానీ, బెలూన్ కానీ ఎగరడాన్ని యుద్ధంగా భావిస్తారు. ముందస్తు హెచ్చరికలు లేకుండానే కూల్చివేసే అధికారమ్ ఆయా దేశాలకి ఉంటుంది కూడా ! అయితే ప్రయాణీకుల విమానాలకి ఇలాంటి బెలూన్ల వల్ల ప్రమాదాలు జరుగుతాయి. అందుకే అటు ఎయిర్ఫోర్స్ తో పాటు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లకి ముందుగా తెలుపుతారు.
చైనా తన ఎయిర్ షిప్ భూమి మీద నుండి 60,000 అడుగుల ఎత్తులో ఉండేట్లు జాగ్రత్త తీసుకుంది ! ప్రయాణీకుల విమానాలు మాగ్జిమం 35,000 అడుగుల ఎత్తుకి మించి ఎగరడానికి అనుమతి ఇవ్వరు. అదే జెట్ ఫైటర్స్ అయితే 60,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. రాఫెల్ ఫైటర్ జెట్ ఎత్తు సీలింగ్ 65 వేల అడుగులు. ఇక ఏదన్నా మిసైల్ ని పరీక్షల కోసం ప్రయోగించేటప్పుడు అది పక్కన ఉన్న ఏ దేశ ఉపరితలం మీదుగా ఎగురుతుందో ఆ దేశానికి ముందే తెలియచేస్తారు, అది దాడి కోసం కాదని కేవలం పరీక్ష కోసమే అంటూ !
***********************************
ప్రస్తుతం అమెరికా ఉపరితలం మీద ఎగురుతున్న చైనా ఎయిర్ షిప్ కేవలం అమెరికాని మాత్రమే ఉద్దేశించి ప్రయోగించినది కాదు. భారత్ ,జపాన్, ఫీలిప్పైన్స్ ల మీదుగా అది అమెరికా వెళ్ళింది ! మరి భారత్ తో పాటు జపాన్ దేశాలు ఎందుకు గుర్తించలేకపోయాయి ?
1. 60 వేల అడుగుల ఎత్తులో నెమ్మదిగా ప్రయాణించే ఎయిర్ షిప్ లాంటి దానిని సివిల్, మిలటరీ గ్రౌండ్ రాడార్లు గుర్తించలేవు.
2. ఎయిర్ షిప్ ఎలాంటి వేడిని విడుదల చేయదు కాబట్టి హీట్ సిగ్నేచర్ అంటూ ఏదీ ఉండదు. కాబట్టి ఉపగ్రహాలు కూడా గుర్తించలేవు.
3. ఎయిర్ షిప్ లేదా పెద్ద పెద్ద బెలూన్ల ని గుర్తించాలి అంటే భూ దిగువ కక్ష్యలో ఉండే శాటిలైట్లు కావాలి. వీటిని నియర్ ఎర్త్ ఇమేజింగ్ టెక్నాలజీ [Near Earth Imaging Technology – NIET] లు గుర్తించగలవు. కానీ ఇది చాలా ఖరీదయిన వ్యవహారం కాబట్టి మన దేశంతో పాటు జపాన్ ల దగ్గర NIET లేదు కాబట్టి గుర్తించలేకపోయాయి.
4. అమెరికా దగ్గర NIET ఉంది కాబట్టి వెంటనే గుర్తించగలిగింది దానిని మానిటర్ చేయగలుగుతున్నది.
5. ప్రస్తుతం అమెరికా, జపాన్, భారత్ దేశాలు చైనాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి చురుకుగా కాబట్టి ఒక వేళ యుద్ధం అంటూ వస్తే ఎలాంటి టెక్నాలజీని వాడి దెబ్బ తీయవచ్చు ? అనే దాని కోసం చైనా ఈ ప్రయోగం చేస్తున్నది.
6. భారత్, జపాన్ దేశాలు గుర్తించలేకపోయాయి అలాగే ఫిల్లిప్పైన్స్ దేశం కూడా గుర్తించలేకపోయింది !
7. ఇప్పుడు చైనా ప్రయోగించిన బెలూన్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదు.
8. యుద్ధం అంటూ వస్తే ఇదే బెలూన్ లని ప్రయోగించి వైరస్ లని విడవవచ్చు. లేదా పరిమితి పరిధిలో ప్రభావం చూపగలిగే స్ట్రాటజిక్ అణు బాంబులని ప్రయోగించవచ్చు.
*******************************************
పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జెనెరల్ పాట్ రైడర్ [Brig. Gen. Pat Ryder] విలేఖరులతో మాట్లాడుతూ… అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మొదటగా శుక్రవారం మధ్యాహ్నం చైనా ఎయిర్ షిప్ ని గుర్తించింది. కొంతమంది అమెరికన్ పౌరులు ఆకాశంలో చాలా ఎత్తులో ఏదో తెల్లటి వస్తువు ఎగరడాన్ని చూసి తమ బైనాక్యులర్స్ ద్వారా మరింత స్పష్టంగా చూసి సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చారు. మేము మొదట అది వాతావరణాన్ని పరిశీలించడానికి ప్రయోగించిన బెలూన్ అనే అనుకున్నాము, కానీ మరింత పరిశోధన చేయగా అది చైనాకి చెందినదిగా గుర్తించాము. అది బెలూన్ కాదు. అది తనంతట తానుగా నిర్దేశించిన మార్గంలో ఆగుతూ, నిఘా కెమెరాలతో హై రిజల్యూషన్ ఫోటోలు, వీడియోలు తీస్తూ, తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లుగా గుర్తించాము.
అమెరికా చైనాకి నిరసన తెలిపింది ఈ విషయం మీద ! కానీ చైనా విదేశాంగ శాఖ మాత్రం అది కేవలం వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించినది అని, కంట్రోల్ తప్పి అది అమెరికా భూభాగం వైపు ప్రయాణించింది అని వివరణ ఇచ్చింది. దీని మీద తాము విచారం వ్యక్తం చేస్తున్నాము అని పేర్కొంది. చైనా అధికారులు ఇచ్చిన వివరణలోనే అది కంట్రోల్ తప్పింది అనే పదం వాడింది కాబట్టి అది బెలూన్ కాదు కంట్రోల్డ్ ఎయిర్ షిప్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.
******************************
చాలాకాలం తరువాత US స్టేట్ సెక్రటరీ అయిన ఆంటోని బ్లింకెన్ [Antony Blinken] చైనాలో పర్యటించడానికి షెడ్యూల్ ఖరారు అయిన సందర్భంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న దౌత్య సంబంధాలు మరింత క్షీణించి, అది ఆంటోని బ్లింకెన్ పర్యటన రద్దు చేసుకునే దాకా వెళ్ళింది చైనా ఎయిర్ షిప్ వ్యవహారం !
**************************
నిన్న మధ్యాహ్నం నుండి తమ భూభాగం మీద ఎగురుతున్న చైనా ఎయిర్ షిప్ ని అమెరికా ఎందుకు కూల్చివేయలేదు ? దీని మీద వివరణ ఇస్తూ పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ బ్రిగేడియర్ జెనెరల్ పాట్ రైడర్ ‘చైనా గూఢచార ఎయిర్ షిప్ కూల్చడం అనేది పెద్ద విషయం కాదు. కానీ అది ప్రస్తుతం ఆకాశంలో 60 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ తూర్పు దిశగా మెల్లగా ప్రయాణిస్తున్నది. ఎయిర్ షిప్ కింది భాగంలో కనీసం రెండు నుండి మూడు టన్నుల పేలోడ్ ఉంది. మేము కనుక దానికి కూల్చివేస్తే బెలూన్ కింది భాగంలో ఉన్న పేలోడ్ కనుక జనావాసాల మీద పడితే అది జన నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి అది జనావాసాలు లేని చోటకి వెళ్ళినప్పుడు కూల్చివేస్తాము. అప్పటి వరకు దానిని మానిటర్ చేస్తూనే ఉంటాము’ అని పేర్కొన్నారు.
చైనా చెప్తున్నట్లు అది వాతావరణ పరిశీలన కోసం కాదని, కేవలం తమ భూభాగం మీద గూఢచర్యం చేయడానికి వచ్చింది అని మాకు తెలుసు. [వాతావరణ పరిశీలన కోసం ఎలాంటి సెన్సార్లు వాడుతారో, అవి ఎలా ఉంటాయో వాటిని వాడుతున్న దేశాలకి తెలిసిపోతుంది]. దాని కింద ఉన్న పేలోడ్ ని బట్టి అది ఎలాంటిదో మేము గుర్తించాము కానీ ఇంతకంటే వివరాలు బయటికి చెప్పలేను అని బ్రిగేడియర్ జెనెరల్ పాట్ రైడర్ పేర్కొన్నారు.
***********************************
చైనాకి అమెరికా మీద గూఢచర్యం చేసేంత ధైర్యం ఎలా వచ్చింది ? బయటి ప్రపంచానికి తెలియకుండా [అమెరికాకి కూడా ] చైనా కొన్ని కీలక రంగాలలో చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. అవి ఏమిటో చూచాయగా సమాచారం బయటికి వస్తున్నా అవి వట్టి ఊహాగానాలు తప్పితే అలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేయగలగడం చైనా వల్ల అవుతుందా ? అంటూ కొట్టిపారేస్తున్నారు అమెరికన్ అధికారులు. అఫ్కోర్స్ కొన్ని అత్యాధునిక ఆయుధాలు అమెరికాలో ఇంకా పరీక్ష దశలోనే ఉండగా అలాంటిది చైనా ఎలా తయారుచేయగలుగతుంది అనే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. కేవలం R & D కోసమే హీనపక్షం 15 సంవత్సరాలు పడుతుంది ఫైనల్ గా అవి అన్ని పరీక్షలు పూర్తి చేసుకొని వాడడానికి సిద్ధంగా ఉండడానికి. పైగా ఒక్కో ఆయుధానికి 5 నుండి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది పరిశోధనకి !.
చైనాకి చెందిన పలు సంస్థలు మారు పేర్లతో ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశంలో ఉన్నాయి. కావాల్సిన మెటీరీయల్ కోసం తన ప్రాక్సీ కంపెనీల ద్వారా ఆర్డర్ చేసుకొని వాటిని రహస్యంగా చైనాకి తరలిస్తుంది. సింగపూర్, మలేషియా, హాంగ్ కాంగ్, టర్కీ, ఆఫ్రికన్ దేశాలతో పాటు లాటిన్ అమెరికన్ దేశాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. ఈ కంపెనీలలో చైనీయులు ఎవరూ పనిచేయరు. అంతా స్థానిక ఉద్యోగులే పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరికీ అనుమానం రాదు.
మరో విషయం ఏమిటంటే అమెరికాలో కూడా ఆమెరికన్లతో నిండి ఉండే సంస్థలు నిజానికి అవి చైనాకి చెందినవే ! వీటిని నడపడానికి డాలర్లు ఎలా వస్తున్నాయి ? చైనాకి చెందిన పలు భారీ కమర్షియల్ భవనాలు అమెరికాలో ఉన్నాయి ఎప్పటినుండో. వాటిని అద్దెకి ఇచ్చి డాలర్లు సంపాదిస్తున్నది చైనా. చైనాకి చెందిన వాణిజ్య భవనాలని అద్దెకి తీసుకొని వాటికి అద్దె చెల్లిస్తున్న వారిలో అమెరికన్ సెనేటర్స్, ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీలకి చెందిన ప్రధమ శ్రేణి రాజకీయ నాయకులతో పాటు మరో పదేళ్ళ తరువాత అమెరికా అధ్యక్షులు కాగల సామర్ధ్యం కల వాళ్ళు కూడా చైనాకి చెందిన పలు భవనాలకి అద్దె చెల్లించే వారిలో ఉన్నారు. జో బిడెన్ తో పాటు డొనాల్డ్ ట్రంప్ లు కూడా చైనా కమర్షియల్ స్పేస్ కి అద్దెలు కడుతున్న వారిలో ఉన్నారు ! అమెరికన్ ట్రెజరీలో 3 ట్రిలియన్ డాలర్లు చైనాకి చెందినవి డిపాజిట్ రూపంలో ఉన్నాయి !
**************************
చైనా ఈ స్థితిలోకి రావడానికి పరోక్షంగా సహకరించింది ఒబామా ! తను రెండు టర్మ్స్ అధికారంలో ఉన్న సమయంలో అమెరికా రక్షణ బాధ్యతలు నిర్వహించే పెంటగాన్ లోని రహస్య డాక్యుమెంట్లని దొంగిలించింది చైనా ! అత్యంత పటిష్టమయిన FIRE WALLS కలిగిన DoD సర్వర్స్ నుండి చైనా హాకింగ్ ద్వారా చాలా ఆయుధాల డిజైన్ల బ్లూ ప్రింట్స్ దొంగిలించింది ఒబామా హాయామ్ లో ! విచిత్రం ఏమిటంటే తమ DoD సర్వర్లు హాకింగ్ కి గురయ్యాయి అని FBI అధికారులు ఒబామా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినా అవి డిజైన్ లు మాత్రమే ! వాటిని ఎక్జిక్యూట్ చేయడం మనకి తప్పితే వేరే ఏ దేశానికి సాధ్యం కాదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేలికగా తీసుకున్నది ఒబామా యంత్రాంగం ! అవే ఇప్పుడు అమెరికా పాలిట శాపంగా మారుతున్నాయి.
***************************
రష్యా ఇరాన్ కి 55 అత్యాధునిక Su-35 జెట్ ఫైటర్స్ ని అమ్మడానికి ఒప్పందం చేసుకుంది. యుద్ధ ప్రాతిపదికన వీటిని తయారు చేసి వచ్చే రెండేళ్ల లోపే డెలివరీ చేయడానికి పని మొదలుపెట్టింది రష్యా! ఇది రష్యాకి ఉపకరించే అంశం ! ఒకవేళ నాటో కనుక రష్యా మీద దాడి చేయడానికి సిద్ధపడితే ఇరాన్ ని కూడా తనతో చేర్చుకుంటుంది రష్యా. అందుకే Su-35 లని ఇరాన్ కి ఇవ్వడానికి సిద్ధపడ్డది రష్యా !
*********************************
(1988,1989 సంవత్సరాలలో TIFR ప్రయోగించిన వాతావరణ పరిశోధన బెలూన్ లాంచింగ్ లని నేను హై స్పీడ్ షట్టర్ తో వీడియో రికార్డ్ చేసిన అనుభవం ఉంది నాకు ! ECIL దగ్గర TIFR బలూన్ లాంచింగ్ ఫెసిలిటీ కోసం పెద్ద గ్రౌండ్ ఉంది. నేను రెండు సార్లు దగ్గరగా ఉండి ప్రయోగాలని రికార్డ్ చేశాను కాబట్టి నాకు అవగాహన ఉంది !)
Share this Article