పాన్ ఇండియా నవలిస్టు… ఈ పదమే కొత్తగా ఉంది కదా… నిజమే, నిఖార్సయిన, సిసలైన నవలిస్టు… ఇప్పటికి 60 లక్షల పుస్తకాలు… మీరు చదివింది నిజమే, అనేక భారతీయ భాషల్లో సహా ఆరు మిలియన్ల పుస్తకాలు అమ్ముడయ్యాయి తనవి… కిండ్లే, ఆడియో బుక్స్ అదనం… దాదాపు 200 కోట్ల టర్నోవర్ అని అంచనా… ఒకప్పుడు చేతన్ భగత్, తనెప్పుడో ఫేడవుట్… ఇప్పుడు అమిష్ త్రిపాఠి… శివపురాణాన్ని మూడు బుక్స్‌గా రాసిన తను రామాయణాన్ని నాలుగు పార్టులుగా రచించాడు… రెండు సీరీస్ అయిపోయాయి… తరువాత ఇక మహాభారతం… తన పుస్తక వ్యాపారం గురించి కాసేపు వదిలేస్తే…
తను అర్జెంటుగా కన్నడ ప్రఖ్యాత రచయిత భైరప్ప రాసిన పర్వను ఆమూలాగ్రం సరైన స్పిరిట్‌తో చదవాలి… భైరప్ప కూడా స్టోరీ రీటెల్లింగ్ చేస్తాడు… కానీ ఏ పురాణం, ఏ గ్రంథం మూలస్వరూపాన్ని డిస్టర్బ్ చేయడు… ఆ కాలంలో ఫలానా ఎపిసోడ్ ఇలా జరిగింది కావచ్చు అని తన ఊహను మనకు వివరిస్తాడు, మనం కన్విన్స్ అవుతాము… అందుకే పురాణాల స్టోరీ రీటెల్లింగ్ రైటర్స్ ఎవరూ ఆయన దరిదాపుల్లోకి కూడా పోలేరు… అమిష్ కూడా ఓసారి పర్వ చదవాలి అందుకే…
రామాయణ సీరీస్‌లో నాలుగోది, చివరి భాగం ‘వార్ ఆఫ్ లంక’ చదువుతుంటే అమిష్ ఆలోచన ధోరణి పట్ల, రచనా శైలి పట్ల జాలి, కోపం ఒకేసారి కలుగుతాయి… ఇది మరీ ఆర్ఆర్ఆర్ సినిమా తరహా పిచ్చి క్రియేటివిటీ… కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం… వేరే సమీక్ష, విశ్లేషణ అవసరం లేదు… తను రామాయణం ఒరిజినల్ కథనే ఎంత భ్రష్టుపట్టించాడో అర్థం అవుతుంది…
Ads
- లంకకు హనుమంతుడు గాలిలో ఎగురుతూ వెళ్లడు… పడవల మీద సురస, పది మంది సైనికులతో కలిసి వెళ్తాడు… సముద్రంలో లంకను చేరి, అక్కడ నదీమార్గంలో రావణ రాజధానిని చేరతాడు… తను అక్కడికి వెళ్లగానే అరిష్టనేమి అనే మలయపుత్రుల ప్రతినిధి కూడా కలుస్తాడు… ఇద్దరూ కలిసి సీతను తమతో వచ్చేయాలని ఒత్తిడి చేస్తారు… సీత నిరాకరిస్తుంది, తన భర్త వచ్చి, తీసుకువెళ్తేనే అయోధ్యకు పరువు ఉంటుందని, విష్ణువు అవతారానికి విలువ ఉంటుందని వాదిస్తుంది… హనుమంతుడు వాపస్ వెళ్లిపోతాడు… నో లంకాదహనం, నో సుందరకాండ…
- హనుమంతుడిని సీత అశోకవనంలోనే తొలిసారి చూడదు… ఆమెకు తను ఎప్పటి నుంచో పరిచయం… ఆమెను తమ్ముడిలా భావిస్తుంది…
- ఆంజనేయుడికి ఓ ప్రేమకథనూ పెట్టాడు రచయిత ఇందులో… సురస ఏకపక్షంగా ప్రేమిస్తూ ఉంటుంది… తనను పెళ్లి చేసుకోవాలంటూ అడుగుతూ ఉంటుంది… చివరకు లంక నుంచి తిరిగి వెళ్లే క్రమంలో లంక సైనికుల బాణాలకు గాయపడి, హనుమంతుడి ఒడిలోనే ఆమె కన్నుమూస్తుంది…
- రావణుడు సీత మీద మోహంతో ఆమె దగ్గరకు వెళ్లి… కమాన్, మా అంతఃపరానికి వచ్చెయ్ అని వేధించడు, సీత గడ్డిపోచను నిలువునా చీల్చి, నువ్వూ దీంతో సమానం అని ఛీత్కరించదు… రాక్షస మహిళలు ఆమెను వేధించరు… సీత రావణుడు అమితంగా ప్రేమించిన వేదవతి అనే కన్యాకుమారి కూతురు… అందుకే కుంభకర్ణుడు, రావణుడు రోజూ వెళ్లి, సీతతో కలిసి పోపుపెట్టిన అటుకులు, ఇడ్లీలు గట్రా తింటూ జీవనసారాలు, వైరాగ్యాలు, వేదాంతాలను చర్చిస్తూ ఉంటారు… సీత తినే వంటల కోసం రావణుడు గోకర్ణం నుంచి మేలిమి బియ్యాన్ని తెప్పిస్తాడు…
- శబరి రాముడిని చూసి, కాళ్లు మొక్కి, ఎంగిలిపళ్లను ఏమీ తినిపించదు… రాముడు సీతాన్వేషణలో వెళ్తుంటే వశిష్టుడూ తోడుంటాడు… శబరి పంబా నదీప్రాంతానికి పెత్తందారు, శబరిమల గుడికి ప్రధాన పూజారి… అప్పుడే 41 రోజుల దీక్షలు ఉండేవి… ఆమె రాముడికి మ్యాపులు చూపించి మరీ, కర్తవ్యం బోధిస్తుంది…
- సుగ్రీవుడితో దోస్తీ తరువాత రాముడు తాటిచెట్ల నుంచి వాలిని వెన్నుపోటు పొడవడు… విష్ణువు అధర్మానికి పాల్పడడు కదా… వాలితో రాముడే దోస్తీ చేస్తాడు, ఫలానా రావణుడిపై యుద్ధానికి వెళ్తాను, నీ గజసైన్యాన్ని ఇవ్వు అని అడుగుతాడు… సరైన ప్రత్యర్థి చేతుల్లో మరణించడానికి వాలి రాముడిని ద్వంద్వ యుద్ధానికి పిలుస్తాడు… ఆ యుద్ధంలో రాముడి ఖడ్గఘాతానికి వాలి మరణిస్తాడు…
- రావణుడు సీతను ఎత్తుకుపోయిన విషయం తెలిసిన భరతుడు రావణుడిపై యుద్ధానికి అయోధ్య సైన్యాన్ని సమీకరిస్తాడు…
- అన్నట్టు చెప్పనేలేదు కదూ… వాలికి పిల్లల్లేరు, వాలి భార్య తార సుగ్రీవుడి ద్వారా నియోగపద్ధతిలో అంగదుడిని కంటుంది… ఈ విషయాన్ని వాలి తల్లే స్వయంగా మరణశయ్యపై ఉన్నప్పుడు వాలికి చెబుతుంది…
బుర్ర గిర్రున తిరిగిపోతోందా..? అరె, 100 పేజీల కథలోనే ఇన్ని చెత్తా బాష్యాలు, వక్రీకరణలు, మూలకథకు అడ్డగోలు, అడ్డమైన మార్పులు, చేర్పులు… అవును మరి, ఈ రేంజ్ క్రియేటివిటీ చూపిస్తేనే కదా మనం ఆస్కార్ దాకా వెళ్తాం… ఈ పుస్తకమూ విపరీతంగా అమ్ముడుబోవడం ఖాయం…!!
Share this Article