Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శాములూ… నీ కాళ్లు మొక్కినా తప్పులేదు… మొగుడంటే నువ్వే భాయ్…

February 8, 2023 by M S R

ఖాకీల కారుణ్యం !!
***
భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం
***
పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసుంటుందని నిరూపితమైన ఘటన ఇది.
.
నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ అభాగ్యుని దీన గాథ ఇది.
.

బుధవారం ఒరిస్సాకు చెందిన ఇది గురు అనే మహిళ విశాఖ జిల్లాలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరగా, బతికే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. దీంతో భర్త సాములు ఆమెను ఆటోలో కోరాపుట్ జిల్లాలోని సరోడా గ్రామానికి బయల్దేరాడు.

.

ఖర్మ బాలేదు. పేదవాడికి చావు కూడా కష్టంగానే వస్తుంది.. అందుకే ఆటో విజయనగరం రాగానే గురు ఆటోలోనే కన్నుమూసింది. ఇక శవాన్ని నేను అంతదూరం తేలేను అంటూ 2000 లాక్కుని ఆటోడ్రైవర్ అక్కడే దించేశాడు. సాములుకు తెలుగు రాదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు..

Ads

husband

.
జీవితాంతం భార్యను ఆదరిస్తానని పెళ్లినాడు ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఇక ఏం ఆలోచించలేదు.. జస్ట్ 130 కిమి నడిచేద్దాం అని నిర్ణయించుకుని భార్యను భుజాన వేసుకున్నాడు.. కన్నీళ్లు దారి కప్పేస్తున్నాయ్.. అడుగులు తడబడుతున్నాయ్.. భుజాన భార్య వేలాడుతోంది.. అయినా సాములు నడుస్తూనే ఉన్నాడు.
.
husband
ఈ విషయం ఏదోలా పోలీసులకు చేరింది. వెంటనే సీఐ తిరుపతి రావ్, ఎస్సై కిరణ్ కుమార్ హుటాహుటిన వచ్చి సాములుకు ఊరడించి, కాసిన్ని నీళ్లు తాగించి.. చేతిలో ఓ పదివేలు పెట్టి, అంబులెన్స్ ఏర్పాటు చేసి వారిని స్వగ్రామానికి పంపారు. పోలీసుల సహాయానికి సాములు కన్నీళ్ళతో కృతజ్ఞత తెలుపగా… గురు శవాన్ని తీసుకుని అంబులెన్స్ ఒరిస్సా వైపు దారితీసింది.
.
.
(మిత్రుడు పంపింది యథాతథంగా…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక ఫోటో… కవితకు అసలు తెలియదో లేదో… గుర్తుందో లేదో ఫాఫం…
  • 500 రూపాయల నోట్ల చెలామణీపై వార్తలేమిటి..? నిజాలేమిటి…?
  • బాలీవుడ్ డింపుల్ క్వీన్… ప్రీతి మరో మొహం… 34 మంది పిల్లల తల్లి…
  • ఆ పాత్ర దెబ్బతినేసింది… ఫాఫం రాజేంద్ర ప్రసాద్ మెడ విరిగింది…
  • మాటే పాటైనవాడు. పాటే బాటైనవాడు. మనకు కర్ణామృతమైనవాడు
  • ఎంత డబ్బిచ్చినా సరే.., మోహన్‌బాబుతో మాత్రం పోను అంటుందామె..!!
  • రేయ్, ఫుడ్ బ్లాగర్లూ… నా మొహం కూడా మాడింది ఆ మసాలా దోశలాగే…
  • 2 ఫ్లాట్లు… 639 కోట్ల రికార్డు ధర… ఇంతకీ ఆ ధనికురాలు ఎవరంటే..?
  • అదే సీన్… 2 పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…
  • కాశీ తిరగబడింది… ఆ తెల్ల గవర్నర్ జనరల్ రాత్రికిరాత్రి పారిపోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions