కళ్యాణరామ్… ఎన్టీయార్ నట వారసుల్లో తన తరువాత మొదటితరంలో బాలకృష్ణ మాత్రమే, ఇంకెవరూ లేరు… అప్పుడెప్పుడో మొదలు పెట్టిన ప్రస్థానంలో ఇంకా తిప్పలు పడుతూనే ఉన్నాడు… ఆమధ్య చాన్నాళ్లు గ్రాఫ్ ఘోరంగా పడిపోయినవేళ అఖండతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు… రెండో తరంలో జూనియర్ సూపర్ హిట్టయ్యాడు… నిజంగా సరైన పాత్రలు పడాలే గానీ తనను కొట్టేవాడు లేడు టాలీవుడ్‌లో… ఆ ఎనర్జీ, ఆ మెరిట్, ఆ ఈజ్, ఆ డిక్షన్, ఆ డాన్స్ అన్నీ ఉన్నాయి తనలో… కాకపోతే పాత్రల ఎంపిక పూర్… అదే రొడ్డకొట్టుడు తెలుగు హీరో మార్క్ రొటీన్ ఫార్ములాలు…
జూనియర్ క్లిక్ కాకూడదని నందమూరి కుటుంబం యావత్తూ తారకరత్నను రంగంలోకి దింపి రికార్డు స్థాయిలో కొబ్బరికాయలు కొట్టించినా తను క్లిక్ కాలేదు… జూనియర్‌కు పది మైళ్ల దూరంలో ఉండిపోయాడు… ప్రస్తుతం దురదృష్టవశాత్తూ గుండెపోటుకు గురై బెంగుళూరు ఆసుపత్రిలో చావు బతుకుల నడుమ కొట్టుమిట్లాడుతున్నాడు… ట్రాజెడీ పాపం… ఇప్పుడు తన బ్రెయిన్ పనిచేయడం లేదనీ, పరిస్థితి అత్యంత విషమంగా ఉందనీ, ఈ ఎక్మాలు, విదేశాలకు తరలింపు, పాజిటివ్‌గా స్పందిస్తున్న బాడీ, చికిత్సకు సహకరిస్తున్న అవయవాలు వంటివి ఏవేవో చెబుతున్నా సరే, కేసు క్లోజింగుకు వచ్చినట్టేననే భయసందేహాలు ఆల్‌రెడీ వ్యాపిస్తున్నాయి… కోలుకుంటే అద్భుతమే, ఆనందమే…
మరో వారసుడు కల్యాణరామ్… అప్పుడెప్పుడో ఇరవై ఏళ్ల క్రితం హీరో అయ్యాడు… 2005లో అతనొక్కడే అనేది కాస్త క్లిక్కయింది… అంతే ఇక… ఇదీ నా సినిమా అని గర్వంగా చెప్పుకునేది ఒక్కటీ లేదు… తనే నిర్మాతగా మారి, తనే హీరోగా చిత్రాలు తీసుకున్నా సరే ఫాయిదా లేకుండా పోయింది… తను నటించకుండా నిర్మాతగా క్లిక్-2 తీశాడు, అదొకటి వచ్చిపోయినట్టు ఎవరూ గుర్తించలేదు… ఈ స్థితిలో ఇక సినిమాలే మానేశాడు… తనకు బింబిసార పునర్జన్మను ఇచ్చింది…
ఆ హ్యాంగోవర్‌లోనే మూడు పాత్రల్ని పోషిస్తూ అమిగోస్ అనే సినిమాను చకచకా పూర్తి చేసేసి రిలీజ్ చేశాడు శుక్రవారం… సేమ్, ఎవరైనా చేసేది అదే కదా… శుక్ర, శని, ఆదివారాల్ని మొదట్లోనే కాస్త క్యాష్ చేసుకోవడం కోసం… సినిమా పెద్దగా తన ఇమేజీ పెంచేదేమీ కాదు… పేరుకు మూడు పాత్రలు… పెద్ద ఇంప్రెసివ్ సినిమా కాదు… హీరోయిన్ ఆషికా ఒక్కతే అందంగా కనిపించింది… అదొక్కటే ప్లస్ పాయింట్… ఇదే హ్యాంగోవర్‌లో డెవిల్ అనే సినిమాను స్టార్ట్ చేశారు, 70 శాతం షూటింగ్ కూడా పూర్తయింది… బింబిసార-2కు కూడా శ్రీకారం చుడుతున్నారు… మరి ఆ బ్రాండ్ ఇంకా వాడుకోవాలి కదా… ఈసారి పాన్ ఇండియా అట మరి… ఇప్పుడదే వ్యాపార ట్రెండ్ కదా…
Ads
అమిగోస్ సినిమా విషయానికొస్తే… అసలు ఆ స్పానిష్ పేరు పెట్టడం దేనికో దర్శకుడికే తెలియాలి… స్పానిష్ భాషలో ఫ్రెండ్స్ అని అర్థమట… తెలుగులో పదాలే దొరకలేదా పెట్టడానికి..? సరే, ఈ సినిమా రివ్యూ మరో కథనంలో చదువుకుందాం…
Share this Article