సాధారణంగా పత్రికల సండే మ్యాగజైన్లు పెద్దగా పాఠకాసక్తి లేని అంశాలు, వినోదప్రధాన ముచ్చట్లకూ పరిమితం అవుతుంటాయి… లేదా సాహిత్యం గట్రా… చాలామంది పాఠకులు వాటి జోలికి కూడా పోరు… ఈనాడు సండే మ్యాగజైన్ తిరగేస్తుంటే ఓ కథ కనిపించింది… ‘ఇది… కథ కాదు’ అనే శీర్షికతో రాసిన కథ… నిజానికి అది కథ కాదు… అక్షరమక్షరమూ మనం బతుకుతున్న వ్యవస్థ వికృత, చీకటి కోణాల్ని చూపించే కథనం… రియాలిటీ… అందులో ఒక్క అక్షరమూ అబద్ధం కాదు…
మనం బతుకుతున్న సిస్టం గురించి ఒక్కొక్క పొర విడదీస్తూ చూపించినట్టుగా ఉంటుంది కథ… అసలు దీన్ని సండే మ్యాగజైన్ అంశంగా ఎంచుకోవడం అభినందనీయం… మహాభారతం వంటి పెద్ద సబ్జెక్టు,.. దాన్ని సంక్షిప్తీకరించుకుని, ఒక చిల్లర దొంగ కోణాన్ని తీసుకుని, ఆసక్తికరమైన శైలిలో ప్రజెంట్ చేసిన తీరు బాగుంది… కథలో చెప్పతగిన, చెప్పవల్సిన ఏ పాయింటూ మిస్ కాలేదు…
Ads
నిజానికి 28 ఏళ్లపాటు సాగిన దర్యాప్తు, విచారణ… ఇప్పటికీ నిందితులకు ఇంకా కాలయాపనకు మార్గాలున్నయ్… ఓ ధర్మప్రబోధకుడు నీతితప్పి, రీతితప్పి వ్యవహరిస్తూ, వ్యభిచరిస్తూ, ఓ విద్యార్థిని కళ్లబడటం… ఆమెను చంపేసి బావిలో పడేయడం…. ఇక అక్కడ్నుంచీ… ఎన్ని వేల పిటిషన్లు, ఎన్ని మలుపులు… వాస్తవంగా దీన్ని ఓ సీరియల్‌గా మలిస్తే కొన్ని వేల ఎపిసోడ్లు కావాలి…
మ్యాగజైన్ లింక్ ఇదీ…
https://epaper.eenadu.net/Home/Index?date=10/01/2021&eid=368&pid=1246389
ఈనాడు వెబ్ సైట్ లింక్ ఇదీ…
https://www.eenadu.net/sundaymagazine/article/321000033
మాట్లాడితే ప్రతి లీడర్ సీబీఐ దర్యాప్తు కావాలి అంటారు… అక్కడికి అదేదే పరమ పవిత్రమైన, నిక్కచ్చి, నీతినిజాయితీ, సామర్థ్యాలకు ప్రతీక అన్నట్టుగా…! అందులోనూ పోలీసులే కదా ఉండేది… ఈ కేసే తీసుకుంటే సిగ్గు తప్పి పరమ దరిద్రంగా వ్యవహరిస్తుంది సీబీఐ… నిందితుడిని రక్షించడానికి ఎన్ని వ్యవస్థలు ఎంత సాయపడ్డాయో చెబుతుంది కథ… అన్నింటికీ మించి ఆఫ్టరాల్ చెట్లెక్కి వక్కలు, రాగితీగెలు దొంగతనాలు చేసే ఓ దొంగ… పదిహేనేళ్లకుపైగా పోలీసులు కొట్టీ కొట్టీ పిప్పి చేస్తారు… ఐనా తను సత్యం వైపే నిలబడ్డాడు… ఎంత గ్రేట్… చివరకు కోర్టు కూడా ఆ దొంగను ప్రశంసించిన తీరును లీడ్‌గా తీసుకుని కథను మొదలుపెట్టిన తీరు బాగుంది… కథంతా చదివాక మనసు బరువెక్కుతుంది… కొన్ని ప్రశ్నలు సమాధానాలు లేకుండా… మన వ్యవస్థల్ని చూస్తూ పక్కుమని నవ్వినట్టుగా మనకు తోస్తాయి… ‘‘ఒళ్లంతా హూనమై, బతుకంతా చిత్రహింసలకు గురై, అంతులేని వేదనను అనుభవించిన ఆ నిర్దోషి దొంగకు దక్కిన పరిహారం ఏమిటి..? బాధ్యులకు పడిన శిక్షలేమిటి..? గతి తప్పి సాగే దర్యాప్తులకు అభిశంసన అక్కర్లేదా..?’’!!
Share this Article