పది సెకండ్లలో ఫుడ్ ఆర్డర్ డెలివరీ..! ఎహె, అసాధ్యం అని కొట్టిపడేస్తున్నారా..? కానీ అనుకోని రీతిలో ఇది సాధ్యమైంది… జస్ట్, పది సెకండ్లలో ఫుడ్ పార్శిల్ అప్పగించాడు ఓ డెలివరీ బాయ్… ఇది జరిగింది బెంగుళూరులో… అన్నిసార్లూ ఇది ఇలాగే సాధ్యం కాకపోవచ్చు… కానీ అనుకోకుండా ఇది జరిగిపోయింది… వివరాల్లోకి వెళ్తే…
బహుశా ఇది జరిగింది 9వ తేదీ… ఎన్డీటీవీ ఈ వార్తను కవర్ చేసింది… కాలెబ్ ఫ్రీసెన్ అని ఓ కెనెడియన్ బెంగుళూరులో ఉంటున్నాడు… అర్ధరాత్రి తనకు మెక్‌డొనాల్డ్స్ మీల్ కావాలి… కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి… బెంగుళూరు, కోరమంగళలోని ఓ ఔట్‌లెట్‌కు వెళ్లాడు… అప్పటికే దాన్ని మూసేశారు… నో డైనింగ్… కానీ..?
పికప్ విండో దగ్గర మాత్రం బాగా రష్‌గా ఉంది… డెలివరీ ఏజెంట్లు చాలామంది ఉన్నారక్కడ… డైనింగ్ లేకపోతేనేం, డెలివరీ ఆప్షన్ అయితే ఉంది కదా అనుకున్నాడు కాలెబ్… స్విగ్గీ యాప్ ఓపెన్ చేశాడు… ఆర్డర్ ఇచ్చాడు…
Ads
రెస్టారెంట్ దగ్గరే పికప్ పాయింట్ మెన్షన్ చేశాడు… అంటే నేను రెస్టారెంట్ దగ్గరే పార్శిల్ తీసుకుంటాను అని… ఈ ఆర్డర్ తీసుకోవడం, ఓ డెలివరీ బాయ్‌కు అసైన్ చేయడం, సదరు డెలివరీ బాయ్ అర్జెంటుగా పార్శిల్ తీసుకుని, అక్కడే వేచి చూస్తున్న కాలెబ్ చేతుల్లో పెట్టేయడం చకచకా జరిగిపోయాయి… జస్ట్, పదే సెకండ్లలో… అపూర్వం, రికార్డు… ప్రపంచంలో ఏ ఫుడ్ పార్శిల్ డెలివరీ సర్వీస్ కూడా ఈ వేగాన్ని ఇకపై అందుకోలేదు…
బ్రేవ్ అంటూ త్రేన్చాక కాలెబ్ సంతోషంగా ఓ ట్వీట్ కొట్టాడు… ‘‘కోరమంగళలోని మెక్ డొనాల్డ్స్‌కు వెళ్లాను, మూసేసి ఉంది, కానీ పికప్ విండో రద్దీగా ఉంది… ఏం చేయాలని ఆలోచించి, దాన్నే పికప్ పాయింట్‌గా ఆప్షన్ పెట్టి స్విగ్గీలో ఆర్డర్ పెట్టాను… వెంటనే పార్శిల్ నా చేతుల్లోకి వచ్చింది…’’ అని ఆనందపడిపోయాడు… ఎక్కడైనా టేక్ అవే పాయింట్లు తీసి ఉన్నా సరే, ఇంత వేగంగా పార్శిల్ చేతిలోకి వచ్చేది కాదు…
DROVE TO KORAMANGALA FOR MIDNIGHT MCDONALD’S, THEY SAID THEY WERE CLOSED, BUT THE PICK-UP WINDOW WAS FULL OF DELIVERY GUYS. WHAT TO DO?
I ORDERED SWIGGY FROM MCDONALD’S TO MCDONALD’S. 10-SECOND DELIVERY ACHIEVED. PIC.TWITTER.COM/W3PHZMGJRT
— CALEB FRIESEN (@CALEB_FRIESEN2) FEBRUARY 8, 2023
తను ఓ వీడియో కూడా షేర్ చేశాడు… డెలివరీ బాయ్ నవ్వు మొహంతో ఫోజు కూడా ఇచ్చాడు… ఇంత తక్కువ దూరంలో, ఇంత ఎక్కువ వేగంగా ఫుడ్ ఆర్డర్ సర్వ్ చేయడం తనకే విస్మయకరంగా ఉందని అంటున్నాడు సదరు డెలివరీ బాయ్… ఇక ట్విట్టర్‌లో ఫుల్ వైరల్ అయిపోయింది ఈ వీడియో, ఈ పోస్టు… సహజంగానే ఇంట్రస్టింగు కదా… ఆ వీడియోను 39 వేల మంది చూస్తే (ఇది రాసే సమయానికి) రకరకాల కామెంట్లు వరదలా ముంచెత్తుతున్నాయి… కొన్ని శాంపిల్‌కు… ఇలా… (స్టోరీ కాస్త పాతబడింది, ఐతేనేం, ఆసక్తికరంగా ఉంది)…
DID YOU ALSO AVAIL THE POST MID NIGHT SWIGGY MCD DISCOUNT. IT’S EITHER SOME MONEY OFF OR A FREE MCVEGGIE I THINK 😅
— ADITYA KATARE (@THEKATAREKID) FEBRUARY 8, 2023
ONLY IN BANGALORE 😂
CC – @RAJUPP
— CHINMAY DHUMAL (@CHINMAYDHUMAL) FEBRUARY 8, 2023
WAIT, DON’T THEY HAVE PICK-UP OPTION?
— SRUJAN VISHWANATH (@IAM_SRUJAN) FEBRUARY 9, 2023
SAME THING I DID IN HSR AS KFC WAS CLOSED I ORDERED ONLINE SAME PLACE .. THOU MINE DIDN’T ARRIVE IN 10SECS 😆😆
— AGGIE_ KISSIE (@AGGIE_KISSIE) FEBRUARY 9, 2023
ABSOLUTE @PEAKBENGALURU MOMENT! 😂
— NAVEEN KOLLI (@NAVEENKOLLI777) FEBRUARY 8, 2023
YES POSSIBLE IN MODI ERA
— ATIKRAMANBACHAO (@ATIKRAMANBACHAO) FEBRUARY 9, 2023
10 SECONDS, HAHA! ZEPTO’S GOING TO HAVE A COMPLEX.
— KRISHA (@HEY_KRISHA) FEBRUARY 9, 2023
INDIA IS THE FUTURE SIR . TRUST US WE WILL RULE THE WORLD ECONOMICALLY AND WITH HUMANITY. THIS IS JUST AN EXAMPLE OF OUR DEDICATION AND HARD WORK . JAI HIND.
— BHUPINDER SHAHI (@BUDBHUPI) FEBRUARY 9, 2023
Share this Article