ఈరోజు మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్నరకాలుగా ఫోకసైంది… నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు… దాని దృష్టిలో అసలు మద్యం స్కాం లేదు, దానిపై విచారణల్లేవు, దర్యాప్తుల్లేవు… కేసీయార్ భజన, కీర్తన, డప్పు ఉంటే దానికి చాలు… కేసీయార్ బిడ్డ ఇన్వాల్వయిన కేసు కాబట్టి, కేసీయార్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దానికి జోలికి పెద్దగా పోదు…
ఇక ఈనాడులో ‘ఎవరూ బెయిల్‌కు అర్హులు కారు’ అనే శీర్షికతో బ్యానర్ రాసింది… కానీ కేసీయార్ అంటే భయం వెన్నాడుతూనే ఉంది కాబట్టి ఉత్తర్వుల్లో కవిత పేరును నాలుగుసార్లు ప్రస్తావించిన వైనాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసింది… టెక్స్ట్ మ్యాటర్‌లో ఉంది గానీ డెక్కుల్లో కూడా ప్రస్తావించలేదు ఈనాడు… పైగా జగన్ పేరును తీసుకుంది… ఆ ఆర్డర్ లో జగన్ కేసును ఉదాహరణగా తీసుకుందనేది ఈనాడుకు ప్రధానమైపోయింది…
నిజానికి ఇందులో జగన్ మీద వ్యతిరేక వ్యాఖ్యలేమీ లేవు… బెయిల్ ఇవ్వడంలో జాగ్రత్తల్ని పేర్కొంటూ జగన్ కేసును, మరో కేసునూ ప్రస్తావించింది… జగన్ మీద మళ్లీ ఏదో కోర్టు వ్యతిరేకంగా మాట్లాడింది అనుకునేలా ఈనాడు ప్రాధాన్యం, రాసిన తీరు ఉన్నాయి… కంటెంటులో మాత్రం రాస్తే సరిపోయేది…
Ads
ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతి ప్రజెంటేషన్ సరిగ్గా ఉంది… జగన్‌పై అకారణ ద్వేషవిషాన్ని చిమ్మే పత్రికే కానీ ఈ కేసు, ఈ ఆర్డర్ కు సంబంధించి జగన్ పేరును ప్రస్తావించడంకన్నా, అందులో కవిత పేరు నాలుగు సార్లు ఉందనే అంశాన్ని ప్రధానంగా పబ్లిష్ చేసింది… సరైన ప్రాధాన్యమే… ఎందుకంటే..? మద్యం స్కాం కేసులో ఇప్పటికే చాలామంది అరెస్టయ్యారు, వాళ్లకు బెయిళ్లు లేవు… బయట ఉన్నది కవిత మాత్రమే… ఒకవేళ ఆమె అరెస్టయితే, దానికి రాజకీయంగా ఇంపార్టెన్స్ ఉంటుంది…
అరెస్టయ్యే చాన్స్ ఉంది అని పరోక్షంగా ఆంధ్రజ్యోతి ఆ ఆర్డర్ వార్త ద్వారా చెబుతోంది… నిజంగానే కవితను అరెస్టు చేయాల్సి ఉంటే సీబీఐ ఎందుకు వెనకాడుతోంది అనేదే ప్రశ్నే… కేంద్రం గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తోందా..? కేంద్రంలోని బీజేపీ కూడా కేసీయార్ పట్ల రాజకీయ ప్రత్యర్థిత్వాన్నే కనబరుస్తోంది… పైగా కవితను అరెస్టు చేస్తే, కేసీయార్ కుటుంబాన్ని కూడా బదనాం చేయడానికి బీజేపీకి ఉపయోగపడే కేసు అవుతుంది… తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయని సందేహిస్తోందా బీజేపీ..? తెలంగాణ రాజకీయాల్లో ఇంపార్టెంట్ కేసు కాబట్టి ఆంధ్రజ్యోతి ప్రయారిటీస్ కరెక్టు… మిగతా దినపత్రికల ప్రయారిటీలు తప్పు… సాక్షి ఇలాంటి విషయాల్లో కనబరుస్తున్న వైఖరి కూడా ప్రొఫెషనల్ బ్లండరే..!!
Share this Article