ఒక్కొక్క సినిమాయే ఫట్‌మని పేలిపోయాయి… చివరకు ఏ గొప్ప నటుడికి వారసుడిగా తెరపైకి వచ్చాడో ఆయన బయోపిక్స్ రెండూ బోల్తా కొట్టాయి… వయస్సు పెరుగుతోంది… కొత్తతరం వస్తోంది… ఇక బాలకృష్ణ కెరీర్ ముగింపుకు వస్తోంది అనుకున్నదశలో అఖండ తనకు ఓ పునరుజ్జీవం… ఆ సినిమాలోనూ బాలకృష్ణ మార్క్ వికారాలు కొన్ని ఉన్నా సరే, నయా అఘోరా పాత్ర తనకు సరిగ్గా సూటైంది… తన మార్కెట్ మళ్లీ ఒక్కసారిగా బుల్ దశలోకి వచ్చేసింది…
అదే ఊపుతో వీరసింహారెడ్డి వచ్చి, చిరంజీవి వాల్తేరు వీరయ్యతో ఢీకొట్టింది… ఏ సినిమా ఎంత వసూళ్లనే కాకిలెక్కల మాట ఎలా ఉన్నా, మళ్లీ పాత బాలకృష్ణ టెంపర్‌మెంట్ కనిపిస్తోంది… తను ఇప్పటికీ కమర్షియల్‌గా గిరాకీ ఉన్న సరుకే అనిపించుకున్నాడు… అఖండ, వీరసింహారెడ్డి సినిమాల తరువాత బాలకృష్ణ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది… అదీ చెప్పదగిన అంశం…
ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా సరే, ఎప్పుడూ చిన్న కమర్షియల్ యాడ్ జోలికి పోలేదు తను… చేస్తే సినిమా, లేదంటే లేదు… మరోవైపు సమాంతరంగా రాజకీయాలు ఉండనే ఉన్నాయి… ఐనా సరే, ఏ హీరో అయినా సరే, చాన్స్ దొరికితే చాలు చిన్నాచితకా యాడ్స్ చేసేస్తున్న రోజులివి… మహేశ్ బాబు అయితే యాడ్స్ చేయడంలో దిట్ట… చివరకు జీతెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా చేస్తున్నాడు… సొసైటీకి నష్టం వాటిల్లే కూల్ డ్రింక్స్, గుట్కా సరోగసీ యాడ్స్‌లో కూడా చేస్తున్నాడు… తన ఖాతాలో పది బ్రాండ్లున్నాయి…
Ads
నాగార్జున డిటర్జెంట్ పౌడర్, బంగారం దుకాణాలకూ యాడ్స్ చేశాడు… ప్రభాస్ మహేంద్ర వాళ్ల టీయూవీ 100 వెహికిల్‌కు యాడ్ చేశాడు… వెంకటేశ్ రామరాజు దుస్తుల బ్రాండ్, మణప్పురం గోల్డ్‌కు చేశాడు… ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే… ఇప్పుడు బాలకృష్ణ కూడా కమర్షియల్ యాడ్స్‌కు సై అంటున్నాడు… మొదట్లో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్‌తో స్టార్ట్ చేశాడు… తాజాగా వేగ జువెలర్స్‌కు ఇంకో యాడ్ చేశాడు… మంచి ఆఫర్స్ వస్తే మరిన్ని బ్రాండ్ ప్రమోషన్లు కూడా చేస్తాననే సంకేతాలు ఇస్తున్నాడు… తనను జనంలోకి తీసుకుపోయేది ఏదైనా సరే… అది టీవీ ప్రోగ్రామ్స్ కూడా…
ఇన్నాళ్లూ టీవీకి దూరంగా ఉన్న బాలయ్య అన్‌స్టాపబుల్ చాట్ షో ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు… అది సక్సెస్ కావడం కూడా బాలయ్య బ్రాండ్‌కు మరింత విలువ పెంచింది… సో, కాస్త బరువైన చెక్కు ఇవ్వగలిగేవాళ్లు తమ యాడ్స్ కోసం బాలయ్య బాబును సంప్రదించగలరు… స్క్రిప్టు దగ్గర జాగ్రత్త సుమా… కంటెంటులో ఎన్టీయార్ పేరొచ్చేలా రాయించండి, తన బ్లడ్డు-బ్రీడును పరిగణనలోకి తీసుకొండి… 50 శాతం డిస్కౌంట్ కూడా దక్కొచ్చు… వోకేనా..?!
Share this Article