ఎవరైనా పెద్దమనిషి బర్త్ డే వస్తే… పెళ్లిరోజు వస్తే… ఇంకేదైనా వ్యక్తిగత విశేషం ఉన్నప్పుడు…. మనం ఎంతగా వ్యతిరేకించినా సరే, ఎంత ప్రత్యర్థిత్వం ఉన్నా సరే, అవసరమైతే మౌనంగా ఉంటాం, లేకపోతే ‘‘మంచిగ బతుకుర భయ్, శుభాకాంక్షలు’’ అని చెబుతాం… అది సంస్కారం… అంతేతప్ప, నువ్వు తాగుతావు, తాగుబోతువు, ఆమధ్య నాతోనే చెప్పావు అని గుర్తుచేసి, విద్వేషాన్ని వెదజల్లి, మన కుసంస్కారాన్ని ప్రదర్శించం..!
కానీ ఏబీఎన్ రాధాకృష్ణ రూట్ వేరు కదా… అప్పట్లో, అంటే కేసీయార్ తెలంగాణ సీఎం గాక మునుపు, అప్పటికి తెలంగాణ రాక మునుపు ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ (అప్పుడూ అదే పేరుతో ప్రోగ్రాం ఉండేదాని డౌట్) కార్యక్రమంలో కేసీయార్‌తో చిట్‌చాట్ నిర్వహించాడు రాధాకృష్ణ… అప్పట్లో ఇద్దరూ జాన్ జిగ్రీ దోస్తులు… (ఇప్పుడూ అంతే, కాకపోతే ఎక్కడో, ఏ అవసరం దగ్గరో తేడా కొట్టి, కేసీయార్ మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నట్టున్నాడు పత్రికలో, టీవీ చానెల్‌లో…)
అప్పట్లో కేసీయార్‌ను రాజకీయ ప్రత్యర్థులు తాగిపడుకుంటాడు, తాగుబోతు అని విమర్శించేవాళ్లు… ఇప్పుడూ అలా విమర్శలు చేసేవాళ్లు ఉన్నారు… తెలంగాణ సమాజంలో మందు అలవాటు గురించి చెబుతూనే, తనకు మద్యం ఎలా అలవాటైందో కేసీయార్ స్ట్రెయిట్‌గానే చెప్పుకొచ్చాడు… దాపరికం ఏమీ లేదు… తాగితే తప్పేముంది..? దొరలాగే చెబుతున్నా, బాజాప్తా చెబుతున్నాను అని కొన్ని వివరాలు షేర్ చేసుకున్నాడు… సరే, నమ్మేవాడు నమ్మొచ్చు, నమ్మనివాడు నమ్మకపోవచ్చు…
Ads
కానీ ఆరోజు చెప్పిన వివరాలు ఆన్ రికార్డే కావచ్చుగాక… కానీ ఈ బర్త్ డే సందర్భంగా వాటిని పిచ్చి థంబ్ నెయిల్ ఒకటి పెట్టేసి, తాజా ఫోటోలు పెట్టి, యూట్యూబులో ప్రసారం చేయడం దేనికి..? ఎస్, మిస్టర్ రాధాకృష్ణా… ఇది అమర్యాదకరం అనడానికి నాకేమీ సందేహం లేదు… ఖచ్చితంగా చీప్ టేస్ట్ ఇది… పైగా తను ఆ వీడియో క్లిప్‌లో ఎక్కడా ‘‘వారంలో అయిదు రోజులు తాగి పడుకునేవాడిని’’ అనే మాట కేసీయార్ నోట రాలేదు… తనకు మందు ఎలా అలవాటైందో చెప్పుకొచ్చాడు…
ఇదేకాదు, అదే వీడియోను ముక్కలు ముక్కలు చేసి, రకరకాల థంబ్ నెయిల్స్ పెట్టి, సొమ్ము చేసుకునే ప్రయత్నం ఇది… ఆర్కేకు తెలిసి జరిగిందో లేదో తెలియదు గానీ నిందార్హుడు మాత్రం రాధాకృష్ణే అవుతాడు… తన చానెల్ కాబట్టి… విజయశాంతి ఎవరో నాకు తెలియదు, కేటీయార్ ప్రతిభను మొదట గుర్తించి చంద్రబాబే, మా ఆవిడా నామీద కోప్పడుతుంది, అరుస్తుంది థంబ్ నెయిల్స్ కూడా కనిపించాయి…
సరే, అవన్నీ పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా, ఈ మద్యం వీడియో బిట్ మాత్రం అభ్యంతరకరమే… ఆ వీడియో పునఃప్రసారం టైమింగు తప్పే… కేసీయార్ అనని మాటల్ని కూడా ఆయన నోట్లో పెట్టడం ఏమాత్రం బాగోలేదు మిస్టర్ రాధాకృష్ణా… ప్రొఫెషనల్‌గా కేసీయార్‌పై ఎన్ని విమర్శలు చేసినా, ఏ విశ్లేషణలకు పాల్పడ్డా వోకే… కానీ మరీ ఇవేం పురావస్తు తవ్వకాలు..?!
https://www.youtube.com/watch?v=c9SvX7IKooo
Share this Article