ఎండెమాల్ షైన్ … ప్రపంచవ్యాప్తంగా బిగ్‌బాస్ షో నిర్వహించేది ఈ కంపెనీయే… లోకల్‌గా కొందరు క్రియేటర్స్ సాయం తీసుకున్నా సరే ఓవరాల్‌గా వాళ్లవే హక్కులు… అతి పెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది… ఎస్, చాలామందికి నచ్చకపోవచ్చుగాక… తెలుగులో గత సీజన్ భ్రష్టుపట్టిపోవచ్చుగాక… కానీ స్థూలంగా బాగా క్లిక్కయిన షో ఇది… అదే కంపెనీ అదే బిగ్‌బాస్‌లో పార్టిసిపెంట్లను తీసుకుని బీబీ జోడీ పేరిట డాన్స్ కంపిటీషన్ షో తెలుగులో నిర్వహిస్తోంది…
వాళ్లెవరూ ప్రొఫెషనల్ డాన్సర్లు కదా, ఈ షోలో ఏముంటుంది మజా అనుకుని మెజారిటీ ప్రేక్షకులు మొదట్లో పెదవి విరిచారు… కానీ ఎక్సలెంట్… ప్రొఫెషనల్ డాన్సర్లను మించి పోటీపడుతున్నారు… చెమటోడుస్తున్నారు… తమ ఎనర్జీ లెవల్స్ ప్రదర్శిస్తున్నారు… కోఆర్డినేషన్, క్రియేటివిటీ, ఎనర్జీ, స్టెప్స్, ఫీలింగ్స్ ఎట్సెట్రా బలంగా పోటీపడుతున్నయ్… ఒక్క ముక్కలో చెప్పాలంటే బిగ్‌బాస్ షోను మించిన హిట్ ప్రోగ్రామ్ ఇది… 4.47 రేటింగ్స్ వచ్చినయ్ (హైదరాబాద్ బార్క్) తాజాగా… గత బిగ్‌బాస్ షోతో పోల్చినా, ఈటీవీ వాళ్ల ఢీ షోతో పోల్చినా చాలా చాలా బెటర్…
Ads
బహుశా స్క్రిప్టే కావచ్చుగాక… ఆదివారం నాటి షోలో భాను, రవి… అర్జున్ కల్యాణ్, వాసంతి చేసిన పర్‌ఫామెన్స్‌కు పదికి కేవలం ఒక మార్కు ఇచ్చారు… దిగజారుడుతనం అది… క్రీడల్లో క్రీడాస్పూర్తి ఉన్నట్టే ఇలాంటి పోటీల్లో కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి… తాము వెనకబడిపోతామేమో అన్నట్టుగా తమ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.కు ఇలా ఒక మార్కు ఇవ్వడం ఈ షోను ఒక్కసారిగా దిగజార్చేసింది… ఎప్పుడైతే ఇలాంటి పోటీల్లో స్ట్రాటజీలు ప్రవేశిస్తాయో, అప్పుడే షో స్పిరిట్ దెబ్బతినిపోతుంది…
అఫ్‌కోర్స్, జడ్జిగా ఉన్న రాధ దీన్ని ఖండించింది… వాళ్లు మార్కులు వేసినప్పుడు ఇదే రేంజులో వేశారు, అదేమంటే మీరు చూపిన స్పిరిటే కదా అని జవాబిచ్చారు… బాగుంది… స్క్రిప్టెడ్, క్రియేటెడ్ అయినా సరే, బిగ్‌బాస్ జోడీ షోను రన్ చేస్తున్న తీరు బాగుంటోంది… కాకపోతే ఇలాంటి స్పిరిట్‌లెస్ ఆలోచనల్ని రుద్దడంకన్నా రియల్ స్పిరిట్‌తో నడిపిస్తే ఇంకా బాగుంటుంది… తేజస్వి, ఫైమా తదితరులు నిజంగా షోను హైజాక్ చేస్తున్నారు… ఇక వాసంతి అయితే నంబర్ వన్… మగ జెంట్స్‌తో పోలిస్తే ఆడ లేడీస్ ఇరగదీస్తున్నారు…!!
Share this Article