పత్రికల్లో వచ్చేవి అందరూ అన్నీ చదువుతారని కాదు… ఎవరి జానర్ వాళ్లు సెలక్ట్ చేసుకుని చదివి, మిగతావి వదిలేస్తుంటారు… సహజం… కానీ పత్రికల సండే మ్యాగజైన్లు వేరు… సాహిత్యం, సృజన పాళ్లు ఎక్కువ… అసలు ఇక్కడే పాత్రికేయం జాగ్రత్తగా ఉండాలి… ఇవి అందరూ చదవరు… కానీ చదివేవాళ్లు కీన్‌గా ఉంటారు… ప్రతి పదాన్నీ జాగ్రత్తగా చూస్తారు… తప్పును పట్టుకుంటారు… ప్రత్యేకించి అనువాదాల దగ్గర మరీనూ… అనువాదం ఈనాడు పైత్యంలా మక్కీకిమక్కీ ఉండొద్దు… ఒరిజినల్ స్పిరిట్, భావం చెడిపోకుండా సరళమైన మన భాషలో చెప్పగలగాలి…
ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్‌లో ఓ ఆర్టికల్… అందులో హిందీ టు తెలుగు అనువాదం ఎంత అర్థరహితంగా ఉందో ఓ మిత్రుడు చెబుతున్నాడు… తన ఫేస్‌బుక్ వాల్ మీద షేర్ చేసుకున్నాడు… ముందుగా ఆ ఆర్టికల్ చదవండి… తరువాత మిత్రుడి లోపనిర్ధారణ కూడా చదవండి… (మొత్తం ఆర్టికల్ కాదు, ఈ పోస్టుకు సరిపోయేంత మాత్రమే ఉంది…)
Ads
Murali Krishna Kasturi……… హిందీ , ఉర్దూ తెలియనివారు, శేర్ షాయరీలలోతు బోధపడనివారు, ఎందుకని హిందీ సినిమా పాటలపై వ్యాఖ్యానించి తమ అజ్ఞానాన్ని అందరికీ పంచాలని తపన పడతారో! ప్రొద్దున్న ప్రొద్దునే, నేను ఆదివారం అనుబంధం చదవనేల? ఇంత చిరాకు పడనేల? తెలుగు జర్నలిస్టుల అజ్ఞానవాహినికింత ఆశ్చర్యపోనేల? ఎవరయినా ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో హిందీ, ఉర్దూ, శేర్ షాయరీలతో పాటూ కాస్త తెలుగు కూడా తెలిసినవారిని పెట్టుకోమని చెప్పండి.. లేకపోతే, ఈ హిందీ పాటల కాలం ప్రూఫ్ రీడింగ్ ఔట్ సోర్స్ చేయమని చెప్పండి..
మేరే చెహెరే సే—- అంటే నా మోవిపై నుంచి కాదు…. మోవి అంటే, అధరము, పెదిమలు.. మోము అంటే ముఖము.. చెహెరా అంటే ముఖము.. తేరే చెహెరేసే నజర్ నహీ హట్ తీ— అన్నది సాహిర్ ప్రయోగం.. అంటే, నీ వదనం నుంచి నా కళ్ళు కదలటంలేదు, అంటే, ఆమె ముఖం నుంచి కళ్ళు తిప్పుకోలేకపోతున్నాడని అర్ధం.
మైన్ నిగాహే తేరే చెహెరే సే హటావూన్ కైసే— అంటే, నీ వదనం నుంచి నేను కళ్ళు ఎలా తిప్పుకోవాలి, తిప్పుకోలేను అని అర్ధం… కాబట్టి మేరే చెహెరేసే అంటే.. నా మోవిపై నుంచి కాదు… వో బద్లే తో జమానేకి హవాభీ బద్లీ– అంటే, జగాన గాలి కూడా మారిపోయింది కాదు.. జగాన గాలి మారటం ఏంటో…… ఇది బుర్ర లేని యంత్రపు యాంత్రిక అనువాదం. హవా బదల్నా అంటే, వాతావరణం మారింది అన్న అర్ధం వస్తుంది. ఈ సందర్భంలో, ప్రియుడి ప్రవర్తన మారింది అన్న భావన.
అది సునే సునే దర్ కాదు.. సూనే సూనే… సూనా అంటే, ఒంటరితనం నుంచి, శూన్యం ద్వారా, తిరస్కృతి వరకూ బోలేడన్ని అర్ధాలున్నాయి.
సూనె సూనె దర్-ఓ-దీవార్ నజర్ ఆతే హై అంటే, శూన్యంలో ఘూర్ణిల్లుతున్న తలుపులూ గోడలే సమస్తమై కనిపిస్తున్నాయి కాదు. పత్తికోండ నాగప్ప పదిరూపాయలు ఎగవేశాడుకి cotton mountain cobra father ten rupees jumped away లాంటి అనువాదం ఇది. మొహబ్బత్ కా చలన్ అంటే ప్రేమ యానం కాదు. మరో పత్తికొండ నాగప్ప ఇది. అర పేజీ ఆర్టికల్లోని తప్పులు చూపి సరయిన అర్ధాలు చెప్పేందుకు అరవై పేజీలు పట్టటం తెలుగు పాఠకులు చేసుకున్న దురదృష్టం. ఉదయమే ఇది చూడటం నా ఖర్మ…!!!
Share this Article