అప్పట్లో వైఎస్ మీద ఎన్ని రాసినా… ఇప్పుడు జగన్ మీద రాస్తున్నా… ఈనాడు గానీ, ఆంధ్రజ్యోతి గానీ, టీవీ5 గానీ… ఎప్పుడైనా పొరపాటో, తప్పో దొర్లితే వివరణ, ఖండన, క్షమాపణ, సంతాపం, స్పష్టత వంటివేమీ ఉండేవి కావు… అబద్ధాలు రాయకపోతే అది పాత్రికేయం ఎలా అవుతుంది..? అసలు జగన్ మీద రాయకపోతే అది జర్నలిజం ఎలా అవుతుంది..? అనే తెంపరితనం కనిపించేది… మా పొలిటికల్ లైన్ ఇదే, ఏం చేసుకుంటావో చేసుకోపో అనే వైఖరి కనిపించేది…
క్రమేపీ పాఠకులు కూడా ఈ ధోరణికి అలవాటు పడిపోయారు… ఏదైనా ముఖ్యమైన వార్త వస్తే సోషల్ మీడియా పోస్టులతో నిజమేమిటో చెక్ చేసుకుంటున్నారు… (సాక్షితో కాదు, అందులో పూర్తి రివర్స్ ఉంటుంది కదా…)… అత్యంత అరుదుగా వివరణ, సంతాపం, ఖండన వంటివి కనిపిస్తాయి… బుధవారం జరిగింది ఇదే… మంగళవారం తెలుగుదేశం పట్టాభిని పోలీస్ కస్టడీలో ఉండగానే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టారు అనేది వార్త… (గతంలో రఘురామకృష్ణంరాజు ఆరోపణ కూడా ఇదే…)
ఆంధ్రజ్యోతిలో నిన్నటి ఫస్ట్ లీడ్ వార్తలో పాత్రికేయ రాహిత్యం గురించి మనం చెప్పుకున్నాం కదా… ఈరోజు ఈనాడు బ్యానర్ స్టోరీ కూడా అంతే… సరే, వాళ్ల పొలిటికల్ లైన్ ఆధారంగా పట్టాభి అండ్ కో చెప్పిన ఆరోపణల్ని కుమ్మేశారు… వోకే, బురద జల్లడం కామనే కదా… కానీ పట్టాభి చేతులకు, కాళ్లకు గాయలు అయినట్టు ఫోటోలు కూడా పెట్టారు… కానీ అందులో చేతుల ఫోటోలు మాత్రమే నిన్నటివి… కాళ్లపై గాయాలు 2021 నాటివి… అంటే స్టోరీలో సీరియస్‌నెస్ కోసం పాత ఫోటోల్ని కూడా జతచేసి, స్టోరీని దంచి కొట్టారన్నమాట… (పట్టాభిని కొట్టినట్టేనా…?)
Ads
ఇక్కడ పట్టాభినీ కొట్టారు… అంటే పట్టాభిని కూడా కొట్టారు అని… వేరే ఎవరిని కొట్టారు మరి..? వాళ్లతోపాటు పట్టాభిని కూడా కొడితే కదా ఈ వాక్యం అర్థవంతం, నిజం అయ్యేది… (రఘురామకృష్ణంరాజును కొట్టిన సంగతిని గుర్తుచేస్తున్నారా అన్యాపదేశంగా…?) వోెకే, అదీ గుర్తుచేస్తే తప్పులేదు, కానీ కంటెంటులో ఉండాలి కదా… లేదు…!
ఈనాడు బ్లండర్ ఎక్కడ పక్కా ఆధారంతో దొరుకుతుందా అని పోలీసులు, ప్రభుత్వం ఎదురుచూస్తోంది… పైగా ఇది కోర్టు వ్యాజ్యంతో ముడిపడి ఉన్న వ్యవహారం… మరోవైపు పాత ఫోటోలతో పక్కాగా దొరికిపోయేట్టుగా ఉంది… లక్షల కాపీలు ఈ తప్పుడు ఫోటోలతో మార్కెట్‌లోకి వెళ్లిపోయాయి… ఇప్పుడు తాపీగా… ‘‘అరెరె, చేతులపై కొట్టిన ఫోటోలు మంగళవారం నాటివే, కానీ కాళ్లపై కొట్టినట్టున్న ఫోటోలు మాత్రం పాతవి, ఈ మేరకు ఈ-పేపర్‌లో సవరణ చేశాం, సాంకేతిక కారణాలతో ఈ తప్పు దొర్లింది, చింతిస్తున్నాం’’ అని ఈటీవీలో, ఈపేపర్‌లో రాసుకున్నారు…
మరి లక్షల ప్రింట్ కాపీల్లో జనంలోకి వెళ్లిపోయిన తప్పు మాటేమిటి..? రేపటి సంచికలో ఈనాడులో కూడా సవరణ లేదా వివరణ రాస్తారా..? అయినా జగన్‌పై బురద జల్లడం అలవాటైనప్పుడు… అదీ తాము బురదలో ఉండి ఈ చల్లే ప్రక్రియ జోరుగా చేస్తున్నప్పుడు… మన బట్టల మీద బురద పడకుండా చూసుకోవాలి… లేకపోతే ఇదుగో ఇలాగే కడుక్కోవాల్సి వస్తుంది… కిందా మీదా, వెనుకా ముందు…!! పోలీసుల థర్డ్ డిగ్రీ గురించి రాసేటప్పుడు థర్డ రేటెడ్‌గా ఉండకుండా జాగ్రత్తపడాలి… అసలే వాళ్లు ఏపీ పోలీసులు మరి…!!
Share this Article