Akula Amaraiah……… 1879 డిసెంబర్ 30, హిల్స్ కౌంటీ, టెక్సాస్… *డియర్ ఫాదర్, నేను నా వ్యవసాయ క్షేత్రానికి చేరా. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నా. పొలమంతా తిరిగి చూశా. మీరు చెప్పినట్టే చేస్తున్నా.. ఈ ఏడాది మొక్కజొన్న, పత్తి మంచి దిగుబడి వచ్చేలా ఉన్నాయి. తక్షణం నాకు వ్యవసాయ పనివాళ్లు కావాలి…..*. ఏమిటిదనుకుంటున్నారా? సుమారు 150 ఏళ్ల నాడు వ్యవసాయానికి సంబంధించి ఓ కుమారుడు తండ్రికి రాసిన లేఖ అలా సాగుతుంది. మనం కరెంటు బిల్లులు, ప్రామిసరీ నోట్లు దాచుకోవడం లేదా? ఏముంది గొప్ప అనుకోవచ్చు గానీ సాగుపై లేఖను కాపాడడం, ఇదీ మన వారసత్వమని భావితరానికి చెప్పడమే విశేషం..
నోటి మాట తప్ప సాయమేదీ?
ఇండియాలో ఇటువంటి వ్యవసాయ మ్యూజియం లేదంటారు. మనకున్నది నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ మ్యూజియం. అది ఢిల్లీ ఐసీఏఆర్‌లో ఉంది. మన నాయకులు నోరు తెరిస్తే వచ్చే పదం రైతు, వ్యవసాయం. ఇప్పటికీ 65,70 శాతం మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ రంగంపై ఆధారపడి ఉన్నాం. కానీ, సాగు రంగం గురించి భావి తరాలకు చెప్పే ఓ మ్యూజియం లేకపోవడం విచారకరం. పైగా మనమే సెటైర్లు వేస్తాం. వరి మొక్కో, చెట్టో తెలియకుండా పోతుందని వాపోతాం. మన వ్యవసాయ వారసత్వ సంపదను కాపాడుకునేందుకు మనం ఏమి చేయలేకపోయామే అని బాధ పడం. గతం తెలియకుండా వర్తమానాన్ని లెక్కించలేం. భవిష్యత్‌ను అంచనా వేయలేం. చూసే వాళ్లకి అది అర్థం కావాలంటే మన వ్యవసాయ వారసత్వమేమిటో పిల్లలకు తెలియాలి. టెక్సాస్ మాదిరి ప్రతి రాష్ట్ర రాజధానిలో అగ్రికల్చరల్ మ్యూజియంలను ఏర్పాటు చేసుకోవాలి… అమరయ్య ఆకుల, సీనియర్ జర్నలిస్ట్ 9347921291
Ads
Share this Article