ఇప్పుడంటే సరుకులు, సేవలు, ఉత్పత్తుల ప్రచారానికి బోలెడు మార్గాలున్నయ్… టీవీలు, పత్రికలు, రేడియోలు, సోషల్ మీడియా, హోర్డింగ్స్ ఎట్సెట్రా… కానీ ఒకప్పుడు రేడియోలు, పత్రికలు మాత్రమే కదా… లేదంటే పోస్టర్లు… అనుకోకుండా ఓ కూల్ డ్రింక్ యాడ్ కనిపించింది… అది పార్లే వాళ్ల గ్లూకో కోలా… కోకోకోలాను చూసి పలు రాష్ట్రాల్లో అలాంటి డ్రింకే చాలామంది తయారు చేసేవాళ్లు…
కొన్ని కంపెనీలు మామడి పళ్లరసం, ఆరెంజ్ రసం, నిమ్మ రసం ఇతరత్రా పళ్ల రసాల పేరిట డ్రింక్స్ అమ్మేవాళ్లు… మన తెలుగునాట కూడా రామోజీరావు సోమా అనే కూల్ డ్రింక్ కొన్నాళ్లు తయారు చేశాడు… కానీ క్లిక్ కాలేదు… చివరకు దాన్ని క్లోజ్ చేశాడు… రామోజీరావు ఫెయిల్యూర్ వెంచర్లలో అదీ ఒకటి…
లోకల్ తయారీ షర్బత్‌లను దాటేసి కూల్ డ్రింక్స్ అమ్ముడయ్యేకొద్దీ వాటి ఆదాయం, ప్రచారం, అమ్మకాలు పెరిగిపోసాగాయి… పార్లేవాళ్లు గ్లూకో కోలా పేరిట డ్రింక్ తయారుచేసేవాళ్లు… వాటికి సంబంధించిన యాడ్స్‌లో స్వదేశీ ప్లేవర్ ఉండేలా పలు మోరల్ స్టోరీస్ ఇచ్చేది… ఇది ఏ పత్రికలో పబ్లిషయిందో తెలియదు గానీ, ఓల్డ్ ఇండియన్ యాడ్స్ డాట్ కామ్ ఇలాంటివి కొన్ని సేకరించింది… అందులో ఇది ఒకటి…
Ads
ఈ కోలా నినాదం ఏమిటంటే..? ఏ మ్యాటర్ ఆఫ్ టేస్ట్… అంటే రుచి మాత్రమే కాదు, అభిరుచి కూడా… తమ కోలా ప్రత్యేకతలు ఏమిటో చెబుతూనే నీతికథలు కొత్తగా పబ్లిష్ చేయించేది… పైన ఉన్నయాడ్ చూశారు కదా… అందులో కథ ఏమిటో తెలుసా..?
‘‘ఒక రాజావారు యూరిప్ టూర్ వెళ్లాడు… అక్కడ ఓ కేబరే డాన్సర్‌ను చూశాడు… ఆమె మోహంలో పడి, పెళ్లి కూడా చేసుకుని తెచ్చుకున్నాడు… ఆమెకు గ్లామర్ ఎక్కువ… కానీ ఆమె జీవనవిధానం పూర్తిగా వేరు… ఇద్దరి నడుమ గొడవలు జరిగేవి… ఒకరి అలవాట్లను మరొకరు విమర్శించేవాళ్లు… ఓరోజును ఆయన్ని కోర్టుకు లాగింది… డ్యామేజెస్ దావా వేసింది… విడాకులు తీసుకుంది… మాయమైపోయింది… మనసు విరిగిన రాజావారు చింతించి చింతించి చివరకు తన ప్యాలెస్‌లోని బావిలో దూకాడు… మన జీవనవిధానం కలిగిన ఇంకెవరినైనా చేసుకుని ఉంటే, బాగా బతికేవాడు కదా…’’
టేస్ట్ ఎలా ఉండాలో చెప్పడానికి ఈ కథ… కోకో కోలాలు కాదు, గ్లూకో కోలా తాగండని పరోక్షంగా చెబుతున్నది ఈ యాడ్… ఇలా ఎన్ని నీతులు చెప్పినా సరే ఒకసారి కోకో కోలాకు అలవాటు పడితే ఇక వేరే సీసాల జోలికి వచ్చేవాళ్లు కాదు… అందుకే కోకో కోలా పోటీకి స్థానిక కంపెనీలు అనేకం మూతపడ్డాయి… ఈ గ్లూకో కోలా ఎన్నాళ్లు నడిచిందో తెలియదు…!!
Share this Article