ఎవరో మిత్రుడు ఫేస్‌బుక్‌లోనే చెప్పినట్టు…. ‘‘అసలు కిటుకు అక్కడే ఉంటుంది… అది వినియోగదారుడికి అర్థం కాదు… రిలయెన్స్ వాళ్ల ఎత్తుగడలు ప్రధానంగా అలాగే ఉంటాయి… ముందు చెప్పిన ముచ్చట్లకు కట్టుబడి ఉండరు… ముందుగా మోనాటనీ సాధించి, తరువాత దండుకోవడం మొదలుపెడతారు… ఒక పద్దతికి రిలయెన్స్ ఎప్పుడూ కట్టుబడి ఉండదు…
జియో నెట్‌వర్క్ బిల్లులు మొదట్లో ఎలా ఉండేవి, ఇప్పుడు ఆ ప్యాకేజీల అధిక రేట్లు తెలుస్తూనే ఉన్నాయిగా… ఇప్పుడు ముఖేష్ అంబానీ ఐపీఎల్ ప్రసారాల్ని ఉచితంగా అందిస్తానని నమ్మకంగా చెబుతున్నాడు… తనేమైనా పిచ్చోడా..? పక్కా వ్యాపారి… పైగా దేశంలోని వ్యాపారసంస్థలన్నీ వ్యూహాల్లో కొట్టేయగల ముదురు వ్యాపారి… ఉచితంగా ఎందుకిస్తాడు..? పైగా తను 2.7 బిలియన్ డాలర్ల దాకా వెచ్చిస్తున్న ఐపీఎల్ ప్రసార హక్కులు…
ఇక్కడ ఓ కామన్ సూత్రం ఓసారి చదువుకోవాలి… ‘‘ఏ కార్పొరేట్ సరుకూ ఉచితం ఉండదు… అదేమీ ట్రస్టు కాదు, ఛారిటీ కాదు… ఏదో ఒక హిడెన్ ఎత్తుగడ ఉంటుంది… ఏదేని సరుకును ఒక కార్పొరేట్ సంస్థ ఉచితంగా ఇస్తున్నదీ అంటే నువ్వే సరుకు అవుతున్నావన్నమాట…’’
Ads
- – మిగతా నెట్‌వర్క్‌ల నుంచి పోర్ట్ ద్వారా ఇంకా వినియోగదారులను తమ ఫోల్డ్‌లోకి తెచ్చేసుకోవడం… తద్వారా కస్టమర్ బేస్ పెంచుకోవడమే కాదు, క్రమేపీ టెలికాంలో మోనోపలీ వచ్చాక, ఇక ఛార్జీలతో బాదేయడం…
- – ఇన్నాళ్లూ ఐపీఎల్ చూసే ప్రేక్షకులు వేరే టెలికాం నెట్‌వర్క్ వినియోగదారులు అయితే… వారు ఈ ఉచిత ప్రసారాల ఆశతో జియో ఫోల్డ్‌లోకి వచ్చేస్తారు…
- – యాడ్స్ టారిఫ్ విపరీతంగా పెంచేస్తారు… ఎందుకంటే, తమ ప్లాట్‌ఫారం మీదే ఐపీఎల్ ఎక్కువ చూస్తారు కాబట్టి…
అన్నింటికీ మించి మరో బిజినెస్ టాక్టిస్ ఉంది ఇందులో… దిగువన ఓ చార్ట్ చూడండి… హై క్వాలిటీ, 4 కే, హై డెఫినిషన్ ప్రసారాలు ఇస్తామని చెబుతున్నది రిలయెన్స్…
ఒక్కో మ్యాచ్‌కు 3.6 జీబీ డేటా కావాలట… హెచ్‌డీ ప్రసారమైతే 10.6 జీబీ డేటా… ఇక 4కే ప్రసారమైతే ఏకంగా మ్యాచుకు 26.6 జీబీ అవసరమని టెక్ ఇన్‌ఫార్మర్ లెక్క… మరి మామూలు కనెక్షన్లలో రోజుకు ఒక జీబీ, రెండు జీబీల డేటా ఇస్తాడు జియోవాడు… ఆ పరిమితి దాటితే అదనపు డేటాను కొనుక్కోవాలని రకరకాల ప్యాకేజీలు పెట్టాడు…
అంటే క్రికెట్ చూడాలని అనుకునేవాడు, ఎక్కువ టారిఫ్ ప్లాన్‌లోకి మారాలి… లేదంటే సరిపడా డేటాను అధికధరలకు కొనుక్కోవాలి… సో, ఉచిత ప్రసారాల డబ్బును డబుల్ వసూలు చేసుకుంటాడు… వినియోగదారుడికి ఈ ఉచిత ప్రసారాలతో దక్కింది ఏమున్నట్టు..? ఏమీ లేదు… హళ్లికిహళ్లి… ఎవరో చెప్పినట్టు… వాళ్లు గుజరాతీలు… అందరూ నూనెలో బజ్జీలు తీస్తే, వీళ్లు బజ్జీల్లో నుంచి కూడా నూనె తీస్తారు…
Share this Article