ఓటీటీల్లో కనిపించే ఫిక్షన్ కంటెంటుతోపాటు టీవీల్లో కనిపించే నాన్-ఫిక్షన్ కంటెంటును కూడా ఆహా ఓటీటీ ప్రేక్షకులకు అందిస్తోంది… అంటే రియాలిటీ షోల కంటెంటు రఫ్‌గా చెప్పాలంటే..! తరచూ తమ ఓటీటీ వైపు ప్రేక్షకులు రావడానికి ఈ రెగ్యులర్ నాన్ ఫిక్షన్ షోలు ఉపయోగపడతాయి… ఈవిషయంలో అల్లు అరవింద్ టీం ఆలోచన సరైందే… అది టీవీలతో పోలిస్తే నాణ్యంగా ఉండి క్లిక్ కూడా అవుతున్నాయి… బాలయ్య అన్‌స్టాపబుల్ సక్సెస్ చూశాం కదా…
అల్లుఅరవింద్ మాటల్లోనే చెప్పాలంటే నాన్ ఫిక్షన్ ప్రోగ్రామ్స్ ను, అంటే డాన్స్, కామెడీ, చాట్, మ్యూజికల్ షోల వంటివి 160 కోట్ల నిమిషాలపాటు చూశారట ప్రేక్షకులు… నిజానికి ఆహా ఓటీటీలో ఫిక్షనల్ కంటెంటు, అంటే సీరియళ్లు, సినిమాలతో పోలిస్తే ఈ నాన్ ఫిక్షనే బాగా క్లిక్కయిందనుకోవాలి… అలా బాగా సక్సెసైన వాటిలో ఒకటి తెలుగు ఇండియన్ ఐడల్…
మరీ హిందీ ఇండియన్ ఐడల్ రేంజులో కాకపోయినా ఒక ప్రాంతీయ భాష ఓటీటీ స్థాయికి ఈ షోను బాగానే ఆర్గనైజ్ చేశారు… థమన్, కార్తీక్, నిత్య, శ్రీరామచంద్ర ఈ షోను రక్తికట్టించారు… వైష్ణవి, వాగ్దేవి, ధరంశెట్టి, రేణుకుమార్, జయంత్ వంటి మెరిట్ ఉన్న సింగర్స్‌ను వెలుగులోకి తీసుకొచ్చింది షో… అఫ్‌కోర్స్, అదితి భావరాజు వంటి ఆల్రెడీ సినిమాల్లో పాడుతున్న వాళ్లనూ తీసుకురావడం ఆడ్‌గా అనిపించింది… కొత్త ప్రతిభను వెలికితీయాలనేది కదా షో సంకల్పం…
Ads
మార్చి 3 నుంచి ఇండియన్ ఐడల్ సెకండ్ సీజన్ స్టార్ట్ చేయబోతున్నారు… ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి… హోస్ట్ శ్రీరామచంద్ర ప్లేసులో హేమచంద్ర, జడ్జి నిత్యామేనన్ ప్లేసులో గీతామాధురిని తీసుకున్నారు ఈసారి… నిత్యామేనన్ తక్కువేమీ కాదు, ఆమెతో పోలిస్తే గీతామాధురి మరీ లావుగా కనిపిస్తోంది… థమన్‌కు సరిపోయేలా ఉంది… జడ్జిల ప్లాట్‌ఫామ్ బాగా నిండుగా కనిపించింది…
దీన్ని నెల్లూరులో వేలాది మంది ముందు లాంచింగ్ చేయడం పెద్ద కనెక్టింగుగా ఏమీలేదు… ఓ నాసిరకం షో నిర్వహించారు… ఏర్పాట్లు గట్రా బాగున్నాయి… కానీ కంటెంట్ బోర్… ప్రోగ్రామ్ యాంకర్ల దగ్గర్నుంచి, ఆర్కెస్ట్రా, కొన్ని పాటలు… చివరకు హేమచంద్ర, గీతామాధురి పాటలు కూడా బాగా లేవు… అడుగడుగునా ఆర్టిఫిషియాలిటీ… బోరింగ్… ఇండియన్ ఐడల్ అంటే కొత్త ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలి, పోటీపెట్టాలి, నిగ్గుతేల్చాలి, నిశిత పరిశీలన జరగాలి… అంతేతప్ప ఇలాంటి ‘‘పబ్లిక్ పర్‌ఫామెన్స్’’ దేనికి..? మ్యూజిక్ షో స్థాయిని దించేయడం..!
ఒక కమర్షియల్ మ్యూజిక్ షో లేదా కన్సర్ట్ ( కచేరీ) నిర్వహిస్తే పర్లేదు… (ఈటీవీ బోలెడు సాంగ్స్ షోలను తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా విదేశాల్లోనూ నిర్వహించింది…) కానీ ఓ కాంపిటీషన్ షోకు ఈ బట్టబయలు అవసరం లేదు… బాగా అనిపించలేదు… నిజానికి థమన్ సరదాగా ఉంటాడు ఈ షోలో… కానీ నెల్లూరు లాంచింగ్ ప్రోగ్రామ్‌లో హేమచంద్ర, గీతామాధురి, థమన్ నడుమ శృతి కలవలేదు ఏమాత్రం… ఇప్పుడే ఓ అంచనాకు రాలేం గానీ, గీతామాధురికన్నా ఆ జడ్జి కుర్చీలో నిత్యామేననే బాగుంది…
ఈ ఫోటో ఏమిటంటే..? టాప్ 12 ఆడిషన్స్ కోసం గాయకులు పాడుతున్నప్పుడు ఓ ఔత్సాహిక గాయని వచ్చింది… ఆమె ఓ పిల్లకు తల్లి… పాడటం అయిపోగానే అప్పటిదాకా తండ్రి చంకలో ఉన్న పిల్ల మళ్లీ తల్లి చంకలో చేరి, తల్లి మొహాన్ని మురిపెంగా చూస్తూ, ముద్దుపెట్టుకుంది… అది బాగనిపించింది..!!
Share this Article