మన సైట్లకు, యూట్యూబర్లకు, సోషల్ మీడియాకు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ కావాలి… డిబేట్ జరుగుతూ ఉండాలి… సమయానికి ఏ ఇష్యూ లేకపోతే ఏదైనా అర్జెంటుగా వండేయాలి… ఏదో ఒకటి సెర్చి మరీ పుట్టించాలి… వాసన నెట్ నిండా గుప్పుమనాలి… అల వైకుంఠపురంలో అనే సినిమాలో అల్లు అర్జునుడు, పూజా హెగ్డే డాన్సిన ఓ పాట ఉంది కదా… బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా… అందులో బన్నీ వేసిన స్టెప్స్ నిజంగానే అదిరిపోయాయ్… చాలామంది దేశవిదేశీ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయారు… అందులో స్టెప్పులు కాపీ, గతంలో తమిళంలో వచ్చిన ఓ పాటలోని స్టెప్పులనే కాపీ చేయించారు బన్నీతో అని కొత్త డిస్కషన్ స్టార్టయింది… కానీ..?
ఒకసారి చూద్దాం… ఎందుకంటే..? ఆ పాట యూట్యూబ్‌లో ఏకంగా 50 కోట్ల పైచిలుకు వ్యూస్ కొల్లగొట్టింది… అది మామూలు ఫీట్ కాదు… ఫీల్డ్‌లో ప్రతి హీరో కలకనాల్సిన ఫీట్… సాయిపల్లవి రౌడీ బేబీ పాట తరువాత సూపర్ బంపర్ హిట్ ఈ పాట… (రాములో రాముల పాట కూడా దాదాపు ఆ రేంజ్ హిట్…) పాట హిట్ కావడానికి కారణం ఆ స్టెప్పులే… అలాంటి స్టెప్పులు కాపీ అనే చర్చ జరగడం సహజంగానే అందరినీ ఆకర్షిస్తుంది కదా…
Ads
నిజానికి తెలుగు హీరోల్లో అలవోకగా, స్టయిల్‌గా స్టెప్పులేయగల హీరోలు ఇద్దరో ముగ్గురో… (చిరంజీవి తరువాత తరంలో…) ఆ ఇద్దరు ముగ్గురిలో బన్నీ ఒకడు… తను ఏదో కష్టపడి, చెమటలు కక్కేస్తూ, ఆయాసపడిపోతూ డాన్సులు చేయడు… ఎంజాయ్ చేస్తూ, సరదాగా… చూసేవాళ్లకు కూడా ఆ స్టయిల్ నచ్చుతుంది… చిన్న చిన్న స్టెప్పులు… జస్ట్, అలా సాంగ్ వినిపిస్తే చాలు, డాన్స్ మాస్టర్ లేకుండానే తను స్టెప్పులేయగలడు…
ఈ సినిమాలో కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్… ఈ బుట్టబొమ్మ పాటకు జానీయే స్టెప్పులు ప్లాన్ చేసింది… ఒక్కటి కూడా యాక్రోబాటిక్స్, సర్కస్ ఫీట్లు ఉండవు… ఈ పాట స్టెప్పులకు ఒరిజినల్ అని చెప్పబడుతున్న ఆ తమిళపాట యూట్యూబ్ లింక్ ఓసారి చూడండి… ఉక్కడత్తు పాపడమే సాంగ్…. ఏకాలం నాటితో సినిమా, ఈ పాటను ఇప్పుడు మళ్లీ అప్లోడ్ చేస్తున్నారు…
పరమ నాటు, ఓల్డ్ టైప్ స్టెప్పులు ఇవి… ఇలాంటివి దాదాపు ప్రతి సినిమాలోనూ కనిపిస్తయ్… పెద్ద విశేషం ఏమీ లేదు… నిన్నగాకమొన్న వచ్చిన కొత్త డాన్స్ డైరెక్టర్లు కూడా వీటిని కంపోజ్ చేయగలరు… అంతెందుకు, హీరోయే సొంతంగా చేసుకోవయ్యా అని చెప్పినా చేసుకోగలడు… అసలు ఈ పాట స్టెప్పులతో బుట్ట బొమ్మ బన్నీ స్టెప్పులతో పోల్చడమే కరెక్ట్ కాదు… ఎందుకంటే, బన్నీ అంటే బన్నీయే… ఒకసారి బుట్ట బొమ్మ సాంగ్ చూడండి…
బన్నీ చాలా రకాల స్టెప్పులుంటయ్ ఇందులో… తన కూతురు నవ్వుతూ చెప్పిన ‘దోసెల స్టెప్పు’ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉంటయ్… కాకపోతే ఆ ఒక్క స్టెప్పు బాగా పాపులరైంది… ఎస్, హీరోయిన్ కాళ్లు, తొడల దగ్గర తచ్చాడిన సిరివెన్నెలను ఓ మాట గట్టిగా అన్నా తప్పులేదు… పరులకు ఏమీ తెలియకుండా సీన్లు, కథలు కాపీలు కొట్టగల త్రివిక్రముడిని ఓ మాట పరుషంగా అన్నా తప్పులేదు… అన్నింటినీ మించి కాపీలే ప్రతిభగా చెలరేగిపోయే థమన్‌ను ఇంకా పరుషంగా రెండు మాటలు అన్నా పర్లేదు… అర్హుడే… కానీ బుట్టబొమ్మ స్టెప్పులపై బన్నీని గానీ, డాన్స్ మాస్టర్‌ను గానీ కాపీ అని వెక్కిరించడానికి ఏమీలేదు… కాపీ ఏమాత్రం కాదు… వాళ్లను నిజానికి అభినందించాలి…!!
Share this Article