ఎక్కడో ఏదో తేడా కొడుతోంది… ఢిల్లీని ముట్టడించిన రైతుల్లో ఏదో డౌట్… అందుకే సుప్రీం చెప్పిన పరిష్కారాన్ని ఒప్పుకోం, ఆ వ్యవసాయ కొత్త చట్టాల్ని రద్దు చేయాల్సిందే అని భీష్మించారు… నిజంగానే చాలామంది డౌట్లు… ఎందుకంటే..? ఆ చట్టాల్ని సుప్రీంకోర్టు రద్దు చేయలేదు… అమలును వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది… మన దేశానికి సంబంధించి పార్లమెంటే సుప్రీం… అది చేసిన చట్టాల్ని (మరీ అనూహ్య, అసాధారణ పరిస్థితుల్లో, అంశాల తీవ్రతను బట్టి తప్ప… మరీ రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ఉంటే తప్ప…) సుప్రీం రద్దు చేయలేదు… అందుకే మేం రద్దు చేయలేం అని తనే చెప్పింది… హోల్డాన్ అని చెప్పింది, అంతే…
ఓ కమిటీ వేసింది… అది మధ్యవర్తిత్వానికి కాదు… ఫీల్డ్ రిపోర్ట్ సమర్పించటానికి..! అలాగే రైతుల ఆందోళనల్లో నిషిద్ధ సంస్థలేమైనా ఉన్నాయో ఓ రిపోర్ట దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది… మహిళలూ, ముసలోళ్లను ఇళ్లకు వెళ్లాలని చెప్పింది… సుప్రీం వేసిన కమిటీలో సభ్యులు కూడా గతంలో ఈ చట్టాల్ని సమర్థించినవారే అంటున్నారు… వెరసి సుప్రీం నిర్ణయాలు రైతులు గెలుపు అనుకోవడానికి వీల్లేదు… అలాంటి సూచనలేమీ లేవు… నిజానికి సుప్రీంకోర్టు గనుక తన అధికార పరిధి దాటి వ్యవహరిస్తే వెంటనే కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించేది,.. ఎందుకంటే..? పార్లమెంటు సుప్రిమసీని కాపాడే ప్రథమ బాధ్యత కూడా ప్రభుత్వానిదే కదా… కేంద్రం వ్యతిరేకించడం లేదు కాబట్టి రైతుల్లో మరిన్ని డౌట్లు…
Ads
నిజానికి ఇది కాదు… ఇంకా విస్తృత చర్చ కూడా సాగుతోంది… అది వ్యవసాయ చట్టాలపై, సుప్రీం నిర్ణయాలపై, కేంద్రం చర్యలపై కాదు…! పంజాబ్, హర్యానాల్లోని అగ్రి ట్రేడింగ్ సిండికేట్లకు ప్రభుత్వ కొత్త చట్టాలు నచ్చకపోతే… వేలాదిగా ట్రాక్టర్లు తీసుకుని వచ్చి, ఢిల్లీని ముట్టడిస్తే, ఇక కేంద్రం తన నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలా..? ఢిల్లీకి ఇబ్బంది కలిగితే చాలు, ప్రభుత్వం దిగిరావల్సిందేనా..? పంజాబ్, హర్యానా కాబట్టి ఢిల్లీని ముట్టడించడం ఈజీ… మరి రేప్పొద్దున ఏ కేరళ ప్రజలకో, ఏ ఏపీ ప్రజలకో బాగా ఇబ్బంది పెట్టే నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందీ అనుకుందాం… వాళ్లేం చేయాలి మరి..? ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు శరాఘాతం వంటి నిర్ణయాల్ని గనుక తీసుకుంటే, వాళ్లేం చేయాలి..? ఎటుపోవాలి..?
షహీన్ బాగ్… పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రోజుల తరబడీ రాస్తాను కట్టడి చేశారు… కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, ఇష్యూ ఏదైనా సరే బీజేపీ ఎడ్డెం అంటే తెడ్డెం అనాల్సిందే కాబట్టి కాంగ్రెస్, ఆప్, లెఫ్ట్ సపోర్ట్ చేశాయి… సో, మెల్లిగా ఓ ట్రెండ్ వస్తోంది… ఢిల్లీని ఇబ్బంది పెట్టాలి, దేశమంతా చర్చ జరుగుతుంది… అవసరమైతే సుప్రీం, కేంద్రం కదులుతాయి… షహీన్ బాగ్ ఆందోళనలకు దేశవ్యతిరేక సెక్షన్లు డబ్బులు సమకూర్చినట్టు ఎన్ఐఏ ఆరోపిస్తోంది… ఇప్పుడు ఢిల్లీని ముట్టడించిన రైతుల ఆందోళనల్లోనూ ఖలిస్థాన్ అనుకూలవాదుల వ్యూహాలు ప్రతిఫలిస్తున్నాయని రైట్ వింగ్ ఆరోపణ… ప్రజాస్వామికం అయినా సరే, తన కోటను ముట్టడించడాన్ని, తనపై తిరగబడటాన్ని రాజ్యం సహించదు… కుర్చీలో ఏ పార్టీ ఉన్నా సరే…! అందుకని రాబోయే రోజుల్లో ఢిల్లీ కోట మరీ ఇంత పెళుసుగా ఉండకుండా… కేంద్రం ఏవో కఠిన చర్యల్ని ప్రకటిస్తుందేమో…! శాంతిభద్రతలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాసరే, ఢిల్లీ రాష్ట్ర హోదాకు గండం పొంచి ఉందేమో…!!
Share this Article