పదే పదే మనం మన చరిత్ర పుస్తకాల్లో కొందరి స్వాతంత్ర్య సమరయోధుల కథలే చదువుతున్నాం… కానీ తమ ప్రాణాలకు తెగించి, విదేశాల్లో ప్రవాసంలో ఉంటూ దేశమాత సేవలో పునీతులైన ఎందరి కథల్నో మన చరిత్ర పుస్తకాలు మనకు చెప్పడం లేదు… అంతేకాదు, మనవాళ్లను పెళ్లి చేసుకుని, తమ జీవితాల్ని భరతమాత పాదాల వద్ద అర్పించిన విదేశీయుల కథలూ ఉన్నయ్… కానీ ఇన్నేళ్లూ వాటిని మన పిల్లలకు చెప్పినవాడెవ్వడు..?
టోసికో… ఈమె కథ ఖచ్చితంగా చదవదగ్గది… భర్త పేరు రసబిహారీ బోస్… వీలైనంత క్లుప్తంగా, స్ట్రెయిటుగా చెప్పుకుందాం… ఈ కథలో కొన్ని ఇంట్రస్టింగు అంశాలూ ఉన్నయ్… రసబిహారీ బోస్ బెంగాలీ… 1912… బోస్ తిరుగుబాటుదారు… డిసెంబరులో ఢిల్లీలో వైస్రాయ్ ఊరేగింపు మీద బాంబు దాడి జరిగింది… కానీ ఫెయిలైంది… ఆ ప్లానులో ఈ బోస్ ప్రధాన సూత్రధారి…
ఈ దాడి వెనుక కుట్రదారుల కోసం పెద్ద ఎత్తున వేట మొదలైంది… వాళ్లను అరెస్టు చేసినా, పట్టిచ్చినా లక్ష రూపాయల బహుమతి ప్రకటించారు… అప్పట్లో లక్ష రూపాయలు అంటే చాలా చాలా పెద్ద మొత్తం… అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుందో తెలిసింది కదా… వాళ్లలో ఎవరు పట్టుబడినా మరణశిక్ష తప్పదు… బోస్ తన కొలీగ్స్ సూచనల మేరకు వేషం మార్చుకుని, దొంగ దారిలో జపాన్ వెళ్లిపోయాడు 1915లో…
Ads
ఆరోజుల్లో జపాన్, బ్రిటన్ నడుమ ఓ ఒప్పందం ఉంది… దాని ప్రకారం ఇండియాకు సంబంధించిన నేరస్థులు ఎవరు జపాన్‌లో షెల్టర్ తీసుకున్నా సరే, వాళ్లను బ్రిటన్ ప్రభుత్వానికి అప్పగించాలి… ఇండియాలో ప్రాసిక్యూట్ చేయాలి… ఒకవేళ తను జపాన్ దేశస్థుడు అయితే ఎక్కడికీ తీసుకుపోయేది లేదు… అయితే ఇంట్రస్టింగుగా మరో చట్టం ఉంది… దాని ప్రకారం భార్యాభర్తల్లో ఒకరు జపాన్ దేశీయులు అయితే జంటలో మరొకరు జపాన్ పౌరసత్వం పొందుతారు… సో, బోస్ కొలీగ్స్ ఎవరైనా జపాన్ మహిళను చూసి, పెళ్లిచేసుకో అని చెప్పసాగారు… అది తనకు పెద్ద రక్షణ…
అజ్ఞాతంగా మీ పోరాటానికి సహకారం అందిస్తాననీ చెప్పింది… అప్పుడామె వయస్సు 20 ఏళ్లు మాత్రమే… ఆమె ఇంకా చదువుకుంటోంది… ఆమె నిర్ణయం ఆమె తల్లిదండ్రులకు షాకింగ్… నిజానికి చైనా, ఇండొనేషియా, ఇండియాకు చెందిన వాళ్లను జపనీయులు అస్సలు ఇష్టపడేవారు కాదు… పైగా వాళ్లలో జాతీయభావనలు, సంప్రదాయవాదం ఎక్కువ… తమ రక్తం ప్యూరిటీ మీద ప్రేమ ఎక్కువ… అందుకే ప్రాంతేతరులు, దేశాంతర వివాహాలను అస్సలు సమ్మతించేవాళ్లు కాదు… పైగా బోస్ ఓ ఇండియన్, ఓ బ్లాకీ… లిల్లీ పూవు వంటి టోసికోను ఇచ్చి పెళ్లిచేయాలంటే వాళ్లకూ మనసొప్పడం లేదు…
బోస్ కూడా ఈ పెళ్లికి సమ్మతించలేదు మొదట్లో… కానీ టోసికో స్వయంగా పట్టుపట్టడంతో పెళ్లి చేశారు ఇద్దరికీ… అది 1918వ సంవత్సరం… ఈ పెళ్లితో ఆటోమేటిక్‌గా రసబిహారీకి జపాన్ పౌరసత్వం వచ్చేసింది… లీగల్‌గా తనను ఇండియాకు తీసుకెళ్లలేరు… కానీ బ్రిటిష్ డిటెక్టివ్స్ నిఘా ఎక్కువైంది…
బ్రిటిష్ డిటెక్టివ్స్ కళ్లు గప్పడానికి ఏడెనిమిదేళ్లలో 15 ఇళ్లు మారాడు… 1923… ఆమె వయస్సు 28 ఏళ్లు… అప్పటికే ఒక కొడుకు, ఒక బిడ్డ… కానీ ఈ ఒత్తిళ్లు, పదే పదే ఇళ్లు మారడంతో ఆమెకు టీబీ సోకింది… రెండుసార్లు భూకంపాల వల్ల తాము ఉండే ఇళ్లు కూలిపోయాయి… ఒక దశలో కనీసం 1000 రూపాయలైనా సర్దుబాటు చేయాలంటూ కొలీగ్స్‌ను అభ్యర్థించాడు బోస్… పత్రికా ప్రకటన ఇచ్చారు… ఏవో మారుపేర్లతో… 624 రూపాయలు వచ్చాయి… అప్పట్లో టీబీకి చికిత్స లేదు… 1925లో టోసికో లోకం విడిచి వెళ్లిపోయింది… భారత జాతి ఏవిధంగా కృతజ్ఞతలు చెప్పుకోగలదు ఆమెకు… వేనవేల సంస్మరణలు తప్ప…!!
Share this Article