అనుష్క- ప్రభాస్… ఈ జంట పేరు కొన్నేళ్లుగా వార్తల్లో ఉంది… నిజంగానే ఇద్దరి జంట చూడటానికి బాగుంటుంది… 2009లో బిల్లా సినిమా షూటింగ్ దగ్గర మొదలైన వీళ్లిద్దరి ప్రేమాయణం మొన్నమొన్నటిదాకా బాగానే ఉందట… చాలారోజులపాటు డేటింగులో కూడా ఉన్నారట… మన సైట్లు, చానెళ్లు బోలెడుసార్లు వాళ్లకు పెళ్లి చేశాయి… టీవీ తెర మీద సుధీర్, రష్మి… పెద్ద తెరకు సంబంధించి ప్రభాస్, అనుష్క… మంచి రొమాంటిక్ జంటలు…
కానీ సియాసత్ సైట్ చెబుతున్నదేమిటంటే… ‘‘వాళ్లద్దరికీ బ్రేకప్ అయిపోయినట్టే…’’ అక్కడితో ఆగితే సరి… కానీ అనుష్కకు ఓ సీనియర్ హీరోతో పెరిగిన సంబంధమే ప్రభాస్‌తో ప్రేమబంధాన్ని చెడగొట్టిందట… ఈ రూమర్స్‌తోనే ప్రభాస్ అనుష్కను దూరం పెట్టేశాడట… ఇంట్రస్టింగుగా అనిపించినా సరే, ప్రభాస్‌తో బాగున్నప్పుడు ఆమెకు ఎవరో ఓ సీనియర్ హీరోతో బంధం పెట్టుకోవాల్సిన అగత్యం ఏమిటి..? సో, రూమర్ కావచ్చు…
Ads
ఈ రూమర్లు ఎక్కడిదాకా వెళ్లాయంటే… ప్రభాస్ తల్లి కూడా వాటితో ప్రభావితమైందట… అప్పటిదాకా ప్రభాస్- అనుష్క బంధం పట్ల సానుకూలంగా ఉన్న ఆమె, ఈ రూమర్లతో అనుష్క మీద ఒక్కసారిగా వ్యతిరేకత పెంచుకుని, ప్రభాస్- అనుష్కల పెళ్లి ప్రతిపాదనలకు నో చెప్పేసిందట… ఆమె నాకు కోడలిగా అక్కర్లేదు అనేసిందట…
ఈ రూమర్ల ప్రచారం ఎలా ఉన్నా సరే… ఇండస్ట్రీలో వాళ్ల మీద ఉన్న పాజిటివ్ టాక్ ఏమిటంటే… ప్రేమబంధం ఉందో లేదో తెలియదు కానీ ఒకరినొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకుంటారు, మంచి స్నేహితుల్లాగా వ్యవహరిస్తారు… అవసరమున్న సందర్భాల్లో ప్రభాస్ ఎప్పుడూ ఆమెకు మద్దతుగా నిలుస్తాడు అని…! నిజానికి ప్రభాస్- అనుష్క బంధం తెగిపోయిందనే ప్రచారం ఎప్పుడు జోరందుకున్నదో తెలుసా..? ప్రభాస్‌కు కృతిసనన్‌తో ఎంగేజ్మెంట్ జరగబోతున్నదే ప్రచారాన్ని ఆయన పీఆర్ టీం ఖండించిన తరువాత… ప్రభాస్, కృతి ఆదిపురుష్ సినిమాలో కలిసి నటించారు… గుర్తుందా..? బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో కూడా వాళ్లిద్దరి బంధం మీదే స్ట్రెస్ చేసి మరీ ప్రశ్నలడిగాడు…
ఈ ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ యవ్వారం కొన్నాళ్లకుముందు ఫిలిమ్ సర్కిళ్లలోనే నానేది… ఎప్పుడైతే వివాదస్పద విమర్శకుడు, సమీక్షకుడు ఉమైర్ సంధు ‘‘మాల్దీవుల్లో వాళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్’’ అని ట్వీటాడో అప్పట్నుంచి ఈ ప్రచారం ఎక్కువైపోయింది… అదేమీ లేదురా బాబూ అని ఇటు ప్రభాస్, అటు కృతి ఖండిస్తున్నా ఈ ప్రచారం మాత్రం ఆగడం లేదు… నిజానికి కృతి ఖండనల్లో సీరియస్‌నెస్ లేదు… వరుణ్ ధావన్ కూడా ప్రభాస్ పేరు చెప్పుకుండానే కృతి ప్రేమయవ్వారం గురించి మాట్లాడటంతో ఈ ప్రచారం మరింత పెరిగింది… (భేడియాలో వరుణ్ ధావన్ కృతితో కలిసి పనిచేశాడు…)
వరుణ్ ధావన్ మాటల తరువాత కృతి ఇన్‌స్టాలో ఓ వివరణ లాంటిది ఇచ్చింది… ‘‘ఎహె, అది ప్రేమ కాదు, పీఆర్ కాదు… మా భేడియా ఓ రియాలిటీ షోలో కాస్త వైల్డ్‌గా వెళ్లిపోయాడు… అది ఫన్… అది కాస్తా ఈ ప్రచారాలకు తావిస్తోంది… ఇవన్నీ రూమర్లే… నిజం లేదు, ఆధారరహితం’’ అంటూ ఓ దండం ఈమోజీ పెట్టింది… సరే, ప్రభాస్- కృతి నడుమ ఏమీ లేదనే అనుకుందాం… ప్రభాస్- అనుష్కల బంధం తెగిపోయినట్టేనా..?!
Share this Article