Sridhar Bollepalli………. 64 కళలు
1. సర్ఫేస్ మీద నూనె మరకలు పడకుండా కొబ్బరినూనె డబ్బాని చిన్న ప్లేటులో పెట్టి వుంచడం
2. డ్రస్సింగ్ టేబుల్ అద్దం నిగనిగలాడడానికి, దానిపై నీళ్లు చిలకరించి కాగితంతో రుద్దడం
Ads
3. ఆరేసిన బట్టలు కింద పడకుండా క్లిప్పులు పెట్టడం
4. రంగు వెలిసిపోయే బట్టలు నీడలో ఆరేసుకోవడం
5. సిలిండర్ అయిపోకముందే వేరేది బుక్ చేసి రెడీగా పెట్టుకోండం
6. బైక్, కార్ ఇన్సూరెన్సు ప్రీమియమ్స్ సకాలంలో చెల్లించడం
7. క్రెడిట్ కార్డ్ వాడకం లిమిట్‌లో యాభైశాతం మించకుండా చూసుకోవడం
8. డ్యూ డేట్ కన్నా వారం ముందుగానే క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడం
9. ఇంట్లో ఎప్పుడూ కనీసం రెండు మూడు వేలు కాష్ అయినా వుంచుకోవడం
10. ఇంట్లో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ వుండేలా చూడడం
11. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకీ అతిగా మందులు వాడకపోవడం
12. యాంటీ బయాటిక్స్ వాడాల్సి వచ్చినప్పుడు.. వాటిని నిర్ణీత వేళల్లో కోర్స్ అయ్యేవరకూ వాడడం
13. ప్రయాణాల కోసం బ్యాగ్ సర్దేటప్పుడు.. అందులోని దుస్తులని ఏ క్రమంలో వాడతామో అదే క్రమంలో సర్దుకోవడం.. వీలైతే ఇన్నర్స్ తో సహా సెట్స్ గా జతచేసి పెట్టుకోవడం
14. ఎండలో బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం
15. అవసరం లేనప్పుడు కంప్యూటర్ షట్ డౌన్ చేయడం
16. ముఖ్యమైన ఫైల్స్ ని కంప్యూటర్ డెస్క్ టాప్ మీద కాకుండా లోపల డ్రైవ్స్ లో భద్రపరచడం
17. సొంత వెహికల్ మీద బయటకి వెళుతుంటే బండి కాగితాలు, ఆధార్ కార్డు దగ్గర వుంచుకోవడం
18. ముఖ్యమైన తాళం చెవులకి కనీసం రెండో డూప్లికేట్ కీ చేయించి పెట్టుకోవడం
19. మొబైల్ ఫోన్ కి తప్పనిసరిగా టెంపర్డ్ గ్లాస్, బ్యాక్ కవర్ వేయించడం
20. వాడిన తర్వాత చీపురు హ్యాండిల్ నేలకి ఆనేటట్లు నిలబెట్టడం
21. వాషింగ్ మెషీన్ కి అప్పుడప్పుడూ టబ్ క్లీన్ పెట్టుకోవడం
22. బట్టల షెల్ఫుల్లో నెలల తరబడి వాడని వాటిని గుర్తించి, ఎవరికైనా ఇచ్చేయడం
23. కూరగాయలు తేవడానికి తప్పనిసరిగా బుట్ట తీసుకెళ్లడం
24. అన్నం తినేముందు హ్యాండ్ వాష్ తో చేతులు కడుక్కోవడం
25. పడుకునేముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవడం
26. ప్యాంట్స్ పొడవుగా వుండి, దాని కింద అంచుని మడతపెట్టి వాడినప్పుడు, మడతలు తీసి అందులో యిరుక్కుపోయిన మట్టి, ఇసుక దులిపిన తర్వాతే వాషింగ్ మిషన్లో వేయడం
27. కిటికీలకీ, మెయిన్ తలుపులకీ దోమలు రాకుండా మెష్ పెట్టించడం
28. తలుపులు, కిటికీలు గాలికి కొట్టుకోకుండా బీడం పెట్టివుంచడం
29. డెస్క్ టాప్ కంప్యూటర్ కి తప్పనిసరిగా యూపీఎస్ వుండేలా చూసుకోవడం
30. ఇన్వర్టర్ కి డ్రై బ్యాటరీ వాడని పక్షంలో.. అందులో డిస్టిల్డ్ వాటర్ లెవెల్ తగ్గకుండా చూసుకోవడం
31. కనీసం ప్రతి మూడునెలలకీ వొకసారి టూత్ బ్రష్‌నీ, ఆరునెలలకి మించకుండా ఇన్నర్స్ నీ మార్చేయడం
32. టవల్స్, దువ్వెనలు ఎవరివి వారికి సెపరేట్ గా వుండేలా చూసుకోవడం
33. ఖర్చు, ఆదాయం వివరాలు తప్పనిసరిగా వొక బుక్ లో రాసుకోవడం
34. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మరీ ఎక్కువ సౌండు లేకుండా చూసుకోవడం
35. తేలిగ్గా మాసిపోయేవీ, తడికి చినిగిపోయేవీ కాకుండా.. షెల్ఫుల్లో కాగితాలు సూపర్ కోటింగ్ వుండేవి వాడడం
36. బ్యాగులకి జిప్పులు బిగుతుగా వున్నప్పుడు వాటిపై కాస్త నూనె కానీ, వాక్స్ గానీ అప్లై చేయడం
37. ఒక జత సాక్సు ని వొకరోజుకి మించి వాడకపోవడం
38. కనీసం రోజుకి అరగంట వాకింగ్ చేయడం.. రాయిలా వుండే సిమెంట్ రోడ్ల మీద కాకుండా, వాకింగ్ చేయడానికి కాస్త మెత్తగా వుండే నేలని ఎంచుకోవడం
39. వయసుకీ, ఎత్తుకీ తగిన బరువు కన్నా రెండు, మూడు కేజీలు మించకుండా చూసుకోవడం
40. ఎక్కడైనా వొక్కచోట చెదలు కనిపించినా.. ఇంటి మొత్తానికీ మందు కొట్టించడం
41. అన్ లైన్ లో షాపింగ్ చేసేటప్పుడు.. నాలుగైదు సైట్స్ లో వెతికి, ఎందులో తక్కువకి వస్తుందో తెలుసుకోవడం
42. ఖరీదైన వస్తువులు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి, అవి డెలివరీ అయ్యాక, వాటిని అన్ ప్యాక్ చేసేటప్పుడు.. వీడియో తీయడం.. డ్యామేజీ వుంటే వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేయడం
43. టీలో వేయడానికి అల్లం దంచుతున్నా, పాతకాలపు రోలు, రోకలిబండ వాడుతుంటే.. అవి ధనాధనా శబ్దం చేస్తూ కింద ఫ్లోర్ వాళ్లకి యిబ్బంది కలిగిస్తాయేమో అనే స్పృహలో వుండడం
44. రోజుకి కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవడం
45. ట్యూబ్ లైట్లు, బల్బుల మీద పడిన దుమ్ముని శుభ్రం చేయడం
46. దూర ప్రయాణాలకి వెళ్లేటప్పుడు కారు టైర్లలో సరిపడా గాలి వుందో లేదో చెక్ చేయించి, స్పేర్ టైర్ కండిషన్ లో వుండేలా చూసుకోవడం
47. మెకానిక్ అవసరం లేకుండా టైర్ మార్చడం ఎలాగో నేర్చుకోవడం
48. వేక్యూమ్ క్లీనర్ తో సోఫాలు, పరుపులు కనీసం నెలకి వొకసారైనా డస్టింగ్ చేయడం
49. బొంతలు, పరుపులు అప్పుడప్పుడూ ఎండలో వేయడం
50. పిల్లలకి ఏ సబ్జెక్ట్ యిష్టం, ఏది భయం అన్నది తెలుసుకోవడం.. వీలైతే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన బేసిక్స్ తెలుసుకోని, వాళ్లతో డిస్కస్ చేయడం
51. పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చేయడం
52. రెండు మూడు వేళ్లతో అన్ని బటన్సూ నొక్కడం కాకుండా.. కీ బోర్డ్ టైపింగ్ ప్రాపర్ గా ప్రాక్టీస్ చేయడం
53. వేరేవాళ్లు చూస్తుండగా ముక్కులో వేలు పెట్టుకోవడం, చెవిలో పుల్ల పెట్టుకోవడం లాంటి పనులు చేయకుండా నిగ్రహించుకోవడం
54. మందు, సిగరెట్ లాంటి అలవాట్లు వుంటే అవి బలహీతనగా, వ్యసనంగా, ఆర్థిక భారంగా పరిణమించని మోతాదులో వుండేలా జాగ్రత్తపడడం
55. ఫోన్ మెమరీలో వున్న ముఖ్యమైన ఫోటోలు, డాక్యుమెంట్లు ఎప్పటికప్పుడు మన మెయిన్ అకౌంటు మెయిల్ తాలూకూ డ్రైవ్ లో సేవ్ చేసుకోవడం
56. సాఫ్ట్ కాపీలు లేని ఫోటోలని స్కాన్ చేయించి, డిజిటల్ రూపంలో భద్రం చేయడం
57. ఇంటిల్లపాదీ కలిసి ఆనందించే అభిరుచులు కనీసం రెండు మూడయినా వుండేలా చూసుకోవడం
58. పిల్లల ఎదురుగా సాధ్యమైనంత వరకూ తల్లిదండ్రులు గొడవ పడకుండా వుండడం.. ఫలానా పని యిలా చేయాలీ అని పిల్లలకి చెప్పేటప్పుడు పేరెంట్స్ యిద్దరూ వొకే మాట మీద వుండడం
59. సరిగా తోలడం రాకపోయినా, లైసెన్స్ లేకపోయినా.. పిల్లలకి వెహికల్ యిచ్చి వదిలేయకుండా వుండడం
60. రిచ్ గా కనిపించడం కన్నా.. నీట్ గా, శుభ్రంగా కనిపించడం ముఖ్యమని గ్రహించడం
61. మనకి బాగా కావాల్సిన వ్యక్తుల బర్త్ డే లు, యానివర్సిరీలు రిమైండర్స్ లో పెట్టుకొని, వాళ్లకి విషెస్ చెప్పడం
62. ఒకళ్ల సహాయం మనం పొందామూ అంటే.. వాళ్లు కూడా మన నుండీ ఏదో వొకటి ఆశిస్తారు అని గ్రహించి, మనం చేసుకోగలిగిన పనులు మనమే చేసుకోవడం
63. నెగటివ్ ఫీలింగ్స్ పెంచే మనుషులకీ, రూమర్స్ గాసిప్స్ తో పొద్దుపుచ్చేవాళ్లకీ దూరంగా వుండడం
64. శ్రీధర్ బొల్లేపల్లి రాసిన కథలు రెగ్యులర్ గా చదవడం… (శ్రీధర్ అనగా ఈ కళల రచయిత)
Share this Article