ఆర్ఆర్ఆర్ ఏదో పవిత్రం అన్నట్టు…. దాన్నేమైనా అంటే ఎగబడిపోతున్నారు… మరీ చిత్రమైన భాషలో…! అయిదుగురు దర్శకులు, ఓ యాంకర్ కలిసి కేజీఎఫ్ ప్రధాన పాత్ర రాఖీ కేరక్టరైజేషన్ మీద ఇకఇకలు, పకపకలతో వెక్కిరింపులకు దిగారు… ( ఆ సినిమా దర్శకుడు తెలుగువాడు, యాదవుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కొడుకు ) దాని మీద రాఘవేంద్రరావు, తమ్మారెడ్డి భరధ్వాజ, నాగబాబు తదితరులు కిక్కుమనలేదు… కానీ ఆర్ఆర్ఆర్ అనగానే ఎగబడుతున్నారు…
అదేమంటే, అది మన సినిమా కాదు, అది కన్నడ సినిమా అని కొందరి సమర్థన… కానీ ఆ సినిమా రెండు భాగాలు తెలుగులో మన జేబుల్లో నుంచి కొన్ని వందల కోట్లు వసూలు చేసుకుంది… అది డబ్బు కాదా..? రాఖీ అనేది జస్ట్, ఒక పాత్ర మాత్రమేనని ఇదే తమ్మారెడ్డి ఎందుకు అనలేకపోయాడు..? సరే, ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు చేస్తున్నారు, అదే డబ్బుతో 8 సినిమాలు మొఖాన కొడతాం అన్నాడు… ఇక్కడ మొహాన కొడతాం అనేది అనాగరిక భాష…
సరే, ఏదో అన్నాడు… వెంటనే రాఘవేంద్రరావుకు ఎందుకు పొడుచుకొచ్చింది..? ఆర్ఆర్ఆర్ మీద అంత ప్రేమ దేనికి..? ఇక నాగబాబు సంగతి సరేసరి… నాగబాబు అంటే నాగబాబు… ఆ భాషకు, ఆ పరిణతికి, ఆ హుందాతనానికి తిరుగులేదు… పవన్ కల్యాణ్‌కు ఎవరెస్టంత బలం… ఫాఫం…
Ads
To Whomever It May Concern :
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం”
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)
అంటూ ఏదో ట్వీటాడు… ఇక్కడ వైసీపీని ఎందుకు లాగుతున్నట్టు..? భాష ఎవరిదైనా ఇప్పుడు వాడుతున్నది ఎవరు..? అంటే తమ్మారెడ్డిని రారా పోరా అని మర్యాదిస్తున్నట్టా..? నీయమ్మ మొగుడు అనే భాషను ఎండార్స్ చేసుకుంటున్నాడా నాగబాబు… ఇంకా ఆ జబర్దస్త్ నుంచి బయటికి రానున్నట్టున్నాడు మనిషి…
చేతనైతే… అంతటి పవిత్రమైన తులసితీర్థం వంటి ఆర్ఆర్ఆర్ విలువను అలాగే కాపాడుకొండి… కానీ మధ్యలో వైసీపీని లాగడం దేనికి..? దీన్ని పొలిటిసైజ్ చేయడం దేనికి..? తమ్మారెడ్డి ఏదో అంటే వైసీపీ బాధ్యత వహించాలా..? నీయమ్మ మొగుడు అనే భాష అంత ప్రేమించేలా ఉందా తనకు..? వైసీపీ కొందరు లీడర్ల భాష అలాగే ఉంటుంది, నిజమే… అది పాతాళస్థాయి… మరి తమరి సంస్కారం ఎక్కడ పోయినట్టు..? ఐనా ఆ కేరక్టర్ పేరు నాగబాబు… తను అంతే…
ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డుల పైరవీల కోసం… 80 కోట్లు కాకపోవచ్చు… కానీ విపరీతమైన ఖర్చు మాత్రం నిజం… మనం ఇచ్చిన డబ్బులే… చరిత్రను దిగజారి వక్రీకరించిన ఆ సినిమా కోసం మనం ఇచ్చిన వందల కోట్ల నుంచే ఆ ఖర్చు పెడుతున్నారు… నెలలుగా అక్కడే తిష్టవేసి, లాబీయింగుల్లో మునిగిపోయిన మాట నిజం…
పది కేటగిరీల్లో నామినేషన్లను కష్టమ్మీద, ఖర్చుమీద ఎంట్రీ చేయించగలిగితే చివరకు మిగిలింది నాటునాటు పాట… అదొక నెత్తిమాసిన తెలంగాణ పాట… సగం పిచ్చి పిచ్చి పదాలే, వాటిని తెలంగాణ పదాలు అని చంద్రబోసుడు మాత్రమే సమర్థించుకోగలడు… దానికి అవార్డు వచ్చినా రాకపోయినా తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ సమాజానికి వచ్చేదేమీ లేదు, పోయేదీ ఏమీ లేదు… 80 కోట్లు కాకపోతే 180 కోట్లు ఖర్చుపెట్టుకొండి..!!
Share this Article