రామోజీరావు డిపాజిట్ల సేకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో అలాగే ఉంది… ఉండవల్లి నడిపిస్తున్న కేసులో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది… రామోజీరావు మీద ప్రేమ ఎక్కువై కేసీయార్ తను ఇంప్లీడ్ గాకుండా సానుభూతి కనబరుస్తున్నాడు… అప్పట్లో హడావుడిగా ఆ కేసు క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు గానీ ఉండవల్లి ఉడుం పట్టు పట్టడంతో ఆ కేసు సజీవంగా ఉండిపోయింది…
ఇప్పుడు జగన్ ప్రభుత్వం (మార్గదర్శి డిపాజిట్లపై ఉరిమిన ఆ వైఎస్ కొడుకే కదా…) మార్గదర్శి చిటఫండ్స్ మీద పడింది… పలు ఆఫీసుల్లో సోదాలు చేసింది… తనకు రాష్ట్రంలో ప్రత్యర్థులు తెలుగుదేశం కాదనీ, కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మాత్రమేనని అప్పట్లో జగన్ చెప్పాడు కదా… ఇక కార్యాచరణ ప్రారంభమైంది… మొదటి స్టెప్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ విషయంలో పడింది…
మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు చేసింది… మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… A1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు, A2గా చెరుకూరి శైలజ, A3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లు… వీళ్ల మీద సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద, 1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు… సెక్షన్ 120బి, 409, 420, 477(a) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్లు పెట్టారు…
Ads
భారీ ఎత్తున నిధులను ఇతర సంస్థలకు మళ్లించారనేది ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది… కేసు నిలుస్తుందా, లేదా అనేది పక్కన పెడితే… తెలుగుదేశాన్ని మించి తనకు వ్యతిరేకంగా మారిన ఈనాడు మెడ మీద కత్తులు వేలాడదీయడమే ఈ కేసుల పరమార్థం… నిజానికి రామోజీ గ్రూపుల్లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఒక్కటే లాభాల్లో నడుస్తూ, భారీగా టర్నోవర్లను నమోదు చేస్తోంది… ఈనాడు, ఈటీవీ ఆర్థిక మూలాలను డిస్టర్బ్ చేయడంలో ఈ చర్య కూడా ఒకటి… అవునూ, మరి ఆంధ్రజ్యోతి, టీవీ5 మాటేమిటి జగన్ సార్..?! అదేమిటి అలా నవ్వుతున్నారు..?!
Share this Article