గాంధీని చంపింది గాడ్సే… చంపించింది నెహ్రూ… గాంధీ ఎప్పటికైనా పటేల్ వైపు మొగ్గి, తన కుర్చీ పీకేసి, పటేల్‌ను ప్రధాని చేస్తాడేమోనని నెహ్రూ భయం, సందేహం… అందుకే ఆర్ఎస్ఎస్‌లో ఉన్న గాడ్సే పట్టాడు… చంపించాడు… నేరమంతా ఆర్ఎస్ఎస్ పైకి వెళ్లిపోయింది… ఇదీ జరిగిన నిజం……… జుత్తు పీక్కుంటున్నారా..? పిచ్చి లేచినట్టు అనిపిస్తోందా..? కళ్లెదుట ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి గేటు కనిపిస్తోందా..? ఏమో… ఆ కథ నిజం కాదు, కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కొత్త పలుకు గనుక నమ్మితే… గాంధీ-నెహ్రూ-గాడ్సే కథ కూడా నమ్మాలి…
చదివేస్తే ఉన్న మతి పోయింది అన్నట్టుగా… జర్నలిజంలో సీనియారిటీ పెరిగేకొద్దీ రాతలు అదుపు తప్పి, పిచ్చి భ్రమలేవో అక్షరరూపం దాల్చుతాయని అంటుంటారు చాలామంది… లేకపోతే ఇదేం చర్చ..? ఇవేం ఊహాగానాలు..? కేసీయార్ బిడ్డ కవితను అరెస్టు చేస్తే, ఆమెకు సానుభూతి దొరికే ప్రమాదముంది కాబట్టి… ముందుగా అవినాష్‌ను అరెస్టు చేసి, క్రెడిబులిటీ సంపాదించడానికి సీబీఐ దూకుడు పెంచిందట… అసలు వివేకా మర్డర్ కేసుకూ కవిత స్కామ్‌కూ ఏమైనా సంబంధం, పోలిక, పొంతన ఉందా..?
ఏ కేసుకు ఆ కేసే… ఒకవేళ బీజేపీ కాపాడాలి అనుకుంటే ఆదానీని వెనకేసుకొచ్చినట్టు… బీజేపీలో చేరినవాళ్లను వెనకేసుకొచ్చినట్టు… ఎవరినైనా కాపాడుతుంది… దెబ్బ తీయాలనుకుంటే ఎవరి మీదికైనా సీబీఐ, ఐటీ, ఈడీలను ఉసిగొల్పగలదు… కవితకు సానుభూతి రాకుండా ఉండాలంటే అవినాష్ మీద చర్య తప్పనిసరి అని కేంద్ర పెద్దలు భావించారట… ఇదీ రాధాకృష్ణ వాదన… కవితను ఎలాగైనా జైలుపాలు చేయాలని నిర్ణయం తీసుకున్నందున, జగన్‌తో సంబంధాలు దెబ్బతిన్నా పర్లేదని భావించారా బీజేపీ పెద్దలు..? వావ్… తెలుగు టీవీ సీరియళ్ల కథలు ఇంకాస్త ఎక్కువ నాణ్యతతో ఉంటాయి..? లాజిక్‌రాహిత్యంలో కూడా గ్రేడ్లు ఉంటాయేమో,,,!!
Ads
వివేకా మర్డర్ జరిగాక అక్కడి నుంచే భారతికి ఫోన్ కాల్స్ చేశారట… ఎస్, మేడం పనైపోయింది అన్నారట… ఇదంతా రాయడం ఎలాగుందంటే..? జగన్ దంపతులే ప్లాన్ చేసి, వివేకాను మర్డర్ చేయించినట్టు..!! అదీ దేనికి..? రేప్పొద్దున జగన్ జైలుకు వెళ్తే, భారతిని సీఎం చేయాలని జగన్ అనుకున్నాడు… కానీ షర్మిల అడ్డుపడే ప్రమాదం ఉంది, ఆమెకు వివేకా సపోర్ట్ చేసే ప్రమాదం ఉంది… అందుకని ఆమెను కట్ చేసిపారేసి, తెలంగాణ బజార్లలో పడేసి, వివేకాను అడ్డుతొలగించుకున్నాడట… దానికి అవినాష్ సహకరించాడట…
మళ్లీ గాంధీ- గాడ్సే- నెహ్రూ కథ గుర్తొస్తుందా..? నిజంగానే జగన్ అంత డేంజరస్ అయి ఉంటే చెల్లెల్ని ఎందుకు వదిలేసినట్టు..? ఇదంతా రాధాకృష్ణ కల్పనాత్మక సామర్థ్యం… అటు తిప్పీ ఇటు తిప్పీ వివేకాను జగనే హత్య చేయించాడనే భావనను వ్యాప్తి చేయడం..! ఒకవేళ తను చెప్పినట్టు జగన్ తన భార్యను సీఎం చేయడానికి ఈ రక్తచరిత్ర రాయడానికి పూనుకున్నాడనే అనుకుందాం… తనకు 151 ఎమ్మెల్యేలున్నారు… తను గనుక నిజంగానే జైలుకు వెళ్లే పక్షంలో ఎవరు సీఎంగా ఉండాలనేది తన ఇష్టం… అక్కడ షర్మిల అడ్డుపడేదేముంది..? ఆమె ఏమైనా జగన్ ఆస్తులకు, అధికారానికీ వారసురాలా..? ఆమెకు వివేకా సపోర్ట్ చేస్తే దాంతో జగన్‌కు వచ్చే ప్రమాదం ఏముంది..? హేమిటో… అన్నీ ఎర్రగడ్డ కథనాలు…
ఏమాటకామాట… అవినాష్‌ను కాపాడుకోవడానికి జగన్ అండ్ కో చెబుతున్న వాదనలు మాత్రం నవ్వు పుట్టిస్తున్నాయి… నిజంగానే వివేకాను అల్లుడే చంపించాడనే జగన్ క్యాంపు మాటే నిజమైతే… వివేకా బిడ్డ సీబీఐ దర్యాప్తు కోసం ఎందుకింతగా పోరాడుతుంది..? కేసు సజీవంగా ఉంటే, నిజమైన దర్యాప్తు జరిగితే మరి తన భర్తకే ప్రమాదం కాదా..? ఆమె తండ్రి హత్య నిందితులకు శిక్ష పడాలని బలంగా కోరుకుంటున్నది గనుకే పోరాడుతోంది కదా… ఈ చిన్న లాజిక్ జగన్ క్యాంపు మరిచిపోయింది… ఏదో పొంతనలేని కథనాలతో మరింత నవ్వులపాలు కావడమే ఇదంతా…! రాధాకృష్ణ సుదీర్ఘ వ్యాసంలో ఈ వివరణ మాత్రమే కాస్త రీజనబుల్… మిగతాదంతా గాంధీ- నెహ్రూ- గాడ్సే కథే…!! మార్కెట్‌లో చాలా యూట్యూబ్ చానెళ్లు ఏదిపడితే అవి రాసేస్తుంటాయి… మరీ రాధాకృష్ణ ఆ జర్నలిస్టే అయిపోవడమే ఈ మొత్తం ‘CBI కథలో విషాదం..!!
Share this Article