పార్ధసారధి పోట్లూరి ……… సిలికాన్ వాలీ బ్యాంక్ మూత పడ్డది ! SVB Financial Group ! Friday, March 10, 2023… అమెరికాలో పెద్ద బాంకుల జాబితా పరంగా చూస్తే 16 వ పెద్ద బాంక్ సిలికాన్ వాలీ బాంక్ ! SVB కి శాంతా క్లార [Santa Clara], కాలిఫోర్నియా లో హెడ్ ఆఫీస్ ఉంది ! ఇంత హఠాత్తుగా ఇంత పెద్ద బాంక్ ఎలా మూతపడింది ? హఠాత్తుగా అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే కేవలం 4 అంటే 4 గంటలలో సిలికాన్ వాలీ బాంక్ మూతపడ్డది !
*****************
కాలిఫోర్నియాని సిలికాన్ వాలీ అని కూడా పిలుస్తారు. కాలిఫోర్నియాలో దాదాపుగా అన్ని ప్రధాన టెక్ కంపనీలు ఉన్నాయి. వాణిజ్య బాంక్ అయిన SVB పలు టెక్ కంపనీలకి అప్పు ఇచ్చింది !SVB మూత పడడానికి కారణాలు ఏమిటి ? డిపాజిటర్స్ కి వాళ్ళ డబ్బు తిరిగి ఇచ్చేంత లిక్విడ్ కాష్ SVB దగ్గర లేకపోవడం ! కోవిడ్ తరువాత బాంక్ బిజినెస్ తగ్గింది బాగా !
Ads
SVB దగ్గర మదుపరులు చేసిన డిపాజిట్స్ ఎక్కువగా, బాంక్ ఇచ్చిన అప్పులు తక్కువగా ఉండడం ! డిపాజిటర్స్ కి వడ్డీలు ఇవ్వాలంటే ముందు బాంకులు డిపాజిట్ల రూపంలో సేకరించిన డబ్బుని అప్పులు ఇచ్చి, వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేసి డిపాజిటర్స్ కి వడ్డీ చెల్లిస్తూ ఉంటాయి! అయితే SVB మూత పడడానికి ముందు ఇచ్చిన అప్పులు, వాటి తాలూకు వడ్డీలు రాబట్ట లేకపోయింది ! ప్రధానంగా కోవిడ్ లాక్డౌన్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం ప్రపంచవ్యాప్తంగా అన్ని బాంకుల పని తీరుని దెబ్బతీసింది !
కేవలం ఉద్యోగుల జీతాలని ఇవ్వడం కోసమే పనిచేశాయి లాక్ డౌన్ సమయంలో ! కానీ బాంక్ కి అయ్యే ఖర్చులు అలానే ఉండి పోయాయి ! మరో వైపు కోవిడ్ వల్ల చాలా టెక్ కంపనీలు దెబ్బతిన్నాయి. దాంతో SVB దగ్గర తీసుకున్న అప్పులని రీ షెడ్యూల్ చేయించుకున్నాయి. SVB మూత పడడానికి మరో కారణం బాడ్ NPAలు [నాన్ పెర్ఫామెన్స్ అసెట్స్ ].
**********************
గురువారం మార్చి 9, 2023 న సిలికాన్ వాలీ బాంక్ షేర్లు ఉన్నట్లుండి 60% పడిపోయాయి ! ఇది జరిగింది కేవలం SVB మూతపడబోతున్నది అంటూ పుకార్లు రావడమే కారణం ! స్టాక్ మార్కెట్ లో ఎప్పుడయితే షేర్ వాల్యూ పడిపోయిందో వెంటనే డిపాజిటర్లు తమ డిపాజిట్ల ని కాన్సిల్ చేసుకోవడానికి ఒక్కసారిగా పోటీ పడడంతో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు అంటే లిక్విడ్ కాష్ బాంక్ దగ్గర లేకపోవడంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది! మరుసటి రోజున మరో 9% షేర్ల ధరలు పడిపోవడం జరిగింది.
గత శుక్రవారం మార్చి 10, 2023 న బాంక్ రెగ్యులేటర్లు సిలికాన్ వాలీ బాంక్ ని తమ అధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు ! 24 గంటల్లో SVB షేర్ల ధరలు 69% పడిపోయాయి అంటే పుకార్లు ఎంత బలంగా వ్యాపించాయో అర్ధంఅవుతున్నది ! KARMA RETURNS!
**************************
ఇదొక వ్యాధి !
బాగాలేక పోయినా బాగున్నట్లుగా చెప్పుకోవడానికి ఆధారాలు కావాలి ! ఎవరు చెప్తే ప్రజలు నమ్ముతారు ? అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ! వీటిని సృష్టించింది పశ్చిమ దేశాలే ! అలాగే ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు చాలా నమ్మకమయినవి అని నమ్మించినదీ పశ్చిమదేశాలే ! ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు చేసే పని ఏమిటీ ?
బాంకులు, ఆర్ధిక సంస్థలు, ప్రభుత్వాలు, పరిశ్రమల ఆదాయ వ్యయాలని మదింపు చేసి వాటికి రేటింగ్స్ ఇస్తాయి. ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థలు ఇచ్చే రేటింగ్స్ ఆధారంగా ప్రపంచ బ్యాంక్ తో సహా ఇతర జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అవును ! దేశాలకి కూడా క్రెడిట్ రేటింగ్స్ ఇస్తాయి ఇవి. అత్యధిక క్రెడిట్ రేటింగ్ AAA అయితే కనిష్ట రేటింగ్ వచ్చేసి D అన్నమాట. AAA టాప్ రేటింగ్ అయితే AA+, A+ మొదటి మూడు రేటింగ్స్. తరువాత BB+,B+,అన్నమాట. వీటిలో మైనస్ రేటింగ్ కూడా ఇస్తాయి.
ప్రపంచంలోని టాప్ 3 క్రెడిట్ రేటింగ్ సంస్థలు : 1, S&P Global Ratings [స్టాండర్డ్ & పూర్స్ గ్లోబల్ రేటింగ్స్ ] 2. Moody’s 3. Fitch Group… మొదటి రెండూ అమెరికా కేంద్రంగా పనిచేస్తుండగా ఫిచ్ గ్రూపు అమెరికాతో పాటు లండన్ లో తమ కేంద్రాలని పెట్టుకొని పనిచేస్తున్నది. మన దేశంలో కూడా దాదాపుగా 7 క్రెడిట్ రేటింగ్ సంస్థలు పనిచేస్తున్నాయి. S&P క్రెడిట్ రేటింగ్ సంస్థ మీద 2013 లో అమెరికా ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ని తప్పు దారి పట్టించే విధంగా క్రెడిట్ రేటింగ్ ఇచ్చింది అంటూ 5 బిలియన్ డాలర్ల సూట్ వేసింది. వివిధ సంస్థల పని తీరు బాగానే ఉంది అని రేటింగ్ ఇచ్చినందుకు గాను భారీగా ముడుపులు తీసుకుంది S&P అనే ఆరోపణలు ముందు నుండి ఉన్నాయి !
******************
6 నెలల క్రితం JP మోర్గాన్ అనే ఆడిట్ సంస్థ సిలికాన్ వాలీ బాంక్ పని తీరు బాగానే ఉంది అని సర్టిఫై చేసింది ! మరి ఇంతలో ఇలా ఎందుకు SVB దివాళా తీసింది ? బాంకింగ్ రంగంలో బలంగా ఉండడానికి అని SVB చివరి గంట వరకు విశ్వ ప్రయత్నాలు చేసింది కానీ అవేవీ ఫలితాలు ఇవ్వలేకపోయాయి ! స్టాక్ మార్కెట్ లో ఒక చిన్న సందేహం లేదా పుకారు చాలు ఎటువంటి పెద్ద సంస్థ అయినా కుప్ప కూలిపోవడానికి !
ఆదానీ గ్రూపు విషయంలో జరిగింది పుకారు మాత్రమే ! నిజానికి సిలికాన్ వాలీ బాంక్ కంటే 7 రెట్ల నిధులు ఆదానీ గ్రూపు దగ్గర ఉన్నాయి కానీ ఒక చిన్న పుకారు వల్ల షేర్ల ధరలు పడిపోయాయి ! కానీ నిలదొక్కుకోగలిగింది ఆదానీ గ్రూపు ! నేను బాంకుల దగ్గర తీసుకున్న అప్పులు కట్టలేను అని ఆదాని గ్రూపు చేతులు ఎత్తివేయలేదు ! కానీ SVB మాత్రం దివాళా తీసింది ఎందుకు ?
ఒక వ్యాపార సంస్థ దివాళా తీయడం వేరు ! ఒక కమర్షియల్ బ్యాంక్ దివాళా తీయడం వేరు ! సిలికాన్ బాంక్ దివాళా విషయం బయటపడటంతో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక విధమయిన పూనకం వచ్చింది ఫలితంగా అన్ని బాంక్ ల, ఆర్ధిక సంస్థల షేర్లు పడిపోయాయి ! కానీ ఆదానీ గ్రూపు విషయంలో అలా జరగలేదు. కేవలం ఆదానీ గ్రూపు షేర్ల ధరలు మాత్రమే పడిపోయాయి !
***************
చాలామందికి సందేహం రావొచ్చు ! హిండెన్ బర్గ్ ఎందుకు సిలికాన్ వాలీ బాంక్ పతనం సంగతిని ముందే పసిగట్టి రిపోర్ట్ ఇవ్వలేదు ? ఎందుకంటే హిండెన్ బర్గ్ అనేది కేవలం ఆదాని గ్రూపుని టార్గెట్ చేయడానికి మాత్రమే పనిచేసింది 6 నెలల పాటు ! హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్ ని బయటపెట్టే ముందు ఆదానీ షేర్ల మీద షార్ట్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసింది. ఆదానీ షేర్ల ధరలు పడిపోగానే లాభాలు తీసుకొని పక్కకి జరిగిపోయింది ! జార్జ్ సోరోస్ అండ్ కంపనీ లక్ష్యం కేవలం ఆదానీ గ్రూపు మాత్రమే ! ఆదానీ షేర్ల ధరలు పడిపోయినా మళ్ళీ బాంకులు అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకు ?
బాంకులకి తెలుసు షార్ట్ సెల్లర్ అయిన హిండెన్‌బర్గ్ తన లాభం కోసం రిపోర్ట్ చేసి పుకార్లని పుట్టించింది ! మరి బాంకులు తమ వద్ద ఉన్న డిపాజిటర్స్ సొమ్ముని ఎవరికన్నా ఎక్కువ వడ్డీకి ఇచ్చి, దానిలో నుండి డిపాజిటర్లకి నెల వారీ వడ్డీలు ఇస్తాయి. కానీ ఇదే పని సిలికాన్ వాలీ బాంక్ చేయలేకపోయింది. నిజానికి సిలికాన్ వాలీ దగ్గర డిపాజిట్ల రూపంలో డబ్బు ఉంది కానీ అవసరమయినన్ని నిధులు అప్పులు ఇచ్చి, వడ్డీలు వసూలు చేసుకోలేక పోయింది దాంతో తన వద్ద ఉన్న డబ్బుకి వడ్డీలు చెల్లిస్తూ పోయింది ! చివరికి డిపాజిట్ చేసిన వాళ్ళకి వడ్డీలు ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళిపోయి దివాళా తీసింది !
ఇప్పుడు అమెరికన్ ఇన్స్యూరెన్స్ సిస్టమ్ కేవలం 1,50,000 డాలర్లు మాత్రమే ఖాతాదారులకి చెల్లించడానికి ఒప్పుకున్నాయి అంటే ఒక లక్ష యాభైవేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో SVB లో డిపాజిట్ చేసిన వాళ్ళకి నష్టం అన్నమాట ! సమస్య మొదలయ్యింది కోవిడ్ లాక్ డౌన్ సమయంలో… బాంకులు తమ ఖాతాదారులకి వడ్డీలు చెల్లిస్తూ పోయాయి కానీ బాంకుల దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు మాత్రం సమయానికి వాయిదాలు చెల్లించలేక పోవడంతో బాంకుల దగ్గర ఉన్న నిధులలో నుండి ఆ మొత్తం బయటికి వెళ్ళిపోయింది !
సిలికాన్ వాలీ బ్యాంక్ తన వద్ద ఉన్న సేఫ్ బాండ్స్ ని తక్కువ ధరకి అమ్మేసింది ! దాంతో నష్టాలు ఇంకా ఎక్కువ అయ్యాయి ! వేరే ఇన్వెస్టర్ల కోసం ప్రయత్నాలు చేసింది కానీ SVB లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలా చివరకి దివాళా తీసింది !
Share this Article