Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిరంజీవి ట్రెండ్ ఫాలో అవుతున్న ప్రభాస్… సాలార్‌లో కేజీఎఫ్ యశ్ కూడా…

March 15, 2023 by M S R

చిరంజీవికి తోడుగా ఏదో సినిమాలో సల్మాన్ ఖాన్… మరో సినిమాలో రవితేజ… ఇంకో సినిమాలో కొడుకు రాంచరణ్… అంతటి చిరంజీవికి ఇంకొకరి తోడు కావాలా..? కావాలి… ఇప్పుడు అదే ఓ ట్రెండ్,,. ఐటమ్ సాంగ్‌లాగే ఇదీ ఓ అదనపు ఆకర్షణ అన్నమాట… అయితే అది అన్నిసార్లూ ఫలిస్తుందని ఎవరూ చెప్పలేరు…
కాకపోతే ఆ ట్రెండ్‌ను ప్రభాస్ కూడా పట్టుకున్నాడు… నిజానికి ప్రభాస్ సినిమాలో అసలు మరో హీరో ఫిట్టవుతాడా..? తనకే స్క్రీన్ స్పేస్ సరిపోదు… కానీ తప్పదు… హొంబలె ఫిలిమ్స్ అధినేత విజయ్ కిరాగందూర్ చెప్పాడు… దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా చెప్పాడు… గెస్టు రోల్‌కు అంతటి కేజీఎఫ్ యశ్ కూడా వోకే చెప్పాడు… ఇంకేముంది..? సాలార్ సినిమాలో ప్రభాస్‌తోపాటు యశ్ కూడా కనిపించబోతున్నాడు…

షారూక్ ఖాన్ పఠాన్ సినిమాలో కూడా ఈ ట్రెండ్ ఫాలో అయ్యారు… నిజమేమిటో తెలియదు గానీ సినిమా పత్రికలు, ఫిలిమ్ మీడియా లెక్కలు, వార్తల ప్రకారం ఆ సినిమా సూపర్ హిట్… సాలార్ సినిమాను కూడా ఆ రేంజులో తీసుకురావాలనేది ప్రశాంత్ నీల్ సంకల్పం… ఐన లేట్ ఎలాగూ అయ్యింది, రాధేశ్యామ్ బాధ మరిచిపోయేలా… ఆదిపురుష్ ఆందోళన పోయేలా సాలార్ రావాలని ప్రభాస్ కోరిక…

అసలే ప్రాజెక్టు కె, రాజాడీలక్స్ చేతిలో ఉన్నయ్… మరో రెండు పైపు లైన్‌లో ఉన్నాయి… సాలార్ హిట్టయితే తప్ప ఇవన్నింటికీ జోష్ రాదు… తన డిమాండ్ సజీవంగా ఉండాలంటే సాలర్ మంచి వసూళ్లను సాధించాల్సిందే… అదీ ప్రశాంత్ నీల్ ‌కు పరీక్ష ఇప్పుడు… సాలార్‌లో ప్రభాస్‌కు జోడీగా శృతిహాసన్, పృథ్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీ రోల్స్ చేస్తున్నారు… శృతిహాసన్ హఠాత్తుగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కమిటవుతోంది… ఏమిటో మరి..?

Ads

ప్రశాంత్ నీల్ తన సినిమాకు సంబంధించి చాలా సీక్రెసీ మెయింటెయిన్ చేస్తున్నాడు కానీ ఈ సాలార్ అప్‌డేట్స్ మాత్రం తను చెప్పకుండానే బయటికి వచ్చేస్తున్నయ్… సాలార్‌లో ప్రభాస్‌తోపాటు గెస్టు రోల్‌లో కేజీఎఫ్ యశ్ కనిపిస్తున్నాడనేది ఈ లీకేజీ వార్తే… యశ్ సంపాదించిన ఇమేజీ, ప్రభాస్ ఇమేజీ కలిస్తే సినిమాకు మంచి ఊపు వస్తుందనేది ప్రశాంత్ నీల్ ఆలోచన… ఎలాగూ యశ్ హొంబలె ఫిలిమ్స్ వాళ్ల ఆస్థాన హీరోయే కాబట్టి, ప్రభాస్‌తో తనకు మంచి దోస్తీ ఉంది కాబట్టి అడగ్గానే ఒప్పేసుకున్నాడు యశ్…

‘‘ఈ సాలార్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనీ, ఆ ఆదిపురుష్ ఎప్పుడొస్తుందో డెస్టినీకి వదిలేయాలనీ ప్రభాస్ ఉద్దేశం… పృథ్విరాజ్ సుకుమారన్ షూటింగుకు హాజరవుతున్నాడు… ఈ సినిమా షూటింగ్ యూరప్ లొకేషన్లలో మొదలయ్యాక యశ్ పోర్షన్ షూటింగ్ స్టార్టయిందట… యూరప్‌లో ఈ ఇద్దరు హీరోలకూ ఓ యాక్షన్ సీన్ ఉందట కూడా.. రాఖీ యూరప్‌లో సాలార్‌ను కలిశాక కథలో కీలకమైన ట్విస్టు వస్తుందట…’’ అని బాలీవుడ్ లైఫ్ వాడు రాసుకొచ్చాడు…

నిజానికి ఇవన్నీ మొదట్లో ఊహాగానాలుగా వినిపించినా సరే… ఇద్దరు హీరోల యూరప్ ట్రిప్ ఒకేసారి ఉండటంతో ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి…


KING IS BACK 🤩🔥
HYDERABAD FROM #ITALY POST #SALAAR SHOOT PAPPED AT AIRPORT 🔥🔥🔥#PRABHAS PIC.TWITTER.COM/ONWLN2Y1CG

— VEYD PRABHAS (@VEYDPRABHAS) MARCH 13, 2023


ఇదే సమయంలో యశ్ యూరపులోనే ఫ్యామిలీ హాలీడే ట్రిప్ పెట్టుకున్నాడు… ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం, సీక్రెసీ మెయింటెయిన్ చేస్తున్నారు…


I THINK YASH IS DOING A CAMEO IN SALAAR AS ROCKY 💥💥

IT’S ALMOST 1 YEAR FOR KGF2 RELEASE,HE DIDN’T CHANGED THE LOOK YET,
SALAAR TEAM AND YASH BOSS BOTH ARE IN EUROPE NOW (MAYBE THEY ARE MAINTAINING THE SECRET)
HIGH CHANCES 🤞

IF IT HAPPENS 🔥🌋#SALAAR #YASHBOSS #YASH19 PIC.TWITTER.COM/GXEWIQQKAU

— RAANA™ (@RAANA_YASH) MARCH 10, 2023


 

ప్రస్తుతం సినిమా ఏ స్థితిలో ఉందంటే… దాదాపు పూర్తయినట్టే… శృతిహాసన్ పోర్షన్ పూర్తయింది… పృథ్వీరాజ్ సుకుమారన్ పోర్షన్ ముగింపుకొచ్చింది… మిగిలిపోయిన చిన్న చిన్న సీన్లు చేసేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌కు వెళ్లిపోవడమేనట… అసలు లేటయ్యేదే ఈ పార్ట్ కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions