Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రంగమార్తాండ… ప్రచారానికి ఓ కృష్ణవంశీ కొత్త వ్యూహం ఫలిస్తుందా…

March 17, 2023 by M S R

సినిమాకు హైప్ కావాలి… లేకపోతే అడ్వాన్స్ బుకింగులు ఉండవు… తొలిరోజు భారీ టికెట్ల అమ్మకాలు ఉండవు… ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్‌కు డిమాండ్ రాదు… అందుకని ప్రచారం కావాలి… ప్రిరిలీజు ఫంక్షన్లు బోలెడు ఖర్చు యవ్వారం… ఆడియో రిలీజులు హోటల్లో పెట్టుకున్నా సరే, జర్నలిస్టులు, కవరేజీ ప్రలోభాలు, హోటల్ ఖర్చులు తక్కువేమీ కాదు…

అందుకే పోస్టర్ రిలీజు, గ్లింప్స్, ట్రెయిలర్, టీజర్… తరువాత ఒక్కొక్క పాట రిలీజులు… ఇలా ప్రచారాన్ని లైవ్‌లో ఉంచుతున్నారు ఇప్పుడు… సోషల్ మీడియా మీదే ఆధారం… అందులో ముఖ్యమైనది పెయిడ్ రివ్యూస్, మొహమాటం రివ్యూస్… దీనివల్ల ప్రచారం లైవ్‌గా ఉంటుంది, సినిమా రిలీజు నాడు ఉదయమే వచ్చే నెగెటివ్ రివ్యూలకు వేక్సిన్‌గా పనిచేస్తాయి ఇవి…

అందరూ చేస్తున్న పనే… కొందరు సెలెక్టెడ్ పీపుల్‌కు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ ఉంటుంది… తద్వారా పాజిటివ్ మౌత్ టాక్ రిలీజుకు ముందే స్ప్పెడ్ అవుతుందని నిర్మాతల ఆశ… ఈ ప్రీమియర్ల ప్రచార వ్యూహాన్ని సార్, బలగం సినిమాలకు అవలంబించి మంచి ఫలితమే పొందినట్టున్నారు………. ఇదంతా ఒక కోణంలో విశ్లేషణ… చాలామంది నమ్ముతున్నారు… చివరకు కృష్ణవంశీ వంటి దర్శకుడు సైతం అదే పాటిస్తున్నాడు, తన రంగమార్తాండ సినిమా కోసం…  (రంగమార్తాండ అంటే రంగస్థలంపై సూర్యుడిలా వెలుగొందే నటుడు అనేనా అర్థం…?)

Ads

rangamarthanda

ఐతే… ఇదంతా పెద్ద డొల్ల విశ్లేషణ… ఒకటీరెండు సినిమాలకు ఈ ముందస్తు రివ్యూల వ్యూహం ఫలించవచ్చేమో గానీ అది ప్రమాదకరమైన ఎత్తుగడ… సినిమా నడవాలంటే కథలో దమ్ముండాలి… వినోదమో, ఉద్వేగమో ఏదో ఒకటి కదిలించాలి… అంతేతప్ప ఎన్ని జాకీలు పెట్టినా సరే సినిమా లేవదు… ఉదాహరణకు విరాటపర్వం… ఈ సినిమాకు విపరీతమైన సోషల్ మీడియా హైప్ లభించింది… కానీ చివరకు ఏమైంది..? తుస్… బేసిక్‌గా కథలోనే లోపముంది… అందుకే ఎవరికీ నచ్చలేదు… ఏ హీరోయిన్ పాత్రను సినిమాకు కీలకంగా భావించారో, ఆ పాత్ర కేరక్టరైజేషన్ లోపాలే సినిమాను దెబ్బతీశాయి…

బలగం సినిమా సక్సెస్‌కు వంద కారణాలున్నయ్… అందుకని సోషల్ మీడియా హైప్‌తో, మొహమాటం ముందస్తు పాజిటివ్ పెయిడ్ రివ్యూస్‌తో ఏదో ఒరుగుతుందీ అనుకుంటే అది వృథా ప్రయత్నం… పైగా సినిమాలో కథేమిటి..? ఎవరెలా నటించారు..? వంటి కీలకాంశాలపై ముందే ఓ అభిప్రాయం ఏర్పడటం మంచిది కాదు… జనం పెయిడ్ రివ్యూస్‌ను ఇట్టే పసిగట్టేస్తున్నారు… సో, కృష్ణ వంశీ రాంగ్ రూట్‌లో వెళ్తున్నాడనేది ఓ అభిప్రాయం…

ఆఫ్ బీట్, కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ ఎప్పుడూ కమర్షియల్ కోణంలో రిస్కీ ప్రాజెక్టులే… రంగమార్తాండ సినిమాలో నిజంగా అంత కంటెంట్ దమ్ముంటే ఇప్పటికే ఎప్పుడో రిలీజయ్యేది… నిర్మాతలు ఎవరో గానీ కృష్ణవంశీని గుడ్డిగా నమ్మి కోట్లకుకోట్లు పెట్టినట్టున్నారు… ఇప్పుడు ప్రకాష్‌రాజ్‌కు పెద్ద పాపులారిటీ లేదు… బ్రహ్మానందంలో ఇప్పుడు కామెడీ లేదు, మొనాటనీతో అన్ పాపులర్ అయిపోయాడు… తనతో ఓ కీలకపాత్ర వేయించడం మరో మైనస్… తనకు నటించడం రాదని కాదు, గొప్ప నటుడు, కానీ ప్రేక్షకులు చూసే కోణం వేరు…

పైగా రంగస్థల నటుల చుట్టూ అల్లిన ఓ రీమేక్ ఇది… శాస్త్రీయ సంగీతంలాగే రంగస్థల నటన అనేదీ కాలం చెల్లి, ప్రస్తుత ఆధునిక తరాలకు ఏమాత్రం కనెక్ట్ కాని సబ్జెక్టులు అవి… అన్నింటికీ మించి ఫిలాసఫికల్ మూవీస్ తెలుగులో అంతగా క్లిక్ కావు… ఇలాంటి సినిమాలు మలయాళంలో, కొద్దోగొప్పో తమిళంలో నడుస్తాయి… తెలుగులో నాటుకొట్టుడు, దంచికొట్టుడు టేస్ట్ ఎక్కువ… సో, ఈ కోణంలో తీసే ప్రతి సినిమా శంకరాభరణం కాబోదు… శంకరాభరణం అంటే గుర్తొచ్చింది… ఇలాంటి సినిమాలకు ప్రాణం సంగీతం…

ఇళయరాజాతో పాటలు చేయించాలనే కృష్ణవంశీ టేస్టు మంచిదే కానీ అవి అంత పెద్దగా జనంలోకి పోలేదు… ప్రత్యేకించి ఆ లబ్ధప్రతిష్టుడు పాడిన పాటల్లోని తెలుగు పదాల ఉచ్చరణ దోషాలు పంటికింద రాళ్లు… సిరివెన్నెల మంచి కంటెంటును ఇళయరాజా గళం దెబ్బతీసినట్టు వినిపిస్తోంది… అనసూయ ముఖ్యమైన పాత్రల్ని పోషించగల సమర్థనటి ఏమీ కాదు… రమ్యకృష్ణ అంటే ప్రేక్షకులు ఎక్స్‌పెక్ట్ చేసే పాత్ర రేంజ్ వేరు… రాహుల్ సిప్లిగంజ్ నటుడిగా ఎప్పుడూ ప్రూవ్ చేసుకోలేదు… కాకపోతే మంచి గాయకుడు…

కృష్ణవంశీ పలువురు దర్శకులతో పాజిటివ్ ట్వీట్లు ఇప్పించుకుంటున్నా… కొన్ని లోతయిన పాజిటివ్ రివ్యూస్ కనిపిస్తున్నా సరే, సినిమాకు రావల్సినంత బజ్ మాత్రం రాలేదు… అఫ్‌కోర్స్, ఆ బజ్ లేకపోతే సినిమా నడవదు అని చెప్పలేం… మొదటి షో ప్రేక్షకుడికి కనెక్టయితే సక్సెస్‌ను ఎవరూ ఆపలేరు… కానీ దానికి చాలా ప్రతిబంధకాలయితే ఉన్నాయి… సో, స్పెషల్ ప్రీమియర్లతో ప్రచారం పొందే వ్యూహం ఫలిస్తే గుడ్, ఎదురు తంతే మాత్రం ఫలితం చాలా చేదుగా ఉంటుంది… అసలే నిర్మాతలు ఈ సినిమా రేంజుకు మించి భారీ ఖర్చు పెట్టారట…!!

కృష్ణవంశీ కెరీరే దీని మీద ఆధారపడి ఉంది… అప్పుడెప్పుడో ఆరేడేళ్లక్రితం నక్షత్రం తీశాడు… అది వెలగని నక్షత్రం… ఒక రీమేక్‌ను తీయడానికి ఇంత జాప్యం జరగడం ఆశ్చర్యంగా ఉంది… పాత కృష్ణవంశీ కనిపించాలంటే తనదైన మార్కుతో తీయాలి… తనకు కావల్సింది ఒక చందమామ… ఈ మొనాటనస్ ప్రకాష్‌రాజ్ మామ కాదు…!! ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం రొటీన్ ఇమేజీ నుంచి బయటికి తీసుకురావాలని కృష్ణవంశీ అనుకున్నాడేమో… కానీ అదంత వీజీ కాదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions