కాస్త సద్దుమణిగింది గానీ… సింగర్ సునీత రెండో పెళ్లి మీద సోషల్ మీడియాలో బోలెడన్ని వ్యాఖ్యానాలు… నిజానికి ఆమె చేసింది తప్పేమీ కాదు… చట్టరీత్యా, సమాజం ఆమోదించిన పద్ధతిలోనే పెళ్లిచేసుకుంది… అది ఆమె వ్యక్తిగతం… ఎదిగిన పిల్లలు, ఆమె బంధుగణం కూడా ఆశీర్వదించి అక్షింతలు వేశారు… దాన్నలా వదిలేస్తే… సెలబ్రిటీల మల్టీ పెళ్లిళ్లపై ఎప్పుడూ ఓ చర్చే… ఖండించేవాళ్లు, సపోర్ట్ చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు… ఐనా, అంతటి వయసులో ఎన్టీయార్ లక్ష్మిపార్వతిని పెళ్లిచేసుకుంటే తెలుగు సమాజం ఆమోదిస్తూ వోటేయలేదా..? ఈ సెలబ్రిటీల మల్టీ పెళ్లిళ్లు ఈరోజువేమీ కావు… చాలాకాలం నుంచీ సాగుతున్నవే… మిత్రుడు Bharadwaja Rangavajhala ఒక పోస్టులో ఓ ఉదాహరణ చెబుతున్నాడు ఇలా… చదవండి…
Ads
ఆలోచనల ఓవర్ ఫ్లో ..
……………….
పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ చిత్రం ఇది. ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడితో సహా హాజరయ్యారు. పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు … జయంతి. పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జయంతి వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పుడు జయంతికి అది రెండోపెళ్లి. ఆ రెండో పెళ్లి చేసుకున్న చందన నిర్మాత గిరిబాబుకూ రెండో పెళ్లే.
సినిమా వాళ్లల్లో ఇలాంటివి అధికం కనిపించడానికి కారణాలు అనేకం … ఇండస్ట్రీలో ఒక అండకోసం ఓ పెద్దమనిషిని ఆశ్రయించడం …….. దరిమిలా వారు వీరి మీద దాష్టీకం చేయడం … కొంతకాలం భరించి నమస్తే గురూ … అన్జెప్పి బయట పడడం … ఇంతదాన్ని చేస్తే అన్యాయం చేసిందనే ప్రచారాన్ని భరించడం … క్రమంగా మరో వివాహం చేసుకోవడం ఇవన్నీ చాలా మంది వీరోయిన్ల తెరవెనుక కథల్లో కనిపిస్తాయి …
కొందరు ఈ జర్నీని యాక్సెప్ట్ చేయక డిప్రెస్ అవుతారు … గందరగోళ పడతారు. జీవితన్ని కెరీర్ ను నాశనం చేసుకుంటారు … అయితే ఇయన్నీ పాత రోజుల్లోనే … ఇప్పుడు పర్లేదు … కొంత గ్యానం వచ్చింది ఆ ఏరియాలోనూ …
ప్రధానంగా అభిప్రాయబేధాలు వచ్చినప్పుడు విడిపోవడమే మంచిదని చెప్పారుగా పెద్దలు … ఎవరి కోసం ఎవరూ అభిప్రాయాలు మార్చునోక్కరలేదు అని కూడా చెప్పారుగా … మనసులు అర్పణలు ఉండవు. అర్పించుకోడాలు అస్సలు ఉండవు… ఆత్రేయ గారన్నట్టు ఉన్న మనసు నీకర్పణ చేసి లేని దాననయ్యాను లాంటి సినిమాలు వాస్తవంలో ఉండవు. అందాక ఎందుకు..? ఎఫ్ బిలో ఒకరి అభిప్రాయాలు ఓ దశలో ఓ అంశం మీద నచ్చి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాం. వారు అంగీకరిస్తారు. ఆ తర్వాత అదే వ్యక్తి నుంచీ మనం నొచ్చుకునే అభిప్రాయ ప్రకటనలు వెలువడుతాయి. అప్పుడు ఫ్రెండ్షిప్ నుంచీ తప్పుకుంటాం … ఇక్కడే నాకు తేడా కొట్టుద్ది .. పెతోడూ మనకు అనుకూలమైన అభిప్రాయలే వ్యక్తం చేయాలంటే ఎట్టా …
మళ్లీ ఆత్రేయే …. నీ మనసు నీదిరా ఇచ్చుకో దాచుకో ఏమైనా చేసుకో … ఎదుటివాళ్లను మనసిమ్మని అడిగేందుకు నువ్వెవరు? అట్టాగే భార్యా భర్తల్లో కూడా వారి అభిప్రాయమే ఈవిడా వ్యక్తం చేయాలంటే ఎట్టా కుదరదుగా … అట్నే ఆవిడ అభిప్రాయలే ఈయనా వ్యక్తం చేయాలన్నా కుదరదు కదా … జాతులు విముక్తిని కోరతాయి అన్నాడు కదా స్టాలిన్ … పెళ్లిళ్లు విడిపోడాన్ని కోరుతాయి. బంధం ఎప్పుడూ బంధమే …. అన్నారుగా పెద్దోళ్లు …. నేను పెద్దోళ్లను గౌరవిస్తాను … క్రూర మృగమ్ముల కోరలు వంచెను. ఘోరారణ్యముల ఆక్రమించెను. అయినా … మడిసి మారలేదు, ఆతడి ఆకలి తీరలేదు … ఏదో జయంతి గారి పెళ్లి రిసెప్షను ఫొటో దొరగ్గానే ఇంత ఆవేశపడిపోయి బైటకే ఆలోచించేత్తే ఎట్టా? ఆలోచనలు ఓవర్ ఫ్లో అంటే ఇదే ..
Share this Article