Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నటుడిగా బ్రహ్మానందం ఇప్పుడు పరిపూర్ణుడు… ఐనాసరే జాతీయ అవార్డు రాదు…

March 26, 2023 by M S R

Sai Vamshi……….  … మలయాళ సినీరంగంలో సలీమ్ కుమార్ అనే నటుడు ఉన్నారు. హాస్యానికి ట్రేడ్ మార్క్. 41 ఏళ్ల వయసులో ఆయన చేత ‘ఆదామింటె మగన్ అబు’ అనే సినిమాలో ప్రధాన పాత్ర చేయించారు దర్శకుడు సలీమ్ అహ్మద్. ఆయన పక్కన జోడీగా జరీనా వాహబ్. దర్శకుడిగా సలీమ్ అహ్మద్‌కు అదే తొలి సినిమా. హాస్యనటుడిగా పేరు పొందిన వ్యక్తి చేత అంత బరువైన పాత్ర చేయించాలని ఆయన అనుకోవడం నిజంగా సాహసమే!

… కన్నడ సినీరంగంలో సీనియర్ నటి ఉమాశ్రీ. రంగస్థలం నుంచి సినిమా రంగానికి వచ్చి, హాస్య, సహాయక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వ్యక్తి. 50 ఏళ్ల వయసులో ఆమె చేత ‘గులాబీ టాకీస్’ అనే సినిమాలో గులాబీ అనే ముస్లిం మహిళ పాత్ర చేయించారు దర్శకుడు గిరీష్ కాసరవెల్లి. సినిమా మొత్తం ఆమె పాత్ర చుట్టూనే ఉంటుంది. ‘హాస్యానికి పేరుపొందిన నటికి అంత బరువైన పాత్రా?’ అని దర్శకుడు అనుకోలేదు.

… దక్షిణాది భాషల్లో నటుడు నగేష్ అంటే తెలియని వారు ఉండరు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి, హాస్యంలో తనదైన ముద్ర వేశారు. ఎవరూ ఇమిటేట్ చేయలేని గొంతుతో అద్భుతమైన డైలాగులు పలకడం ఆయనకే చెల్లు. 60 ఏళ్ల వయసులో ‘నమ్మవర్’ అనే సినిమాలో ఆయన చేత ప్రొఫెసర్ పాత్ర చేయించారు దర్శకుడు కె.ఎస్.సేతుమాధవన్. కూతురు చనిపోయింది అనే విషయాన్ని నమ్మలేక సతమయ్యే సన్నివేశంలో నగేష్ గారి నటన చూసి తీరాలి. One of the Best Performances of an Indian Actor. తమిళ సినిమాల్లో చాలామందికి నేటికీ అదొక డ్రీమ్ రోల్.

Ads

… యాదృచ్ఛికంగా, ఈ ముగ్గురికీ ఆ సినిమాలకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో అవార్డులు వచ్చాయి. గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తెలుగులో టాప్ కమెడియన్‌గా పేరు పొందిన బ్రహ్మానందం ‘రంగమార్తాండ’లో విజృంభించారు. ఎప్పుడూ వేయని పాత్ర. దొరక్క దొరక్క 65 ఏళ్లకు దొరికిన పాత్ర. తన నటనతో హ్యాట్సాఫ్ అనిపించారు. ఆయనకు జాతీయ అవార్డు వస్తుందా? ‘రంగమార్తాండ’ రీమేక్ సినిమా కాబట్టి ఆ అవకాశం లేదు. ఇప్పటిదాకా కామెడీలోనే కింగ్ అనిపించుకున్న ఆయనకు మలివయసులో ఈ పాత్ర దొరకడం భాగ్యమే! ఈ పాత్ర నేను చేయాలా అని బ్రహ్మానందం అనుకున్నా, ఈ పాత్ర ఆయన చేత చేయించాలా అని దర్శకుడు కృష్ణవంశీ భావించినా కథ వేరేలా ఉండేది.

… నటులకు పాత్రలు దొరకడం ముఖ్యం. నటన వచ్చిన వారికి దొరకడం మరీ మరీ ముఖ్యం. బ్రహ్మానందంకు ఇన్నాళ్లకు ఆ అవకాశం దొరికింది. ‘రంగమార్తాండ’లో లోపాలు ఉంటే ఉండనీ, కానీ ‘చక్రపాణి’ పాత్ర బ్రహ్మానందం చేత చేయించిన కారణానికి తెలుగు ప్రేక్షకులు కలకాలం ఈ సినిమాను గుర్తుపెట్టుకుంటారు. గుర్తు పెట్టుకోవాలి. బ్రహ్మానందం కోసం!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions