ఏదో న్యూస్ సైటులో కనిపించింది… బహుశా దిన్యూస్మినట్ కావచ్చు… నేటి నుంచి దేశవ్యాప్తంగా ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్ వారియర్స్‌కు కరోనా వేక్సిన్లు వేసే ప్రక్రియ ఆరంభం కాబోతోంది కదా… డ్రైరన్ కూడా అయిపోయింది కదా… ఈ దశ తరువాత యాభై ఏళ్లు దాటిన వాళ్లకూ వేక్సినేషన్ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది కదా… వేక్సిన్ మీద ఎవరికీ ఏ అపోహలూ, భయాలూ అవసరం లేదనీ, నేనే తొలి టీకా వేసుకుంటాననీ తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించాడు… గుడ్, స్పిరిట్ రీత్యా మంచి సంకేతమే… కానీ ఇప్పుడు టీకా వేసుకునేది ఆరోగ్య సిబ్బందే కదా… వాళ్లకు టీకాల గురించి బాగా తెలుసు కదా… మరి భయాందోళనల ప్రసక్తి ఎక్కడిది..? అసలు మామూలు జనంలోనే టీకాలంటే భయం లేదు… అపోహల్లేవు… అందరూ ఎదురు చూస్తున్నారు నిజానికి..!
అన్నింటికన్నా ఆ వార్తలో ప్రధానంగా కనిపించింది… వేక్సిన్ వేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ వారి వేళ్లపై సిరా గుర్తు వేస్తారట… పోలింగ్ బూతులో వేసినట్టు… ఎందుకయ్యా అంటే..? మళ్లీ మళ్లీ వేయకుండా ఉండటానికి ప్లస్ గందరగోళం తలెత్తకుండా ఉండానికి అట… ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రినివాసరావు, వైద్య విద్య డైరెక్టర్ రమేష్ రెడ్డి ప్రెస్మీట్లో చెప్పారట… అంటే అన్నామంటారు గానీ బాబయ్యా… ఏందిది..? ఇప్పుడు వేక్సిన్ వేసుకునేది ఎవరూ అనామకులు కాదు, నిరక్షరాస్యులు కాదు… అందరూ సిబ్బందే కదా… అందరికీ వేక్సిన్ గురించి తెలుసు కదా, పైగా కోవిన్ సాఫ్ట్ వేర్ అంటున్నారు, ఆధారత్‌తో అనుసంధానం అంటున్నారు… ఐనా గందరగోళం ఏముంది..? ఎవరికి ఏయే రోజు వేక్సిన్ వేయాలో ముందే గుర్తించి పెట్టారు కదా… మరిక అయోమయం ఏముంది..? అంతకుమించి ఓవర్ ల్యాప్ ఏముంటుంది..? హహహ… ఇదేమైనా వోట్ల పండుగా..? మళ్లీమళ్లీ వేర్వేరు పేర్లతో వచ్చి, దొంగ వోట్లు వేయటానికి..? ఒకసారి వేక్సిన్ వేశాక, మళ్లీ ఎందుకొస్తారు..? వచ్చినా వేక్సిన్ వేసేవాడికి ఇట్టే తెలిసిపోతుందిగా… రెండో డోస్ కోసం వచ్చినప్పుడు గుర్తించడానికి అనే వివరణ కూడా సరికాదు… తొలిసారి వేక్సిన్ వేసుకున్నవారి వివరాలన్నీ రికార్డవుతాయి… టీకాల కోసం అబద్ధాలు ఎవరూ ఆడరు…
Ads
హేమిటో… వాళ్లు డాక్టర్లే తప్ప, అడ్మినిస్ట్రేటర్లు కారు కదా… ఏదో ప్లాన్ చేస్తారు, అది అవసరమా కాదా కూడా ఆలోచించరు… పోనీలెండి ఫాఫం… అదే ప్రెస్మీట్లో కచ్చితమైన ప్రొటోకాల్ పాటించబడుతుందని కూడా గట్టిగా చెప్పారు వాళ్లు… ఏమనీ అంటే..? 18 ఏళ్లు నిండనివారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు వేక్సిన్ వేయబడదు అన్నారు… అసలు 18 ఏళ్లు నిండకుండా హెల్త్ సర్వీసులో ఎవరుంటారు సార్లూ..? గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు ఇవ్వబోం అని చెప్పడం వరకూ వోకే… 3.4 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికే మొదటి దశలో టీకాలు వేస్తామని చెబుతూనే… 18 ఏళ్లు నిండని వారికి వేక్సిన్ వేయడం లేదు అని నొక్కిచెప్పడం నవ్వు తెప్పించింది… ఈ ఇద్దరిలోనే ఒకరు, అప్పట్లో అక్టోబరు, నవంబరుకల్లా కరోనా కేసులు ఖతం అని డెడ్లైన్లు కూడా ప్రకటించిన తీరు కూడా గుర్తొచ్చి ఆ నవ్వూ కలిసింది…!!
Share this Article