ఏ యుద్ధం ఎందుకు జరిగెనో ?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో ?
తారీఖులు , దస్తావేజులు
Ads
ఇవి కావోయి చరిత్రకర్థం .
ఈ రాణి ప్రేమ పురాణం ,
ఆ ముట్టడికైన ఖర్చులూ ,
మతలబులూ , కైఫీయతులూ
ఇవి కావొయ్ చరిత్రసారం
ఇతిహాసపు చీకటి కోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు !
దాచేస్తే దాగని సత్యం ……. అన్నాడు శ్రీశ్రీ… అవును, మన చరిత్ర పాఠాల్లో అధికంగా ఢిల్లీ పాదుషాలే కనిపిస్తారు… ఆంగ్లేయులు, ముస్లిం వలసపాలకుల గురించే పిల్లల చేత బట్టీ పట్టిస్తున్నాం గానీ నిజమైన మన చరిత్ర, మన మూలాల చరిత్రల్ని మనం ఎందుకు పట్టించుకోలేదు..? మనకు ఆ సోయి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా ఎందుకు కలగడం లేదు..? పిల్లలు ఏం చదవాలో ఎవడు డిసైడ్ చేస్తున్నాడు అసలు..? అందులో హేతుబద్ధత, శాస్త్రీయత ఎంత..? ఈ మథనం, మార్పు ఎందుకు లేవు..?
బీజేపీ ప్రయత్నిస్తే కాషాయీకరిస్తోంది అంటారు… మరి దిక్కుమాలిన కంటెంట్ ఎలాగోలా తగ్గాలి కదా, ఎవరో ఒకరు కత్తిరించాలి కదా… పోనీ, హేతుబద్ధీకరించాలి కదా… తాజాగా బీజేపీ ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్చింది… గుజరాత్ అల్లర్లు, మొఘల్స్ పాలన, ఎమర్జెన్సీ, కోల్డ్‌వార్, నక్సలైట్ ఉద్యమం, గాంధీ మరణం తదితరాంశాలను పన్నెండో తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి తొలగించింది… వెంటనే సహజంగానే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపణలకు దిగాయి… బీజేపీ చరిత్రను పునఃలిఖిస్తోంది అంటూ…
2022లోనే సిలబస్ హేతుబద్ధీకరించాం, కొత్తగా ఏం చేయలేదని ఎన్సీఆర్టీ వర్గాలు ఖండిస్తున్నాయి… నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020 ప్రకారం సిలబస్ మార్చడం, కంటెంట్ తగ్గించడం తప్పనిసరి అంటున్నాయి… నిజానికి ప్రతిపక్షాలు చేసే విమర్శలే పాయింటెడ్‌గా లేవు… ఫలానా దగ్గర బీజేపీ పక్షపాతంతో ఉద్దేశపూర్వకంగా ఈ మార్పులు చేసిందనే వివరణ లేదు… అందుకని కాంగ్రెస్, ఇతర పక్షాల విమర్శలకు విలువ లేకుండా పోయింది…
ఒవైసీ నయం, చెబుతున్నది కరెక్టు కాకపోయినా సరే, క్లారిటీతో చెప్పాడు… గుజరాత్ అల్లర్లకు సంబంధించిన పాఠాలు తీసేశారని తన బాధ… తద్వారా పిల్లలు మేధోపరంగా ఎదగలేరట… ఈ బీజేపీ త్వరలో గాడ్సేను సమర్థించే రోజు కూడా దూరంలో లేదని ట్వీటాడు… నైతికశాస్త్రం పుస్తకాల్లో ‘నేను గాంధీని ఎందుకు చంపాను’ అనే గాడ్సే పాఠం కూడా వస్తుందేమో అని ఎకసక్కెం చేశాడు… గుజరాత్ అల్లర్లు సరే, మరి గోద్రా రైలు దుర్మార్గం వద్దా ఒవైసీ భాయ్…? పైగా గాడ్సేను బీజేపీ సమర్థించే రోజు త్వరలో రావడం ఏమిటి..? ఆల్‌రెడీ సమర్థిస్తోంది కదా…!! ఎస్, గాడ్సే వివరణ కూడా త్వరలో పాఠ్యపుస్తకాల్లో రావచ్చు, అంతేనా..? దేశవిభజన కాలంలో గాంధీ చేసిన తప్పుల పాఠం కూడా రావచ్చు…! మరీ ముఖ్యంగా భగవద్గీత సారాంశం పాఠాలుగా ప్రత్యక్షం కావచ్చు…!
Share this Article