దేశంలో ప్రబలుతున్న కొలువులకోత ప్రభావం న్యూస్‌రూమ్‌ల మీద కూడా పడుతోంది… ఇప్పుడు కాస్త తక్కువ, కరోనాకాలంలో వేలాది మందిని ఇళ్లకు పంపించేశారు… ఎడిషన్ కేంద్రాలు మూతపడ్డాయి… ప్రింటింగ్ ప్రెస్‌లకు తాళాలు పడ్డాయి… నిరుద్యోగం మీద వార్తలు రాసే జర్నలిస్టులు కూడా ఆ భూతానికే బలయ్యారు… మీడియా హౌజులను కూడా ఫ్యాక్టరీలుగా, దుకాణాలుగా చూసే ఓనర్ల వల్ల ఈ ఖర్మ…
తాజాగా ఓ ఇంట్రస్టింగ్ కథ… ఆయన పేరు Dadan Vishwakarma… ఐఐఎంసీ, అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ గ్రాడ్యుయేట్ ఆయన… ఆజ్ తక్ మాజీ జర్నలిస్టు… తమ చదువులు వేరు, చేపట్టిన వృత్తులు వేరు అన్నట్టుగా… మనం ఈమధ్య ఎంబీఏ చాయ్‌వాలా, బీటెక్ పానీపురివాలీ వంటి స్టోరీలు చదివాం కదా… ఇప్పుడు ఈయన కూడా ఆ జాబితాలోకి చేరిపోయాడు… ఆసక్తితో కాదు, అనివార్యత…
డిసెంబరు 2022లో ఆయనను ముందస్తు నోటీసు కూడా జారీ చేయకుండానే కొలువు నుంచి పీకేశారు… ఆయన భార్య నిండు గర్భిణి… రెండు నెలల్లో ప్రసవం బాకీ ఉంది… ఇండోర్‌కు చెందిన ఈయన విధి లేక ఓ కొత్త వ్యాపారం ప్రారంభించాడు… అదీ తమ ఫిలిమ్ సిటీ, నోయిడా ఆఫీసు బయట… దాని పేరు ‘పత్రకార్ పోహావాలా…’ మరేం చేస్తాడు… గత్యంతరం కనిపించలేదు తనకు…
Ads
ఈ తొలగింపు ఎంత ఆకస్మికం అంటే… తను ఆఫీసులో ఉపయోగించే ల్యాప్ టాప్ నుంచి తన వ్యక్తిగత డేటాను కూడా తీసుకోలేకపోయాడు… జస్ట్, సింపుల్‌గా తనను తొలగించారు, ఆఫీసు మెట్లు కూడా ఎక్కనివ్వలేదు… 13 ఏళ్లపాటు పలు ప్రముఖ మీడియా హౌజుల్లో పనిచేసిన ఆ సీనియర్‌కు తన భవిష్యత్తు ఏమిటో తనకే తెలియలేదు… హఠాత్తుగా బజారున పడితే, తదుపరి కొలువు మీద కూడా అనిశ్చితే…
अब इसे स्टार्ट अप कहिए, रोज़गार का साधन कहिए या जो भी. जगह- फ़िल्मसिटी, आजतक के सामने। t.co/6gklWv3Kk4— ANI (@ANI) Mar 20, 2023
సో, విశ్వకర్మ ఇండోరీ అటుకుల బిజినెస్ ప్రారంభించాడు… తన సోదరుడు ఇండోర్‌కు తిరిగి వెళ్లిపోయేముందు ఇదే పనిచేసేవాడు… స్ట్రీట్ ఫుడ్ దుకాణదారుగా మారిన ఈ జర్నలిస్టు తన కొత్త వ్యాపారం మీద బాగా నమ్మకంతోనే ఉన్నాడు… తనంత బాగా ఇంకెవరూ అటుకుల ఫుడ్ ప్రిపేర్ చేయలేరు అంటున్నాడు… గుడ్, ఈ సంపాదన నుంచి మాత్రం తననెవరూ పీకేయలేరు…
పత్రకార్ పోహావాలా… ఇక్కడ పత్రికల్లో పనిచేసే సిబ్బందికి వారి వారి హోదాలు, విధులను అనుసరించి, ప్రత్యేకంగా అటుకులు కలుపుతాడు… ఎడిటర్ స్పెషల్ పోహా, రిపోర్టర్ పోహా స్పెషల్, , హెచ్ఆర్ మేనేజర్ల కోసం హైరింగ్ – ఫైరింగ్ పోహా, అడ్మినిస్ట్రేషన్ వైట్ కాలర్ ఉద్యోగుల కోసం ప్రాఫిట్ పోహా… ఇలాగన్నమాట… అబ్బే, నేను ఎవరినీ నిందించడానికో, ఎత్తిచూపడానికో ఇక్కడే అటుకుల సెంటర్ ఓపెన్ చేయలేదు, నా కడుపు నింపుకోవడం కోసమే సుమా అంటున్నాడు విశ్వకర్మ…
మీకు ఇంకా సులభంగా ఈ వార్త అర్థం కావడానికి ఓ ఉదాహరణ… సపోజ్, ఈనాడులో ఓ రిపోర్టర్‌ను పీకేశారని అనుకుందాం… అక్కడే ఖైరతాబాద్ ఆఫీసు ముందే సదరు బాధిత ఉద్యోగి ‘‘ఈనాడు బజ్జీలు, పునుగుల సెంటర్’’ పెట్టుకున్నాడు అనుకొండి… సేమ్, ఇదీ అలాంటి వార్తే…
Share this Article