Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహిళ జర్నలిస్టుపై లెఫ్ట్ మూకల అసహనం… ఇంట్రస్టింగ్ ఎపిసోడ్…

April 8, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……… గత వారం రోజులుగా కేరళలో సుజయ పార్వతి పేరు ట్రెండింగ్ లో ఉంది ! అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రమే ట్రెండింగ్, ఎందుకంటే సుజయ పార్వతి పనిచేస్తున్నది ఒక న్యూస్ చానెల్ కాబట్టి ఇతర న్యూస్ ఛానెల్స్ ఇలాంటి వార్తలని ట్రెండ్ చెయ్యవు మరియు ప్రోత్సహించవు అన్న సంగతి తెలిసిందే !

మార్చి 8,2023 న ప్రపంచ మహిళా దినోత్సవం రోజున భారతీయ జనతా పార్టీ అనుబంధ కార్మిక సంస్థ BMS (Bharatiya Mazdoor Sangh) ఒక మహిళా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ మహిళా జర్నో అయిన సుజయ పార్వతిని ఆహ్వానించింది భారతీయ మజ్దూర్ సంఘ్ కేరళ శాఖ !

సహజంగానే లెఫ్ట్ వింగ్ ఆధిక్యత కలిగిన కేరళలో సుజయ పార్వతీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున BMS నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం ఆవిడ చేసిన తప్పు. కేరళలో హిందూ సాంప్రదాయాలని తూచ తప్పకుండా పాటించే వారిని అక్కడి లెఫ్టిస్ట్ లు పిలిచే పేరు సంఘీలు అని.

Ads

ఆ రోజున BMS నిర్వహించిన కార్యక్రమంలో సుజయ పార్వతీ కేంద్ర ప్రభుత్వ పని తీరుని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంని ప్రశంసలతో ముంచెత్తుతూ సుజయ పార్వతీ మాట్లాడిన తీరు అందరికీ నచ్చింది. మరీ ముఖ్యంగా ప్రధాని మోడీ పని తీరుని ప్రస్తావిస్తూ, మోడీ ఎలా పని చేసి చూపిస్తున్నారో మాట్లాడింది. చాలా మంది సుజయ పార్వతీ ప్రసంగాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

సుజయ పార్వతీ మాట్లాడుతున్నప్పుడు ఆ సమావేశానికి వచ్చిన లెఫ్ట్ వింగ్ వాళ్ళు మీరు సంఘీలా ? అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సుజయ పార్వతీ ప్రసంగానికి అడ్డు తగిలినా, ఆవిడ మాత్రం తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ పోయారు. చివరిలో ఆమె తన ప్రసంగాన్ని ముగిస్తూ ఇక్కడికి వచ్చిన కొంతమంది నన్ను ‘సంఘీ‘ అని నినాదాలు చేశారు, దానికి నేను సంతోషిస్తున్నాను అన్నారు.

మరుసటి రోజే సుజయ పార్వతీని News 24 చానెల్ CEO శ్రీకాంత్ నాయర్ [Srikanth Nair ] సస్పెండ్ చేశాడు ! గతంలో ఇదే శ్రీకాంత్ నాయర్ లెఫ్ట్ పార్టీ అనుబంధ కార్మిక సంస్థ CITU మరియు ఇతర లెఫ్ట్ వింగ్ సంస్థల సమావేశాలకి హాజరయ్యి ప్రసంగించాడు! జాతీయ భావాలు కలిగిన వాళ్ళని అందరినీ కేరళలో సంఘీలు లేదా ఫాసిస్ట్ లు అనే పిలిచే అలవాటు ఉంది గత దశాబ్దాలుగా ! So ! ఆ లిస్ట్ లోకి సుజయ పార్వతీని కూడా చేర్చేశారు !

మూడు సంవత్సరాల క్రితం సుజయ పార్వతీ ఆసియా నెట్ లో పనిచేసినప్పుడు అందరూ ఆవిడని లెఫ్ట్ లిబరల్ గానే భావించారు. అఫ్కోర్స్ నేను లెఫ్ట్ లిబరల్ అని ఆవిడ చెప్పుకోకపోయినా సుజయ పార్వతీ సహోద్యోగులు మాత్రం లెఫ్ట్ లిబరల్స్ కి ఉండే అన్ని లక్షణాలు ఆవిడలో ఉన్నాయనే చెప్పేవారు ! కానీ ఎక్కడో ఆవిడకి మార్పు కనిపించింది నిజాయితీగా ! కానీ బయటపడలేదు ఎప్పుడూ. బహుశా ఆ అవసరం రాలేదేమో ! లెఫ్ట్ లిబరలిజం పేరుతో జరిగే వికృత విన్యాసాలు ఒక సీనియర్ జర్నోగా దగ్గరగా చూసిన ఫలితం కావొచ్చు మార్పు వచ్చినట్లుంది ఆవిడలో !

సుజయ పార్వతీని సస్పెండ్ చేయగానే BMS ఆధ్వర్యంలో పెద్ద ఊరేగింపు జరిగింది నేరుగా News24 చానెల్ కార్యాలయానికి. ఆ ఊరేగింపులో BMS కి సంబంధం లేని వారు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు ! ఎందుకంటే సుజయ పార్వతీని సస్పెండ్ చేయడం సామాన్య ప్రజలకి కూడా నచ్చలేదు. ఆవిడ నమ్మిన దానిని స్వేచ్ఛగా చెప్తే అది లెఫ్ట్ లిబరలిజంకి వ్యతిరేకంగా ఎలా అయ్యింది ? ఇదే సామాన్య ప్రజలని ఊరేగింపులో పాల్గొనేలా చేసింది !

ఇక News 24 చానెల్ లో ప్రధాన షేర్ హోల్డర్ గోకులం గోపాలన్ CEO శ్రీకాంత్ నాయర్ విధించిన సస్పెన్షన్ ని తీవ్రంగా వ్యతిరేకించారు ! దానికి తోడు ఇతర షేర్ హోల్డర్స్ తోపాటు వివిధ ప్రజా సంఘాల నుండి ఒత్తిడి వచ్చింది శ్రీకాంత్ నాయర్ మీద సుజయ పార్వతీ సస్పెన్షన్ ని తీసివేయమంటూ ! దానికి తోడు మలయాళీ సోషల్ మీడియాలో News 24 చానెల్ CEO ని ట్రోల్ చేస్తూ రోజూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు నెటిజేన్లు !

ఫాసిస్ట్ అంటే ఏమిటీ ? ఫాసిజం అంటే ఏమిటీ ? లెఫ్ట్ లిబరిలజం అంటే ఏమిటి ? మాకు ఈ పదాలకి మలయాళంలో వివరంగా చెప్పగలరా శ్రీకాంత్ నాయర్ ? ఇలా News 24 చానెల్ CEO శ్రీకాంత్ నాయర్ ని ఉద్దేశిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఇవి బాగా ట్రెండ్ అయ్యాయి కూడా ! ఇక తమ చానెల్ ని బాయ్ కాట్ చేసే ట్రెండ్ ఒక్కటే మిగిలి ఉంది అని గ్రహించిన శ్రీకాంత్ నాయర్ తాను సుజయ పార్వతీ మీద వేసిన సస్పెన్షన్ ని ఉపసంహరించుకున్నాడు మార్చి 28న.

అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ! తన సస్పెన్షన్ ఎత్తివేశాక మళ్ళీ News 24 చానెల్ కి వచ్చిన సుజయ పార్వతీ ఆ స్టూడియోలో ఉన్న అందరికీ షాక్ ఇచ్చారు ! సుజయ పార్వతీ కాషాయ రంగు డ్రెస్ వేసుకొని మరీ ఆ రోజు వార్తలని చదివి, ఆ ప్రసారం ముగియగానే నేరుగా CEO శ్రీకాంత్ నాయర్ దగ్గరికి వెళ్ళి తన రాజీనామా లెటర్ ని ఇచ్చి అక్కడి నుండి బయటికి వచ్చేశారు !

ఈ వార్త మళ్ళీ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది! కొంతమంది నెటిజేన్లు కాషాయ రంగు డ్రెస్ వేసుకొని రోజూ వార్తలని చదవితే బాగుండేది కదా అంటూ తమ అభిప్రాయాలని వ్యక్తం చేయగా, మరి కొంతమంది సుజయా, మీరు రాజీనామా చేసి చెప్పుతో కొట్టారు మీ యజమానిని అంటూ పోస్టులు పెట్టారు !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions