Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్‌పై బ్లాంకెట్ బాంబింగ్..! అసలు రాధాకృష్ణ పొలిటికల్ ఎజెండా ఏమిటో..?!

April 9, 2023 by M S R

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈమధ్య కేసీయార్ మీద విరుచుకుపడుతున్నాడు కారణమేమిటబ్బా అని ఎంత ఆలోచించినా ఆంతర్యం అంతుపట్టడం లేదు… నిజానికి వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్… ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా కేసీయార్ పెద్ద సీరియస్‌గా తీసుకోడు, వెళ్లడు, అలాంటిది ఆంధ్రజ్యోతి ఆఫీసులో ఓ చిన్న అగ్నిప్రమాదం జరిగితే హుటాహుటిన వెళ్లాడు… పరామర్శించాడు… అయ్యో పాపం అన్నాడు… అట్లుంటది కేసీయార్‌తోని…

ఈమాట మళ్లీ ఎందుకు గుర్తుచేసుకుంటున్నామంటే… ఈరోజు తన ఎడిటోరియల్ ఫీచర్‌లో కేసీయార్ మీద ఫైరింగ్ చేశాడు రాధాకృష్ణ… ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఏ టీవీ అయినా, ఏ పత్రిక అయినా ఏదో ఒక కారణం లేనిదే సమర్థించదు లేదా వ్యతిరేకించదు… ఏ ధోరణి అయినా ఉద్దేశపూర్వకమే… మరి తన దోస్తు మీద ఇలా కారాలు మిరియాలు నూరుతున్నాడు దేనికి..? కేసీయార్ దెబ్బతింటే తన చంద్రబాబుకు ఫాయిదా వస్తుందనే భావనా..?

చంద్రబాబును ఇక తెలంగాణ సమాజం నమ్మడం కల్ల… అలాంటి భ్రమలు, ఆశలు రాధాకృష్ణలో ఉన్నాయని అనుకోలేం… అలాగని రాధాకృష్ణకు బీజేపీతో కూడా పెద్దగా పొసగదు… కాంగ్రెస్‌తోనూ దూరమే… మరెవరి కోసం కేసీయార్‌తో స్పర్థను కొనసాగిస్తున్నట్టు..? సరే, ఆ చర్చలోకి ఎందుకులే గానీ… మొన్నామధ్య ప్రముఖ జర్నలిస్టు రాజదీప్ సర్దేశాయ్ ఓ వీడియోలో మాట్లాడుతూ… నాన్ బీజేపీ కూటమికి నాయకత్వం వహించే చాన్స్ ఇస్తే, దేశంలోని ప్రతిపక్షాల మొత్తం ప్రచారవ్యయాన్ని భరిస్తానని కేసీయార్ ఆఫర్ ఇచ్చాడని వెల్లడించాడు…

Ads

అంతకుముందే రాధాకృష్ణ ‘‘తనతో చేతులు కలిపితే పవన్ కల్యాణ్‌కు 1000 కోట్లు ఇస్తానని కేసీయార్ ఆఫర్ ఇచ్చాడు’’ అని రాశాడు… కేసీయార్ నాన్ బీజేపీ పార్టీలకు డబ్బు సాయం చేశాడనీ, అందుకే బీజేపీ కేసీయార్ మీద కత్తికట్టిందనే వార్తలు అప్పటికే ప్రచారంలో ఉన్నాయి… అయితే రాజదీప్ సర్దేశాయి వ్యాఖ్యల మీద ఆధారపడి కేసీయార్ మీద గాయిగత్తర చేయడం రాజకీయంగా ధర్మమో కాదో తెలియదు గానీ బీజేపీ దాన్ని వినియోగించుకోవడంలో అట్టర్ ఫ్లాప్…

టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ మీద ఓ ఉద్యమాన్ని నిర్మించలేకపోయింది… నిజానికి లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశం కాబట్టి కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా మంచి అస్త్రం… కానీ అవి సక్సెస్ కాలేకపోయాయి… సేమ్, ప్రతిపక్షాలు మొత్తానికి ప్రచార వ్యయం భరిస్తానన్న కేసీయార్ ఆఫర్‌నూ పొలిటికల్ ఇష్యూ చేయలేకపోయాయి… ఒకవైపు కేసీయార్ బండి సంజయ్ మీద కేసులు పెడుతూ, అరెస్టులు చేస్తూ, మోడీకి సవాళ్లు విసురుతున్నా, బీజేపీ కేడర్‌ను డిమోరల్ చేస్తున్నా సరే బీజేపీ నుంచి దీటైన ఎదురుదాడి లోపించింది…

కేసీయార్ మీద ఏవో పరోక్ష వ్యాఖ్యలు మినహా మోడీ వైపు నుంచి దీటైన అటాక్ కనిపించలేదు… కేసీయార్ బిడ్డ కవితను అరెస్టు చేయలేని అసమర్థతే, కేడర్‌లో నైతిక ధైర్యం నింపలేని అసహాయతే ప్రధాని ప్రసంగంలోనూ రిఫ్లెక్టయింది… ఈ స్థితిలో కేసీయార్ ప్రతిపక్ష పాత్రను రాధాకృష్ణ పోషించాడు… ‘‘ఇంత డబ్బు కేసీయార్‌కు ఎక్కడి నుంచి వచ్చింది..? హైదరాబాద్ భూమి బేస్డ్ సంపాదన విపరీతంగా పెరిగిపోయింది’’ అంటూ రకరకాల అంశాల్ని ఒక్కచోట క్రోడీకరించి కేసీయార్ మీద బ్లాంకెట్ బాంబింగుకు పూనుకున్నాడు…

జేడీఎస్ కుమారస్వామి, జేఎంఎం హేమంత సోరెన్ వంటి నేతలు కేసీయార్ విసిరే ముష్టికి ఆల్‌రెడీ తలవంచేశారని వార్తలు… మమత, స్టాలిన్, ఠాక్రే, శరద్ పవార్, అఖిలేష్, తేజస్వి యాదవ్ వంటి నేతలూ డబ్బుకు లొంగుతారా..? అసలు నవీన్ పట్నాయక్, నితిశ్‌లు కేసీయార్‌ను నమ్ముతారా..? ఎక్కడా ఏ దిక్కూ లేని, సిద్ధాంత నిబద్ధత కూడా లేని లెఫ్ట్, ఉగ్రవాదులకు మద్దతు పలికే ఆప్ బహుశా కలిసొస్తాయేమో… ఆప్, బీఆర్ఎస్ బంధాల మీద కూడా వార్తలొస్తున్నాయి ఈమధ్య…

మరి మొత్తం ప్రతిపక్ష కూటమికి డబ్బు ఇస్తానని కేసీయార్ ఏ ధీమాతో ఆఫర్ ఇచ్చినట్టు..? అన్నింటికీ మించి కాంగ్రెస్ లేకుండా నాన్ బీజేపీ కూటమికి బలం లేదు… రాహుల్ గాంధీని కాదని కాంగ్రెస్ ఇంకెవరినీ ప్రధాని అభ్యర్థిత్వానికి ఆమోదించదు… ఈ సంక్లిష్ట సమీకరణం తెలియకుండానే కేసీయార్ వేల కోట్ల ధనాన్ని ప్రచారానికి ధారబోస్తానని ఆఫర్ ఇచ్చాడా..? లేక బీజేపీ హైకమాండ్ తెలివిగా, లోపాయికారీగా ఏదైనా గుప్తనాటకం ప్లే చేస్తోందా కేసీయార్‌ను ముందు నిలిపి..?! మజ్లిస్‌తో ఉన్నట్టుగానే…! ఏమో, అదీ రాధాకృష్ణే రాయాలి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘అనగనగా..’ ఓ సుమంతుడు… మరొక్కసారి అదే ఫెయిల్యూర్ అడుగు…
  • సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి అత్యంత కీలకమైన రాజ్యాంగ ప్రశ్నలు..!
  • అది సరే గానీ… మరి రేవంత్ రెడ్డి ఏమైపోతాడో చెప్పలేదేమిటి..?
  • ఫాఫం, తెలంగాణ వాళ్లు ఎవరూ దొరకడం లేదా సారూ..!!
  • దిక్కుమాలిన, తలకుమాసిన మర్యాద… వీటినే బానిస ధోరణులు అంటారు…
  • ఏ కులమైతేనేం… బలుపు చూపే కులంపై తిరగబడేవాడే,.. కర్ణన్…
  • సినిమా టైటిల్‌లో మొనగాడు ఉంటే చాలు… మనోళ్లకు ఖుషీ…
  • అంతే… ఆ స్పీచ్ తరువాత కాంగీ, సీపీఎం మొహాలు మాడిపోయాయ్…
  • యుద్ధంకన్నా క్లిష్టం… సింధు జలాల వాటాలు… దిక్కుతోచని పాకిస్థాన్…
  • వావ్ మద్రాస్..! అప్పట్లోనే ఆంధ్రాలీడర్లు ఇంకాస్త గట్టిగా పట్టుపట్టి ఉంటే..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions