Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, ఇండియా Vs ఇండియా, చైనా, రష్యా, ఇరాన్…

April 9, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి … భారత్- రష్యా- చైనా దోస్తీ, పార్ట్ 3… మన పొరుగు దేశం భూటాన్ తన మనసు మార్చుకుంది ! డోక్లాం వివాదం విషయంలో భారత్ కి ఎంత పాత్ర ఉందో చైనాకి అంతే పాత్ర ఉంది అని ప్రకటించింది ! So ! భూటాన్ చైనా ఒత్తిడికి లొంగిపోయింది ! భూటాన్ సహకారం లేకుండా మన దేశం ధోక్లాం విషయంలో పూర్తిగా కలుగచేసుకోలేం ! గత కొన్ని నెలలుగా భూటాన్ వైఖరిలో మార్పు రావడానికి కారణం కేవలం చైనా ఒత్తిడి ఒక కారణం అయితే అనవసరంగా భారత్ ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనే మరో కోణం కూడా ఉండి ఉండవచ్చు ! కానీ ధోక్లాం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండలేము, ఎందుకంటే పశ్చిమ బెంగాల్ నుండి ఈశాన్య రాష్ట్రాలని కలిపే ‘చికెన్ నెక్ ‘ ప్రాంతానికి దగ్గరలోనే ఉంది ధోక్లాం ట్రై జంక్షన్ ! ఇప్పుడు భూటాన్ మెతక వైఖరి వల్ల సమస్యని మన వైపు నుండే పరిష్కరించుకోవాల్సి ఉంటుంది !

అసలు భూటాన్ కి కావాల్సిన పెట్రోల్, డీజిల్ మరియు ఇతర నిత్యావసరాలు అన్నీ భారత్ నుండే వెళతాయి ! భూటాన్ కి అంటూ ప్రత్యేకంగా సైన్యం అంటూ ఏమీ లేదు కాబట్టి ఘర్షణ జరిగితే పూర్తిగా భారత్ మీదనే ఆధారపడాల్సి వస్తుంది. అలా అని వదిలేస్తే ఉక్రెయిన్ లాగా మన పొరుగుదేశంలో చైనా తిష్ట వేస్తుంది ! ఇప్పటికే నేపాల్ ని కోల్పోయాము ఇప్పుడు భూటాన్ వంతు వచ్చింది !

ఇటీవలే మన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ మాట్లాడుతూ చైనా లాంటి అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ ఉన్న దేశాన్ని ఎదుర్కోవాలి అంటే చాలా కష్టమయిన పని అని అన్నారు ! ఈ వ్యాఖ్య వల్ల అర్ధం అయింది ఏమిటంటే ఇప్పట్లో భారత్ చైనాని ఎదుర్కోవడం అనేది మన దేశ ఆర్ధిక వ్యవస్థని ఫణంగా పెట్టాల్సి ఉంటుంది అని !

Ads

భారత్ వైఖరిలో మార్పు రావడానికి కారణం ఏమిటీ ?

మార్చి నెల 2,2023 న చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ [Qin Gang] ఢిల్లీ వచ్చి మన విదేశాంగ మంత్రి జై శంకర్ తో సమావేశం అయ్యారు. అఫ్కోర్స్ వచ్చింది G-20 సమావేశాలలో భాగంగా, భారత్ ఆహ్వానం మీదనే కిన్ గాంగ్ వచ్చాడు. లడాక్ దగ్గర ఘర్షణ తరువాత చైనా విదేశాంగ మంత్రి భారత పర్యటన జరిగింది రెండేళ్ల తరువాత మార్చి నెల 2 న అన్నమాట !

జై శంకర్  – కిన్ గాంగ్ మధ్య రహస్య సంభాషణలు !

మార్చి నెల 2 వ తేదీన జరిగిన సమావేశంలో మొదట ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. కానీ తరువాత ఒక అరగంట సేపు జై శంకర్ మరియు కిన్ గాంగ్ మధ్య ఏకాంత సమావేశం జరిగింది అరగంట సేపు. దుబాసీ లేదా ట్రాన్స్లెటర్ లేకుండా ఇద్దరి మధ్య సమావేశం ఎలా సాధ్యపడింది ? జై శంకర్ కి మాండరీన్ వచ్చు కాబట్టి మధ్యలో దుబాసీ లేకుండా ఇద్దరూ మాట్లాడుకున్నారు !

ఏకాంత సమావేశంలో జరిగిన సంభాషణల మీద కొన్ని ఊహాగానాలు వచ్చాయి !

1. భారత్ భూటాన్ విషయంలో పట్టు విడుపులు ప్రదర్శిస్తే దానికి బదులుగా శ్రీలంక, నేపాల్ విషయంలో పెద్దగా కలుగుచేసుకోము అని కిన్ గాంగ్ హామీ ఇచ్చి ఉండవచ్చు !

2. కాంగ్రెస్ UPA-2 హయాంలో కాంగ్రెస్ మరియు చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య జరిగిన అవగాహన [MoU] గురించి చైనా వివరాలు ఇచ్చేందుకు వీలయితే ఒక కాపీ MoU కి సంబంధించినది ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు సమాచారం !

3. ఇప్పటికే కిన్ గాంగ్ నోటి మాటగా MoU లో ఉన్న విషయాన్ని జై శంకర్ కి చెప్పినట్లు సమాచారం !

4. రాహుల్ మీద పరువు నష్టం దావా కేసులో బిజేపి నాయకత్వం చూపిన దూకుడు మీద ఎవరికన్నా అనుమానాలు ఉంటే పక్కన పెట్టేయవచ్చు ! రాహుల్ కి ఎలాంటి మద్దతు లభించలేదు ఇప్పటివరకు.

5. బహుశా సోనియాతో పాటు ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులకి కూడా కిన్ గాంగ్ వచ్చి వెళ్ళిన తరువాత బిజేపి దూకుడు మీద అవగాహన వచ్చే ఉంటుంది.. పైగా యాక్టివ్ రాజకీయాల నుండి సోనియా తప్పుకోవడం కూడా ఇక మీదట చైనా తమకి సహకరించదు అనే తత్వం బోధపడి ఉండవచ్చు !

6. చాలా కాలంగా రాహుల్ ఇంగ్లాండ్ అమెరికా సహాయం కోరుతున్నాడు కానీ చైనా రాయబారిని కలవడం లేదు గమనించారా ?

7. అమెరికన్ సిఐఏ కంటే చైనాకే మన దేశ రాజకీయాల మీద పట్టు ఉంది కాబట్టి 2024 ఎన్నికలలో మళ్ళీ బిజేపి అధికారంలోకి రావడం తధ్యం కాబట్టి ఇక మీదట కాంగ్రెస్ తో సహకరించే కంటే బిజేపితో సఖ్యతగా ఉంటేనే మేలు అనే అభిప్రాయంకి చైనా వచ్చేసింది.

8. 60 లక్షల కోట్ల ధోరియం అవినీతి కేసుతో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ అవగాహన చేసుకున్న సీ హాక్ మల్టీ రోల్ హెలికాప్టర్ గురుంచి కూడా కిన్ గాంగ్ మరియు జై శంకర్ మధ్య ప్రస్తావన వచ్చి ఉండవచ్చు.

9. MH 60 ‘Romeo సీ హాక్ హేలీకాప్టర్ కి చైనా దగ్గర సమాధానం లేదు. హిందూ మహా సముద్రం లోపల చైనాకి చెందిన జలాంతర్గాములని వెంటాడి నాశనం చేయగల సత్తా MH 60 ‘Romeo లకి ఉంది. వీటి నుండి రక్షించుకోవడం కష్టం !

10. భారత్ దగ్గర ఈ MH 60 ‘Romeo సీ హాక్ లు ఉండడం చైనాకి పెద్ద నష్టాన్ని కలుగచేస్తుంది ఒకవేళ యుద్ధం అంటూ వస్తే ! ఏవో కొన్ని హామీలు తీసుకొని ఉండవచ్చు, బదులుగా మనకి కొన్ని హామీలు ఇచ్చి ఉండవచ్చు !

మరో సంవత్సర కాలంలో జనరల్ ఎన్నికలు ఉన్నవేళ బిజేపి దూకుడు పెంచడానికి ప్రధాన కారణం బహుశా చైనా నుండి MoU తాలూకు వచ్చిన సమాచారం అయి ఉండవచ్చు ! అఫ్కోర్స్ అరుణాచల్ ప్రదేశ్ లో G-20 సమావేశానికి మోడీ పంపిన ఆహ్వానాన్ని చైనా తిరస్కరించింది ! అరుణా చల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకి చైనా తన పేర్లని టాగ్ చేసింది కూడా ! దేని దారి దానిదే ! ఎందుకంటే యుద్ధం వలన రెండు దేశాలకీ నష్టమే !

పైన చెప్పిన అంశాలకి ఆధారాలు అంటూ నిర్దిష్టంగా ఏవీ లేవు కానీ ఇలా జరిగి ఉండవచ్చు అనేదానికి కొన్ని ఆధారాలని ప్రాతిపదికగా చేసుకొని విశ్లేషించవచ్చు ! అవి ….

1. 2022-23 బడ్జెట్ లో ఎలక్ట్రానిక్ పానెల్స్ తో సహా మరి కొన్నిటి మీద భారత ప్రభుత్వం పన్నులు తగ్గించింది, దిగుమతి చేసుకోవడానికి వీలుగా. ఇది చైనాకి లాభిస్తుంది ! మరి ఈ చర్య ఎందుకు తీసుకున్నట్లు ?

2. చైనా సంస్థల వాణిజ్య లోటు వల్ల $9 బిలియన్ నష్టం వచ్చింది అని కాబట్టి భారత్ తమ దేశం నుండి దిగుమతులు పెంచి 9 బిలియన్ డాలర్ల లోటుని పూడ్చాలసిందిగా చైనా ఇటీవలే భారత్ ని అభ్యర్ధించింది ఎందుకు ? చైనా ఇలాంటి అభ్యర్ధన చేయడం మరియు మన దేశం సానుకూలంగా స్పందించడం వెనుక దాగున్న రహస్యం ఏమిటి ?

3. మార్చి నెల 2 న చైనా విదేశాంగ మంత్రి భారత్ పర్యటన తరువాత 25 రోజులకే జింగ్పింగ్ రష్యా పర్యటనకి ఎందుకు వెళ్ళాడు ? కిన్ గాంగ్ ద్వారా భారత్ నుండి వచ్చిన సందేశాన్ని వ్యక్తిగతంగా వ్లాదిమిర్ పుతిన్ తో చర్చించడానికా ? ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ సమాధానాలు లేవు !

వ్యూహాత్మకంగా పశ్చిమ దేశాలతో బేరం ఆడే శక్తిని మన వద్ద ఉంచుకోవడానికి ప్రధాని మోడీ, అజిత్ దోవల్, జై శంకర్ ప్రణాళికా బద్ధంగా పని చేసుకుంటూ పోతున్నారా ? ఇలా అయితే ఏం చేయాలి ? ఒక వేళ అలా అయితే ఏం చేయాలి ? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వాటికి హేతు బద్ధమయిన సమాధానాలు మనమే చెప్పుకుంటూ ఏది ప్రయోజన కారిగా ఉంటుందో దానిని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు ! కాబట్టి భారత్, రష్యా, చైనా, ఇరాన్ కూటమి ఒక ఆప్షన్ గా మాత్రమే ఉంచుతున్నారు ! అంతిమంగా మన దేశానికి ఏది మేలు చేస్తుందో దానినే అమలు చేస్తారు అన్నమాట ! కాబట్టి చైనాతో దోస్తీ అనేది ఒక ఆప్షన్ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions