Adimulam Sekhar……… జస్టిస్ చంద్రు అయినా…డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అయినా…ఆ మీడియా తీరు అంతే..! కర్నూలు జనరల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గుండె జబ్బుల నిపుణులుగా మంచి పేరు వుంది. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను పొగుడుతూ సొషల్ మీడియాలో కవిత రాశారంట. చిర్రెక్కిన ఓ పత్రిక ఓ డాక్టర్ స్వామి భక్తి అంటూ మెయున్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనపై వృత్తి పరమైన ఆరోపణలూ చేసింది.
డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తన సేవలతో రోగుల మన్నలు పొందారు. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటారు. సినిమాలు, రాజకీయాలు, వైద్యం ఇలా అన్ని అంశాలపై స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన ఆయనకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు కరోనాకాలంలో ఎందరికో విలువైన వైద్య సలహాలు ఇచ్చారు. కర్నాలులో వున్నా మన ఎదుటే వున్నట్టు భరోసా ఇస్తుంటారు. అలాటి వైద్యుడు తన అభిప్రాయం చెప్పడమే నేరమైనట్టు ఆ పత్రిక కథనం రాసింది. అది జగన్ మీద అక్కసుతో రాసిందని ఎవరికైనా అర్థమవుతుంది.
Ads
అది జస్ట్ చంద్రు విషయమైనా, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంశమైనా బోధపడేది ఒకటే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ను పొగిడినా లేదా తెలుగుదేశం పార్టీని విమర్శించినా పచ్చ మీడియా ఊరుకోదు. వారు ఎంతటి వారైనా తమదైన పద్ధతిలో దాడికి పూనుకుంటుంది. ఎవరైనా మా జోలికొస్తే ఖబడ్దార్ అని బెదిరిస్తుంది. ఇటువంటి మీడియా రౌడీయిజం.. సోషల్ మీడియా యుగంలో సాగదని ఆ మీడియా ఎప్పుడు గుర్తిస్తుందో..! మొన్న జస్టిస్ చంద్రూకిగానీ నేడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గానీ సోషల్ మీడియామే అండగా నిలబడింది…
Share this Article